సతీశ్ రెడ్డికి సీఎస్ఐ గౌరవ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ, డీఆర్డీవో) డెరైక్టర్ డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)’ సంస్థ గౌరవ ఫెలోగా ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సీఎస్ఐ 49వ వార్షిక సదస్సు సందర్భంగా సతీశ్‌రెడ్డిని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సత్కరించి ఈ మేరకు సీఎస్ఐ గౌరవ ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేశారు.