cuavery water dispute
-
క్షమించమని సిద్ధార్థ్‌ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్‌వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్‌కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్‌ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్‌కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
కేసీఆర్ యాదృచ్ఛికంగా సీఎం అయ్యారు..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ యాక్సిడెంటల్ సీఎం అయ్యారని, ఆయన అబద్దాలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారన్నారు. మాయమాటలు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీర్ మరోసారి తన అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పొన్నాల సోమవారమిక్కడ విమర్శించారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తేలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని, ఈ రోజు ఆయన తెలంగాణ సీఎం అయ్యారంటే అది కాంగ్రెస్ చలవతోనే అని, ఆ విషయం మర్చిపోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాత్నాల గురించి పొన్నాల మాట్లాడుతూ ‘అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అది చాలదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డారు. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి కోవర్టు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన ఫెడరల్ ఫ్రంట్‌కు ఆదిలోనే పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిన్న డీఎంకే నేత స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని కేసీఆర్ మొహం మీదనే కాదని తేల్చేశారు. కాంగ్రసేతర ప్రత్యామ్నాయం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన స్టాలిన్, కావేరి సమస్య పై బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండగా జేడీఎస్‌కు ( బీజేపీ , జేడీఎస్‌ల అవగాహన నేపధ్యంలో ) మద్దతు పలుకుతున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మా మద్దతు ఎలా ఆశిస్తారు అని ప్రశ్నించారు. దీనిక కేసీఆర్ ఏం బదులిస్తారు’ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి కేసీఆర్ ...మమత బెనర్జీని కలిస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం అన్నారు. కేసీఆర్ హేమంత్ సొరేన్ ను కలిసిన మరుసటి రోజే ఆయన సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక నవీన్ పట్నాయక్ అయితే, ‘కేసీఆర్‌నును నేను ఆహ్వానించలేదు ఆయన వస్తా అంటే రమ్మన్నాను. రాజకీయాలు ఏమి లేవు’ అని కొట్టి పారేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరో అడుగు ముందుకేసి ‘కేసీఆర్ మూడో ఫ్రంట్ మూసి లాంటిది, కంపు కొడుతుంది’ అని మరింత ఘాటుగానే విమర్శించారు అని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడో ఫ్రంట్‌ను అడ్డం పెట్టుకొని తన పార్టీలోని అంతర్గత రాజకీయాలను అధిగమించాలని కేసీర్ అడుగులు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
జల జంజాటం!
పట్టించుకోనట్టు నటిస్తే... భారాన్ని న్యాయస్థానాలపైకి నెట్టేస్తే గండం గట్టెక్కుతా మని భావించే పాలకులకు కావేరీ నదీజలాల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలు చెంపపెట్టు. కావేరీ వివాదంపై ఫిబ్రవరి 16న వెలువరించిన తీర్పులో ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు అందవలసి ఉంటుందో సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ తీర్పు అమలుకు అవసరమైన విధివిధానాలను ఆరు వారాల్లో రూపొందించాలని, ఈ నదీజలాలను వినియోగించుకునే నాలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక నిపుణులతో కావేరీ యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దాని ప్రకారం ఏప్రిల్ మొదటి వారానికల్లా ఇవి అమలు కావాలి. కానీ అది జరగకపోవడంతో కేంద్రం కోర్టు ధిక్కారానికి పాల్ప డిందని తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే... గడువును మార్చాలంటూ కేంద్రం కోరింది. మార్చి 31న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటాన్ని అందుకు కారణంగా చూపింది. నదీ జలాల వివాదం భావోద్వేగాలతో కూడుకున్న అంశం గనుక శాంతిభద్రతల సమస్య తలెత్తి ఎన్నికలకు ఆటంకం కలిగే ప్రమా దమున్నదని చెప్పింది. కానీ ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. విధివిధా నాల ఖరారుపై శ్రద్ధ చూపకపోవడాన్ని తప్పుబట్టి ‘అసలు జల వివాదాల పరిష్కా రంపై మీకు ఆసక్తి ఉందా లేదా’ అని నిలదీసింది. వచ్చే నెల 3 లోపు ఆ ఆదేశాన్ని అమలు చేసి తీరాలని హెచ్చరించింది. ఈ విషయంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. కేంద్రంలో ఎవరున్నా నదీ జలాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు. రుతుపవనాలు కరుణించి పుష్కలంగా వర్షాలు పడితే కావేరీ నది విషయంలో మాత్రమే కాదు... ఏ నది విషయంలోనూ వివాదాలుండవు. కానీ రుతుపవనాలు ముఖం చాటేసినప్పుడు నదీ పరీవాహ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుంది. అప్పు డిక ఉద్రేకాలు పెరుగుతాయి. ఆందోళనలు మొదలవుతాయి. మా గొంతు తడవటం లేదని ఒకరంటే, మా పొలాలు ఎండిపోతున్నాయని మరొకరంటారు. దశాబ్దాలుగా ఇదే సాగుతోంది. కేంద్రంలో ఉండే పాలకులు రాజకీయ ప్రయోజనాలనాశించి ఆలో చించడం వల్ల సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగులుతోంది. ‘ఎంతకాలం దీన్ని సాగ దీస్తారు... తక్షణం కావేరీ నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండ’ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప 1990లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం చొరవ ప్రదర్శించలేదు. ఏడాది తర్వాత ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో కర్ణాటక రణక్షేత్రంగా మారింది. ఆ రాష్ట్రంలోని తమిళులు ప్రాణ భయంతో స్వరాష్ట్రానికెళ్లి పోవాల్సివచ్చింది. దానికి పోటీగా తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. ఆ తర్వాత వర్షాలు సక్రమంగా పడటంతో మరో అయిదేళ్ల వరకూ అంతా బాగానే ఉంది. కానీ 1995లో మరోసారి కరువు పరిస్థితులు ఏర్పడటంతో పోటాపోటీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో అయి దారేళ్లకు మళ్లీ ఇదే పునరావృతం అయింది. అంతా బాగున్న సమయంలో అన్ని రాష్ట్రాలనూ సమావేశపరిచి, నిపుణుల సాయం తీసుకుని ఒక పరి ష్కార మార్గం కనుగొనడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. భావోద్వేగాలు లేన ప్పుడు అన్ని పక్షాలనూ ఒప్పించడం సులభం. కానీ సమస్య పీకల మీదికొచ్చిప్పుడు ప్రభుత్వాలు ఏదో చేసినట్టు నటిస్తున్నాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వ్యవ హరిస్తున్నాయి. ఫలితంగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా లేనిపోని వైషమ్యాలు పెరుగు తున్నాయి. వారం రోజులుగా తమిళనాడు అట్టుడుకుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అను గుణంగా చర్యలు తీసుకోవాలని దాదాపు అన్ని ప్రాంతాల్లో ధర్నాలు జరుగు తున్నాయి. చెన్నైలో మంగళవారం ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్‌ను అడ్డుకునేం దుకు జనం వీధుల్లోకొచ్చారు. పోలీసులు అనేకచోట్ల లాఠీచార్జి చేశారు. నిరసనలో పాలుపంచుకుంటున్న సినీ రంగ ప్రముఖులతోసహా 3,500మందిని అరెస్టు చేశారు. నిజానికి ఈ సమస్య కేవలం కర్ణాటక, తమిళనాడులది మాత్రమే కాదు... ఇందులో కేరళ, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలూ ఎవరెంత నీటిని వాడుకోవాలో 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) తీర్పు చెప్పింది. అయితే తమకు అన్యాయం జరిగిందంటూ అన్ని పక్షాలూ సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. పర్యవసానంగా సుప్రీంకోర్టు ఆ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో ఫిబ్రవరి 16న స్వల్పంగా మార్పులు చేసింది. తుది తీర్పు ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు(ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 14.75 టీఎంసీల కోత), కర్ణాటకకు 284.75 టీఎంసీలు (అంతక్రితంకంటే 14.75 టీఎంసీలు అధికం) కేటాయించింది. కేరళకు కేటాయించిన 30 టీఎంసీలు, పుదుచ్చేరికిచ్చిన 7 టీఎంసీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కేటాయింపులు 15 ఏళ్ల వరకూ కొనసాగుతాయని చెప్పింది. ప్రస్తుతం కర్ణాటకలో కావేరీ పరీవాహ ప్రాంతంలో కృష్ణరాజసాగర్, హరంగి, హేమవతి, కబిని జలాశయాలున్నాయి. వీటి పరిధిలో వ్యవసాయాన్ని కర్ణాటక విస్తరిస్తున్నకొద్దీ ఆ మేరకు తమిళనాడులోని రైతులకు నీటి లభ్యత తగ్గిపోతోంది. ఇక వర్షాభావ పరిస్థితులుంటే వారి సమస్య మరింత పెరుగుతుంది. ఒక్క కావేరీ విషయంలో మాత్రమే కాదు... దాదాపు అన్ని నదీ పరివాహ ప్రాంతాల్లోనూ ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై దిగువ రాష్ట్రాలు ఆధారపడాల్సి వస్తోంది. వరదలొ చ్చిప్పుడు ఎనలేని నష్టం చవిచూడటం... వానలు పడనప్పుడు ఎగువ రాష్ట్రాలను ప్రాధేయపడటం, గొడవపడటం దిగువ రాష్ట్రాలకు తప్పడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు నదుల్ని జాతీయ ఆస్తులుగా పరిగణించి పరీవాహ ప్రాంతాల్లోని రాష్ట్రా లన్నీ తమ అవసరాలతోపాటు వేరే రాష్ట్రం సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని హేతుబద్ధంగా వ్యవహరిస్తే జల వివాదాలుండవు. మౌలికంగా జల వివాదాలు రాజకీయపరమైనవి. వాటిని పరిష్కరించే బాధ్యతను రాజకీయ నాయకత్వమే తీసుకోవాలి. అన్ని పక్షాలకూ నచ్చజెప్పాలి. న్యాయస్థానాలకొదిలి, ఏళ్ల తరబడి నాన్చితే అవి ఉన్నకొద్దీ జటిలంగా మారి కొరకరాని కొయ్యలవుతాయి. ప్రజల మధ్య çసుహృద్భావ వాతావరణం దెబ్బతింటుంది. కేంద్రం వీటిని దృష్టిలో ఉంచు కుని జాగ్రత్తగా అడుగులేయాలి. -
స్టాలిన్ భారీ ర్యాలీ
తమిళనాడు : కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు కోసం తమిళపార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నటివరకూ కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ.. తమిళనాడు ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంతో పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడటంతో రాష్ట్ర వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు కోరుతూ... డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ శనివారం ముక్కుంబులో భారీ ర్యాలీను ప్రారంభించారు. కావేరీ డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. స్టాలిన్ ప్రారంభించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముత్తారాసన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌తో పాటు డీఎంకే కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు నుంచి స్టాలిన్ ఈ ర్యాలీని ప్రారంభించగా, మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా ఆయాలూరు నుంచి మరో ర్యాలీని ప్రారంభించారు. ఈ రెండు ర్యాలీలు ఏప్రీల్ 13న కడలూరులో డీఎంకే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కలువనున్నాయి. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయని స్టాలిన్ విమర్శించారు. -
‘కావేరి’ కోసం ముఖ్యమంత్రి దీక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటక, తమిళనాడులకు కావేరీ నదీజలాల పంపిణీ కోసం కావేరి మేనేజ్మెంట్ బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేయాలంటూ అన్నాడీఎంకే మంగళవారం తమిళనాడులో రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మంత్రులు చెన్నైలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయని కేంద్రం వైఖరిని నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీలు, రైతు, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాయి. వాణిజ్య సంఘాల పిలుపుతో 30,000 ఫార్మసీ దుకాణాలతోపాటు అన్ని రకాల అంగళ్లు మూతపడ్డాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ అడుగులకు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే మడుగులు ఒత్తుతోందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. చెన్నైలో డీఎంకే చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. దీక్షల పేరుతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కపటనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘కావేరి’ పిటిషన్లపై 9న విచారణ: సుప్రీం న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పష్టత కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 9న విచారించనుంది. కావేరి బోర్డును ఏర్పాటు చేయడంపై సంబంధిత రాష్ట్రాల వాదనలను కేంద్రం తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఈ నెల 9న తమిళనాడు పిటిషన్‌తోపాటే కేంద్రం పిటిషన్‌నూ విచారిస్తామని కోర్టు చెప్పింది. -
వోల్వో బస్సుకు మంటలు.. చిన్నారి మృతి
-
బస్సుకు మంటలు.. చిన్నారి మృతి
కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు. దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు.