కీలక వడ్డీ రేట్లు యధాతథం
ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే రెపోరేట్, సీఆర్ఆర్ యధాతథంగా ఉంటాయని పేర్కొంది. ఎస్.ఎల్.ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లుకు తగ్గించింది. ఇది ఇలా ఉండగా మంగళవారం ముంబై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని వెల్లడించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. ఆర్బీఐ ప్రకటనలో స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా పయనిస్తున్నాయి.