తమిళనాడు : కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు కోసం తమిళపార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నటివరకూ కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ.. తమిళనాడు ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంతో పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడటంతో రాష్ట్ర వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు కోరుతూ... డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ శనివారం ముక్కుంబులో భారీ ర్యాలీను ప్రారంభించారు.
కావేరీ డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. స్టాలిన్ ప్రారంభించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముత్తారాసన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌తో పాటు డీఎంకే కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు నుంచి స్టాలిన్ ఈ ర్యాలీని ప్రారంభించగా, మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా ఆయాలూరు నుంచి మరో ర్యాలీని ప్రారంభించారు. ఈ రెండు ర్యాలీలు ఏప్రీల్ 13న కడలూరులో డీఎంకే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కలువనున్నాయి. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయని స్టాలిన్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment