Cultures
-
17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు
రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (ఎఫ్‌ఓజీ),ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం కనిపించనుంది. ఇండియా డే పరేడ్, ఫెయిర్‌లో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెల్నెస్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ, హిప్-హాప్ తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ అమెరికాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. -
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్‌పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్‌తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్‌లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..? -
మేడారంలో ‘గుడిమెలిగె’
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్): మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న గుడిమెలిగె పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రంనుంచి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం (9న) మండమెలిగె పండుగకు వారానికి ముందుగా గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారంలోని సమ్మక్క గుడి పూర్వకాలంలో గుడిసెతో ఉండేది. గుడిసెపై కొత్త గడ్డి కప్పి, పందిళ్లు వేసేది. సమ్మక్క గుడి భవనం నిర్మించడంతో పూజారులు సంప్రదాయంగా బుధవారం ఉదయాన్నే సమ్మక్క గుడిని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరిస్తారు. అడవినుంచి సేకరించిన ఎట్టిగడ్డిని గుడిపై ఈశాన్య దిశలో పెడతారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి గుడిమెలిగె పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగానే భావించాలి. కన్నెపల్లి సారలమ్మ గుడిలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజారులు సిద్ధం గుడిమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం సమ్మక్క పూజారులు సమావేశమై పండుగ కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకున్నారు. ఉదయాన్నే పూజారులు తలస్నానాలు అచరించి అడవికి వెళ్లి ఎట్టిగడ్డిని తీసుకురానున్నారు. గుడిమెలిగె సందర్భంగా భక్తులు కూడా వేలాది మంది తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. పూజా కార్యక్రమాలన్నింటినీ సమ్మక్క పూజారులు సిద్దబోయిన మునిందర్, కొక్కర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూపగడ్డ నాగేశ్వర్రావు, బొక్కెన్న, సిద్దబోయిన లక్ష్మణ రావు, సిద్దబోయిన మహేష్, పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తదితరులు నిర్వహించనున్నారు. చదవండిః ‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్ -
సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూట్లు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన లొకేషన్స్.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్‌షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. రూ.20 వేల వరకు చార్జి ఒక్కో ప్రీవెడ్డింగ్ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్‌కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధుర జ్ఞాపకం ప్రీ వెడ్డింగ్ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్‌తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నాం. – సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్ సినిమా తరహాలో వెడ్డింగ్ షో సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. – నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చదవండి: మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి! -
ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...!
చైనాలో సెలబ్రిటీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిపై ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంది. ఇంతకీ అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుంది..? చర్యలతో ఏం సాధించాలని చూస్తుంది..? చైనా కమ్యూనిజానికి మించి అక్కడి సెలబ్రిటీలు పాపులర్ కావడం సహించలేక పోతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలపై గుర్రుగా ఉంది. వారిపై కొత్త ఆంక్షలు విధించి వేధిస్తుంది. సోషల్ మీడియాలో వారి సంపద, లైఫ్‌స్టైల్ పై గొప్పలు చెప్పకుండా నిషేధం విధించింది. అందుకే సెలబ్రిటీ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు కొత్తరూల్ తెచ్చినట్లు సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తెలిపింది. సెలబ్రిటీ కల్చర్ చాలా ప్రమాదం.. సెలబ్రిటీ కల్చర్, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాలకు చెందిందని, అది ప్రమాదకర అంశం అనేది చైనా ప్రభుత్వ బావన. ఇదే చైనా దేశ కమ్యూనిజానికి ముప్పు తెస్తుందనేది వారి వాదన. అందుకే సెలబ్రిటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. కొందరి సెలబ్రిటీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చి కదలికలను కనిపెడుతోంది.అంతేకాదు ట్యాక్స్‌లు ఎగ్గొట్టారంటూ అక్రమ కేసులు బనాయించి..సెలబ్రిటీలకు భారీగా జరిమానా విధిస్తుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తుంది. వారి వాదనలు ప్రజల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. వెబ్సైట్ల నుంచి సెలబ్రిటీల వీడియోల్ని తొలగించి వారిని ఫ్యాన్స్‌కి దూరం చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జెంగ్ షువాంగ్ ఉదంతం. 2009లో తైవాన్ టీవీ సీరిస్ 'మేటర్ షవర్' (Meteor Shower) రీమేక్ తో 'జెంగ్ షువాంగ్' బుల్లితెరకు పరిచయమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె చైనా దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలలో తొలిస్థానంలో ఉంది. మిగిలిన సెలబ్రిటీల కంటే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగే ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. డ్రాగన్ కంట్రీ సెలబ్రిటీలపై తెచ్చిన కొత్త చట్టం జెంగ్ షువాంగ్ను ఆకాశం నుంచి అథఃపాతాళానికి..చేర్చింది. చైనా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నటిపై చర్యలు తీసుకుంది. ఆమె పన్నులు చెల్లించడం లేదనే కారణంతో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రూ.337 కోట్లు జరిమానా విధించి, చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యూలేటర్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిలిపివేసింది. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని డ్రాగన్ కంట్రీ హెచ్చరికులు జారీ చేసింది. చదవండి: చైనా మీదే జోక్.. భారీ డ్యామేజ్ భయంతో ముందే క్షమాపణలు! -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
ప్రపంచానికి అప్లికేషన్
విభా నాయక్ నవ్రే... హైదరాబాద్‌లో స్థిరపడిన... మరాఠా కుటుంబానికి చెందిన అమ్మాయి. బిబిఎ ఫైనలియర్ చదువుతోంది. చైనాకు వెళ్లి... స్కూలు పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పే వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. కానీ ఇప్పుడు కొంచెం ప్రత్యేకం.దేశం ఎల్లలు దాటి కొత్త సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల మధ్య మెలిగిన అనుభవంతో కూడిన ప్రత్యేకత అది. ఖండాంతరాల నుంచి వచ్చిన విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకున్న తర్వాత కలిగిన ఆకళింపు విభాది.ఐక్యరాజ్య సమితి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోమని తోటియువతకు పిలుపునిస్తోంది విభా. ‘‘ఇంట్లో చిన్నదాన్ని కావడంతో, అది కూడా అమ్మాయిని కావడంతో విపరీతంగా పాంపర్ చేసేవాళ్లు. అమ్మ, నాన్న, అన్నయ్యల గారాబాన్ని ఎంజాయ్ చేస్తూ పెరిగాను. కొన్ని దేశాల్లో పిల్లల్ని ఇండిపెండెంట్‌గా పెంచుతారు. మనదేశంలో దాదాపుగా అన్ని ఇళ్లలోనూ పిల్లల్ని ఇలాగే ముద్దు చేస్తుండవచ్చు. అందుకే మనదేశం యువతకు ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ చాలా అవసరం అంటాను. నాక్కూడా ఆ సంగతి చైనాకు వెళ్లిన తర్వాతే తెలిసింది. అప్పటి వరకు ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ల వైపు చూస్తే సరిపోయేది. వాళ్లే సొల్యూషన్ వెతికి పెట్టేసేవాళ్లు. ఒకసారి దేశం సరిహద్దు దాటి బయటకు వెళ్లిన తర్వాత మనకెదురైన సమస్యకు పరిష్కారాన్ని మనమే వెతుక్కోవాలి. మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. మనకూ ఆలోచించే శక్తి ఉందని, అది అవసరానికి తగినట్లు మనకోసం కొత్త దారిని ఆవిష్కరిస్తుందని తెలిసొస్తుంది. చైనాలో ఇంగ్లిష్‌కి ఎంట్రీ ‘ఐసెక్’ తరఫున గ్లోబల్ వాలంటీర్ కేటగిరీలో గత ఏడాది మే నెలలో చైనాకి వెళ్లాను. చైనాలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి అనుమతి లేదు. కేవలం వి చాట్‌కి మాత్రమే పర్మిషన్. అక్కడ ‘దాలియన్ చి’ సిటీలో దోంగ్బాయ్ యూనివర్సిటీలో మాకు ఇంటర్న్‌షిప్ ఇచ్చారు. ఆ దేశం చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం నా ప్రాజెక్ట్. స్కూల్లో మొత్తం సిలబస్ అంతా చైనీస్ మీడియంలోనే సాగుతుంది. స్కూల్ తర్వాత డే కేర్ సెంటర్లలో ఒక గంట ట్యూషన్ ఉంటుంది. ఆ గంటలో ఇంగ్లిష్, మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటారు. చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో స్కూల్ లెవెల్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. కానీ ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఈ తరంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని, మంచి ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష ఎక్కువైంది. చైనాలోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వచ్చిన విదేశీ విద్యార్థులతో మమైకం కావాలంటే భాష పెద్ద అడ్డంకిగా ఉండేది వాళ్లకు. దాంతో ప్రభుత్వం కరికులమ్‌లో ఇంగ్లిష్ భాషను ఒక సబ్జెక్టుగా చేర్చింది.ఉపాధి అవకాశాలు ఎక్కువచైనా వాళ్లలో పనిని గౌరవించడంతోపాటు చట్టం పట్ల అంకితభావం కూడా ఎక్కువే. కమ్యూనిస్ట్ దేశం కాబట్టి, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయేమో అనుకుంటాం. కానీ అక్కడి మనుషులు నిబంధనను పాటించడం తమ బాధ్యత అన్నట్లు ఉంటారు. ప్రభుత్వం కూడా ప్రజల అభీష్టం మేరకు కొన్ని సడలింపులు చేసుకుంటోంది. ఒకప్పుడు ‘వన్ ఫ్యామిలీ.. వన్ చైల్డ్’ నిబంధన ఉండేది. ఇప్పుడు రెండవ బిడ్డను కనడానికి అనుమతి ఉంది. కమ్యూనిస్ట్ దేశమైనా సరే మతవిశ్వాసాలకు కూడా గౌరవం ఉంది. అక్కడ ఎక్కువగా బౌద్ధాన్ని పాటిస్తారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ చైనీస్ భాషలోనే జరగడం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే... పెద్దగా చదువుకోని వాళ్లు కూడా ఇండస్ట్రీలు పెట్టి సమర్థంగా నడిపించుకోగలుగుతున్నారు. అక్కడ టీచింగ్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నికల్ ప్రాజెక్ట్‌లలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చైనాకి వెళ్లే ముందు అక్కడి వాళ్లు ముభావంగా ఉంటారేమోనని అపోహ పడ్డాను, కానీ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. చైనాలో 45 రోజులు ‘ఐసెక్’ అనేది ప్రపంచంలోని రకరకాల సంస్కృతులను తెలుసుకోవడమే ప్రధానంగా ఏర్పాటైన సంస్థ. అందుకే వైవిధ్యభరితమైన సంస్కృతి సంప్రదాయాలున్న దేశాల్లో ఇంటర్న్‌షిప్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మనదేశంలో ఉన్నట్లే చైనాలో కూడా ఒక నగరానికి మరో నగరానికీ మధ్య స్పష్టమైన వైవిధ్యం కనిపిస్తుంది. దాలియన్ చి నగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీజింగ్ నగరం మాత్రం మన ముంబయిలాగా ఉరుకులు పరుగుల మధ్య రోజు గడుపుతుంటుంది. వాతావరణం కూడా ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. దాలియన్ చి నగరంలో మే నెలలో ఉష్ణోగ్రతలు ఏడు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉంటాయంతే. ఆ దేశంలో ప్రతి నగరానికి ఓ చరిత్ర ఉంది. వైవిధ్యమైన కళలున్నాయి. మనం తిన్నట్లే చైనాలో కూడా చాలా చోట్ల ప్లెయిన్ రైస్ ప్రధాన ఆహారంగా తింటారు. చికెన్, బీఫ్, పోర్క్, ఎగ్, ఉడికించిన కూరగాయలు ఉంటాయి. పాలు, పెరుగు బాగా తీసుకుంటారు. అయితే కాఫీ, టీలలో పాలు కలపరు. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీతోపాటు అక్కడ చైనీస్ టీ అని ప్రత్యేకంగా మరో టీ వెరైటీ ఉంటుంది. ఒక దేశం చరిత్ర, సంస్కృతి, సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదవడం కంటే ఒకసారి పర్యటించి అధ్యయనం చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని నాకనిపించింది. ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ చేయడం పై చదువులకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఐసెక్‌లో సీనియర్ మేనేజర్‌గా సర్వీస్ ఇస్తున్నాను. ఒకసారి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరితే మనలోని శక్తి బయటకు వస్తుందని చైనాలో ఉన్న ఆ నెలన్నర రోజుల్లో తెలుసుకున్నాను. స్పోర్ట్స్ పర్సన్నే కానీ..! నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మంచి టెన్నిస్ ప్లేయర్‌ని. చింతల్‌లోని సెయింట్ మార్టినా స్కూల్‌ని రిప్రజెంట్ చేశాను. 2014లో నేషనల్స్ ఆడి తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ తెచ్చాను. కానీ టెన్నిస్‌ను కొనసాగించలేకపోయాను. కొంతకాలం కోచ్‌గా శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో స్థిరపడాలనేది నా కోరిక’’. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటో: శివ మల్లాల విద్యార్థులే... విద్యార్థుల కోసం..! ఐసెక్ అనేది యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఆర్గనైజేషన్. ఐసెక్ ద్వారా విదేశాలకు వెళ్లి ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే వాళ్లు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఇందులో వాలంటీర్, టాలెంట్, ఎంట్రప్రెన్యూర్ విభాగాల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఎంట్రప్రెన్యూర్ ఎంపిక చేసుకునే వాళ్లకు ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉండాలి. కాలేజ్ చదువు పూర్తయిన వాళ్లు టాలెంట్ కేటగిరీలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఈ కేటగిరీలో ఉపకార వేతనం కూడా ఉంటుంది. ఇక వాలంటీర్ కేటగిరీలో వెళ్లిన వాళ్లకు ఉపకార వేతనం ఉండదు, నేర్చుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఐసెక్ ద్వారా విదేశాల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి వయసు 18– 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ట్వల్త్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని, సెలెక్ట్ అయిన తర్వాత 18 వేల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ దేశాల్లో ఎయిర్‌పోర్టు నుంచి పికప్, డ్రాప్, బస వంటి సౌకర్యాలన్నీ అందులోనే. హోమ్‌స్టే ఉన్న చోట భోజనం కూడా ఇస్తారు. హాస్టల్స్‌లో ఉండాల్సి వస్తే బస ఉచితం, భోజనం ఖర్చు మాత్రం అదనంగా ఉంటుంది. ఇక విమాన చార్జీలు, షాపింగ్, టూరిస్ట్ ప్రదేశాల విజిటింగ్ వంటి ఖర్చులు విద్యార్థులే భరించాలి. మొత్తం మీద ఒక విద్యార్థి 45 రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌కి వెళ్లి రావడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. గత ఏడాది ఓ ఇరవై మంది అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్‌కి ప్రభుత్వమే స్పాన్సర్ చేసింది. హైదరాబాద్ ఐసెక్‌లో వంద మందికి పైగా విద్యార్థులు ఏడెనిమిది విభాగాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. నేను ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతూ ఇందులో మార్కెటింగ్ సర్వీస్ ఇస్తున్నాను. – బి. నిఖిల, మేనేజర్, బిజినెస్ టు కస్టమర్ ఐసెక్ హైదరాబాద్ చాప్టర్ 127 దేశాల్లో 45 వేల మంది ఐసెక్ (ఎఐఈఎస్ఈసి) అనేది ఫ్రెంచ్ పదం. దీని పూర్తి స్వరూపం ‘అసోసియేషన్ ఇంటర్నేషనల్ ద ఇట్యూడెంట్స్ ఎన్ సైన్సెస్ ఎకనమిక్స్ ఎట్ కమర్షియల్స్’. ఇంగ్లిష్‌లో ‘అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎకనమిక్ అండ్ కమర్షియల్ సైన్సెస్’గా వ్యవహరిస్తారు. ఇది యువత నిర్వహిస్తున్న నాన్ గవర్నమెంట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలోనే యువత సమర్థవంతంగా నడిపిస్తున్న అతి పెద్ద సంస్థ. ఇందులో గ్లోబల్ వాలంటీర్, గ్లోబల్ టాలెంట్, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ కేటగిరీలుంటాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తుంది ఐసెక్. డెబ్బై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ 127 దేశాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో నలభై ఐదు వేల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. -
12 దేశాలు.. 200 ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: విభిన్న సామాజిక అంశాలు, కళలు, భాషలు,సంస్కృతుల సమ్మేళనంగా రాష్ట్ర రాజధాని నగరం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో 3 రోజులు నిర్వహించిన హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ,విదేశాలకు చెందిన సాహితీప్రియులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు 12 దేశాల నుంచి 200 మంది విదేశీ ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. చైనా అతిథిదేశంగా హాజరవడం విశేషం. సాహితీ ఉత్సవంలో సుమారు 30 అంశాలపై సదస్సులు జరిగాయి. చివరిరోజు ప్రముఖ నటి షబానా ఆజ్మీ తన తండ్రి కైఫి ఆజ్మీ శతాబ్ది జన్మదినం సందర్భంగా ఆయన రాసిన కవితలు,ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమె సంతోషం వ్యక్తంచేశారు. సులభతర పన్నులతో చేయూత: గురుచరణ్ సులభతర పన్నులవ్యవస్థ ఆర్థికరంగానికి చేయూత నిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త గురుచరణ్‌దాస్ అన్నారు. ఆదివారం ‘మనీమ్యాటర్స్’అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్థానం, యురోపియన్ దేశాల్లో పన్ను ల వ్యవస్థ పరిణామ క్రమం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు విక్రమ్,వివేక్‌కౌల్ తదితరులు పాల్గొన్నారు. హౌ సేఫ్ ఈజ్ అవర్ మనీ: వివేక్ కౌల్ డబ్బు, ఆర్థిక వ్యవస్థ మీద పుస్తకాలు వెలువరిస్తూ, ప్రసంగాలు చేసే వివేక్ కౌల్ పాల్గొన్నారు. నగదు రద్దు క్రమంలో డబ్బు దాచుకోవటం ఎంత ప్రమాదకరమో వివరించారు. బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఏమాత్రం సురక్షితం కావని అన్నారు. మేధావుల మౌనం నష్టమే : మల్లికాసారాభాయ్ దేశంలో మేధావులు,విద్యావంతులు వివిధ సామాజిక సమస్యలు,అంశాలపై మౌనంగా మారడం సమాజానికి తీరని నష్టం కలిగిస్తోందని ప్రముఖ సామాజికవేత్త మల్లికాసారాభాయ్ అన్నారు. మంచికోసం,సమాజంలో మార్పుకోసం ప్రతీఒక్కరూ పోరాడాలని,చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై రాజకీయనేతలు,అధికారులను ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోంది: మెర్సీ మార్గరెట్ దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోందని ప్రముఖ రచయిత్రి,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ సాహితీసంస్కృతి’అన్న అంశంపై ఆమె మాట్లాడారు. జాతీయ ఉర్దూవర్సిటీ ప్రొఫెసర్ బేజ్ ఎజాజ్ మాట్లాడుతూ..హైదరాబాద్ విశిష్ట సంస్కృతీ,సంప్రదాయాలను వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లా డుతూ..సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అనువాద రచనల్లో తాను అందిస్తోన్న విధానాన్ని వెల్లడించారు. కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ తాను ఇటీవల వెలువరించిన పుస్తకం ‘కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ ’గురించి దాని రచయిత గురుచరణ్‌దాస్ ప్రసంగించారు. ఆధునిక జీవితంలో ధార్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, స్వీయ జీవితం పట్ల దృష్టి తగ్గిస్తున్నామన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని, కామదేవ దివస్‌గా నిర్వహించుకోవాలని తాను, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఒక ఉద్యమం ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నుంచే దీన్ని ప్రారంభిస్తామన్నారు.హిందూత్వ భావజాలానికి ఇక కాలం చెల్లుతుందన్నారు. -
రుచీ మిలే మేరా తుమ్హారా
దేశంలో ఎన్నో భాషలు...ఎన్నో సంస్కృతులు...ఎన్నో రుచులు..కానీభాషలు, రుచులు, సంస్కృతులను కలిపి వండితేనే టేస్ట్ ఆఫ్ ఇండియా బీహార్ లిట్టి చోఖా కావలసినవి: లిట్టి కోసం... గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – ముప్పావు లేదా ఒక కప్పు. స్టఫింగ్ కోసం... సెనగ పిండి – ఒక కప్పు (దోరగా వేయించాలి); జీలకర్ర – అర టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; కలోంజీ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నల్ల ఉప్పు – పావు టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఆవ నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – కొద్దిగా. తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి ∙నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙బాగా మెత్తగా అయ్యేలా ఎక్కువ సేపు కలిపి పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ.. ∙మిక్సీలో జీలకర్ర, సోంపు వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి వేసి, జీలకర్ర పొడి మిశ్రమం జత చేయాలి ∙వాము, కలోంజీ, మిరప కారం, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, నల్ల ఉప్పు, రాళ్ల ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙నిమ్మరసం, ఆవ నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి, కొద్దిగా గట్టిగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙పొడి పిండి అద్దుతూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, గుండ్రంగా చేతితో చేసి, అంచులు తడి చేసి, మూసేయాలి. ఇలా అన్నీ తయారుచేసుకుని ఒక పాత్రలో ఉంచాలి. ఆ పాత్ర మీద తడి బట్ట వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి ∙ఇలా తయారు చేసుకున్నవాటిని బేకింగ్ ట్రే మీద ఉంచాలి ∙200 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రే ఉంచాలి. సుమారు 40 మిషాల తరవాత బయటకు తీసేయాలి ∙కరిగించిన నేతిని వీటి మీద పూయాలి ∙చిన్న గిన్నెలో నెయ్యి వేసి అందించాలి. గుజరాతీ థేప్లా కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; సెనగ పిండి – అర కప్పు; మెంతి ఆకులు – ఒక కప్పు, పెరుగు – అర కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; గసగసాలు – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – ఒక టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలుపుకోవాలి ∙మూత ఉంచి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి ∙అరగంట తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి పిండిని మళ్లీ బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙పొడి పిండి అద్దుతూ చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, పెనం మీద కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి ∙ఒత్తి ఉంచుకున్న థేప్లాను వేసి రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి ∙పచ్చడి, పెరుగులతో వేడివేడి థెప్లాలను అందించాలి. మహారాష్ట్ర వడ పావ్ కావలసినవి: స్టఫింగ్ కోసం... ఆలుగడ్డలు – రెండు (కొద్దిగా పెద్దవి); పచ్చి మిర్చి + వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. పిండి తయారీ కోసం... సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; నీళ్లు – అర కప్పు; ఉప్పు – తగినంత. గ్రీన్ చట్నీ కోసం... కొత్తిమీర తరుగు – ఒక కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; నిమ్మరసం – 3 చుక్కలు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3; ఉప్పు – తగినంత.శొంఠి చట్నీ కోసం... గింజలు లేని చింతపండు – అర కప్పు; నీళ్లు – 2 కప్పులు; జీలకర్ర – అర కప్పు; శొంఠి పొడి – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; మిరప కారం – పావు టీ స్పూను; బెల్లం పొడి – ఒక కప్పు; నూనె – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. వడ పావ్ కోసం మరి కొన్ని... రెడ్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; పావ్ లేదా బ్రెడ్ రోల్స్ – తగినన్ని; ఉప్పులో కలిపి వేయించిన పచ్చి మిర్చి – తగినన్ని. తయారీ: గ్రీన్ చట్నీకి చెప్పిన పదార్థాలకు తగినన్ని నీళ్లు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. కొద్దిగా గట్టిగా ఉండేలా జాగ్రత్తపడాలి. శొంఠి చట్నీ తయారీ... ∙తగినన్ని నీళ్లలో చింతపండును సుమారు గంటసేపు నానబెట్టాక, చేతితో మెత్తగా పిసికి, పిప్పిలాంటిది తీసేసి, చిక్కటి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙మంట తగ్గించి, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙శొంఠిపొడి, మిరప కారం, ఇంగువ జత చేసి కలపాలి ∙చింతపండు రసం జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక దింపి చల్లారనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వచేసుకోవచ్చు. వడా పావ్ తయారీ... ∙ఒక పాత్రలో బంగాళ దుంపలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ∙తొక్క తీసేసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙ఆవాలు జత చేసి చిటపటలాడించాలి ∙ కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిగా వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు + పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙పసుపు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఈ మిశ్రమాన్ని బంగాళ దుంపకు జతచేసి బాగా కలపాలి ∙కొత్తిమీర, ఉప్పు జత చేయాలి ∙ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, కొద్దిగా ఫ్లాట్‌గా ఉండేలా చేతితో ఒత్తుకోవాలి ∙మరొక పాత్రలో సెనగ పిండి, పసుçపు, ఇంగువ, బేకింగ్ సోడా, ఉప్పు, అర కప్పు నీళ్లు వేసి బజ్జీ పిండిలా తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప ఉండలను సెనగ పిండిలో ముంచి, నూనెలో వేయాలి ∙బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌టవల్ మీదకు తీసుకోవాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙పావ్లను మధ్యలోకి కట్ చేసి, తయారుచేసుకున్న వడను మధ్యలో ఉంచాలి ∙తయారుచేసి ఉంచుకున్న చట్నీలతో అందించాలి. ఆంధ్ర గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర – అర కేజీ; ఎండు మిర్చి – 100 గ్రా.; మెంతులు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నువ్వుల నూనె – 100 గ్రా.; ఉల్లి తరుగు – పావు కప్పు. తయారీ: ∙గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద నీడలో (పూర్తిగా తడిపోయే వరకు) ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర వేసి పచ్చి పోయేవరకు సుమారు పావు గంటసేపు వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి, మంట ఆర్పేయాలి ∙మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మిశ్రమం వేసి మెత్తగా పొడి చేయాలి ∙గోంగూర జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉల్లి తరుగు జతచేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కాచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక గోంగూరలో వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ మద్రా కావలసినవి: కాబూలీ చనా – 2 కప్పులు; ఆవ నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 1; మిరియాలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత; తరిగిన పచ్చి మిర్చి – 3; గడ్డ పెరుగు – 2 కప్పులు; బియ్యిప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙మిక్సీలో ఏలకులు, మిరియాలు, లవంగాలు వేసి పొడి (మరీ మెత్తగా లేకుండా) చేయాలి ∙ఒక పాత్రలో బియ్యప్పిండికి తగినన్ని నీళ్లు జత చేసి కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేయాలి ∙సన్నటి మంట మీద కాగిన తరవాత, ఇంగువ, జీలకర్ర, దాల్చిన చెక్క పొడి వేసి వేయించాలి ∙పొడి చేసుకున్న మిగతా మసాలా దినుసులను జత చేయాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాలి ∙గరం మసాలా, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙ఉడికించిన సెనగలను వేసి బాగా కలిపిన తరవాత మసాలా, ఉప్పు, మిరప కారం వేసి కలియబెట్టాలి ∙పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాక, మంట బాగా తగ్గించేయాలి ∙పెరుగు జత చేసి బాగా కలియబెట్టాలి ∙మంట పెంచి, ఆపకుండా కలుపుతుండాలి ∙బియ్యప్పిండి కలిపిన నీళ్లు, నెయ్యి వేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి ∙గ్రేవీ కొద్దిగా గట్టి పడిన తరవాత దింపేసి, చల్లారాక వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. ఒడిశా చెన్నా పోడా కావలసినవి: పనీర్ లేదా సెనగలు – పావు కేజీ; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బియ్యప్పిండి – అర టేబుల్ స్పూను; జీడి పప్పులు, కిస్మిస్లు – తగినన్ని; నెయ్యి – కొద్దిగా. తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ∙పనీర్ లేదా ఉడికించిన సెనగ పప్పును పొడి పొడిగా చేయాలి ∙అర కప్పు పంచదార లేదా బెల్లం పొడి జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా పాలు జత చేయాలి ∙ఏలకుల పొyì , బియ్యప్పిండి జత చేయాలి ∙కిస్మిస్, జీడి పప్పు పలుకులు కూడా జత చేయాలి ∙ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో వేసి సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, 45 నిమిషాలు బేక్ చేయాలి ∙బయటకు తీసి చల్లారనివ్వాలి ∙చాకుతో జాగ్రత్తగా స్లయిసెస్‌లా కట్ చేయాలి ∙భోజనం చేశాక ఈ స్వీట్‌ను తింటారు. సిక్కిం మామోస్ కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; నూనె – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని స్టఫింగ్ కోసం... సన్నగా తరిగిన కూర ముక్కలు – రెండు కప్పులు (క్యాబేజీ, క్యారట్లు, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ వంటివి); ఉల్లికాడల తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; సోయా సాస్ – ఒక టీ స్పూను; మిరియాల పొడి – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ... ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కూరగాయల తరుగు జత చేసి, సన్నని మంట మీద వేయించాలి ∙సోయాసాస్, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙ఉల్లికాడల తరుగు జత చే సి బాగా కలపాలి. మామోస్ తయారీ: ∙మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను తీసుకుని పూరీ ప్రమాణంలో ఒత్తుకోవాలి ∙స్టఫింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పూరీ మధ్యలో ఉంచి, అంచులను ముడతలు వచ్చేలా చేస్తూ, అన్నివైపులా మూసేయాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటి మీద తడి వస్త్రం వేసి ఉంచాలి ∙కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న మామోస్‌ను ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్‌లో పెట్టాలి ∙సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ∙వీటిని ప్లేట్లోకి తీసుకుని, ఉల్లికాడలతో అలంకరించి, టొమాటో చిల్లీ సాస్, రెడ్‌చిల్లీ గార్లిక్ చట్నీలతో అందించాలి. కశ్మీరీ పులావ్ కావలసినవి: నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు 2; జీలకర్ర – 2 టీ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; పాలు – ముప్పావు కప్పు; నీళ్లు – ఒకటింపావు కప్పులు; ఉప్పు – తగినంత; కుంకుమ పువ్వు – పావు టీ స్పూను; తాజా క్రీమ్ – 3 టీ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన బాదం పప్పులు + జీడి పప్పులు + వాల్నట్స్ + పిస్తాలు – ముప్పావు కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; వేయించిన ఉల్లి తరుగు – పావు కప్పు. తయారీ: ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, దాలిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు కలపాలి ∙బాస్మతి బియ్యం జత చేసి రెండు మూడు నిమిషాలు కలియబెట్టాలి ∙పాలు, నీళ్లు జత చేసి కలపాలి ∙ఉప్పు, కుంకుమ పువ్వు, క్రీమ్ జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙మూత పెట్టి, సన్నని మంట మీద సుమారు 20 నిమిషాలు పాటు ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత పంచదార, కిస్మిస్ వేసి కలపాలి ∙వేయించిన బాదం పప్పులు, జీడి పప్పులు, వాల్నట్న్, పిస్తాలు వేసి బాగా కలిపి మరో మూడు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙రైతాతో అందించాలి. (దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు). జార్ఖండ్ థేకువా కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; చీజ్ 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 5. తయారీ: ∙ఒక పాత్రలో బెల్లం పొడి, అర కప్పు నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, మరిగించాలి ∙బెల్లం పూర్తిగా కరిగేవరకు ఉంచి, దింపేసి వడపోయాలి ∙బెల్లం నీళ్లలో నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి వేసి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము జత చేయాలి ∙బెల్లం నీళ్లు పోస్తూ, పిండిని గట్టిగా కలుపుకోవాలి ∙ఈ పిండితో థేకువాలు తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙చేతులకు నూనె పూసుకుని, ఒక ఉండ చేతిలోకి తీసుకుని, చేతితో మృదువుగా ఒత్తాలి ∙మనకు నచ్చిన ఆకారంలో దానిని తయారుచేసుకోవాలి ∙అంటే ఆకు ఆకారం ఇష్టపడితే, ఆకులా చేతి, గోళ్లతో గీతలు గీయాలి ∙లేదంటే గుండ్రంగా కూడా చేసుకోవచ్చు ∙ మంటను మధ్యస్థంగా ఉంచి, తయారుచేసి ఉంచుకున్న థేకువాలను నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙చల్లారాక గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి ∙ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. పంజాబ్ సర్సోంకా సాగ్ కావలసినవి: ఆవ ఆకులు – ఒక కట్ట; బచ్చలి ఆకు – అర కట్ట; పాల కూర – అర కట్ట; ముల్లంగి ఆకుల తరుగు – ఒక కప్పు; ముల్లంగి – చిన్న ముక్క; మెంతి ఆకు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; మొక్క జొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత.సాగు కోసం... ఉల్లి తరుగు – అర కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉడికించిన సగ్గు బియ్యం – 3 కప్పులు తయారీ: ∙అన్ని ఆకు కూరలను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙కుకర్‌లో పైన చెప్పిన పదార్థాలన్నిటినీ (మొక్క జొన్న పిండి కాకుండా) వేసి మూత పెట్టి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ∙చల్లారిన తరవాత, మొక్కజొన్న పిండి జత చేసి మెత్తగా అయ్యేవరకు కవ్వంతో బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని ఒక బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, బాగా చిక్కబడేవరకు సుమారు అరగంట సేపు సన్నని మంట మీద ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి కాచాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని జత చేయాలి ∙మంట బాగా తగ్గించి కలుపుతుండాలి ∙ఉడికించిన ఆకు కూరల మిశ్రమం కూడా జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙ఉల్లి చక్రాలు, పచ్చిమిర్చితో అలంకరించాలి ∙రోటీలతో తింటే రుచిగా ఉంటుంది. తెలంగాణ గుత్తి దోసకాయ కావలసినవి: బుడమకాయలు (చిన్న చిన్న దోసకాయలు) – 5; కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి); నువ్వుల పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – తగినంత; నూనె – టేబుల్ స్పూన్; జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్; పసుపు – కొద్దిగా; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి). తయారీ: ∙దోసకాయల ముచ్చికల వద్ద కొద్దిగా కట్ చేసి, చేదుగా ఉందో లేదో చెక్ చేయాలి. నాలుగువైపులా (గుత్తి వంకాయను కట్ చేసినట్టుగా) కట్ చేయాలి. లోపల కొద్దిగా గింజలు తీయాలి. ఈ గింజలను కూడా మెత్తగా రుబ్బి కూరలోకి వాడుకోవచ్చు ∙కారం, ఉప్పు, ధనియాలపొడి, నువ్వుల పొడి (దోసకాయలు పులుపు లేకపోతే కొద్దిగా చింతపండు వాడుకోవచ్చు) కలిపి రోట్లో దంచాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయల్లో కూరాలి ∙పొయ్యిమీద గిన్నెపెట్టి వేడయ్యాక నూనె వేయాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి. పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, సిద్ధంగా ఉంచుకున్న దోసకాయలను వేసి కలపాలి ∙గిన్నె మీద ఆవిరిమూత (కొద్దిగా నీళ్లుపోసిన మరొక గిన్నె) పెట్టి సన్నని మంటమీద ఉడకనివ్వాలి ∙మధ్యమధ్యలో దోసకాయలను కలుపుతూ, గ్రేవీకి అవసరమైనంతగా నీళ్లు ఊరుతున్నాయో లేదో సరిచూసుకోవాలి. చాలకపోతే కొద్దిగా నీళ్లు జతచేయవచ్చు ∙ముక్క ఉడికి, నూనె తేలినట్టుగా కనిపిస్తే కొద్దిగా ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించేయాలి ∙అన్నం, రోటీల్లోకి ఈ గుత్తి దోసకాయ రుచికరంగా ఉంటుంది. కేరళ ఇడియాప్పమ్ కావలసినవి: బియ్యప్పిండి–ఒక కప్పు; కొబ్బరి తురుము – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – ఇడ్లీ ప్లేట్‌కు రాయడానికి తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక బియ్యప్పిండి వేసి కొద్దిసేపు వేయించి తీసేయాలి ∙స్టౌ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి దింపేయాలి ∙ఆ నీళ్లలో బియ్యప్పిండి, ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి ∙తడి వస్త్రం మూతలా వేయాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుని జంతికల గొట్టంలో ఉంచాలి ∙ఇడ్లీ రేకులకు నెయ్యి లేదా నూనె పూయాలి ∙కొద్దిగా కొబ్బరి ఈ రేకులలోకి బియ్యప్పిండిని చక్రాల మాదిరిగా తిప్పాలి ∙అలా అన్ని రేకులలో వేసుకుని, కుకర్‌లో ఉంచి ఆవిరి మీద ఉడికించి, దింపేయాలి ∙ప్లేటులోకి తీసుకుని, కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో అందించాలి. కర్ణాటక బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. మధ్యప్రదేశ్ పోహా జిలేబీ కావలసినవి: గట్టి అటుకులు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఆలుగడ్డ తరుగు – పావు కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; సోంపు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – చిటికెడు. గార్నిషింగ్ కోసం... నిమ్మ చెక్కలు – రెండు; సేవ్ – అర కప్పు; దానిమ్మ గింజలు – అర కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు తయారీ: ∙అటుకులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, మిరపకారం జత చేసి కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాక, సోంపు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఆలుగడ్డల తరుగు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ∙అటుకుల మిశ్రమం జత చే సి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఐదు నిమిషాల తరవాత కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాల ∙గార్నిషింగ్‌లో చెప్పిన పదార్థాలతో అలంకరించి జిలేబీతో జత చేసి అందించాలి (మధ్యప్రదేశ్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో దీనిని ఎక్కువగా ఇష్టపడతారు). జిలేబీ... కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు; కార్న్; స్టార్చ్ – పావు కప్పు; పెరుగు – ఒక కప్పు; ఫుడ్ కలర్ – చిటికెడు; వేడి నూనె – 2 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి మెత్తగా వచ్చేలా బాగా కలిపి, పైన మూత పెట్టి సుమారు 24 గంటల సేపు వదిలేయాలి. పంచదార పాకం కోసం... పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – అర కప్పు తయారీ: ∙ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ∙సిద్ధమైన జిలేబీ పిండిని, కెప్ బాటిల్లోకి తీసుకోవాలి ∙మూతకు చిన్న రంధ్రం చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, అందులోకి జిలేబీ ఆకారంలో వచ్చేలా సీసాను గుండ్రంగా తిప్పుతూ వేయాలి ∙రెండువైపులా దోరగా కాలిన తరవాత, తీసి, పంచదార పాకంలో వేయాలి ∙ఈ విధంగా మొత్తం పిండితో తయారుచేసుకుని, పాకంలో వేసి ఒక గంటసేపు వదిలేయాలి ∙ఆ తరవాత తింటే జిలేబీలలోకి పాకం చేరి రుచిగా ఉంటాయి. తమిళనాడు కట్టు పొంగల్ కావలసినవి: పెసరపప్పు – 150 గ్రా.; కొత్త బియ్యం – 100 గ్రా.; మిరియాలు – 15 (పొడి చేయాలి); పచ్చి మిర్చి – 6; పచ్చి కొబ్బరి – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 15; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండుమిర్చి – 3; మినప్పప్పు + సెనగ పప్పు – 2 టేబల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు తగినంత ; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙దళసరి పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙పెసర పప్పు వేసి దోరగా వేయించాలి ∙బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా వేసి సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించి (తెలుపు రంగు పోకూడదు) తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, మిరియాల పొడి వేసి వేయించాక, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ వేసి కుకర్‌లో వుంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙అందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న పొంగలిలో వేయాలి ∙ఉప్పు వేసి బాగా కలియబెట్టి వేడి వేడిగా సర్వ్ చేయాలి. -
అద్భుతమైన మస్జిద్ల వైపుగా ప్రయాణం...
ముస్లిమ్‌ల ప్రార్థనాలయం మస్జిద్. ప్రపంచంలో పేరెన్నికగన్నవి, అత్యద్భుతమైనవి వందల సంఖ్యలో మస్జిద్లు ఉన్నాయి. ఈ కట్టడాలను ఒక్కసారి దర్శిస్తే చాలు ముస్లిమ్‌ల నిర్మాణ నైపుణ్యాలు ఎంత గొప్పవో అవగతమవుతాయి. ఇస్లామ్ చక్రవర్తులు తమ కళలను ప్రపంచమంతా ఎలా వ్యాపింపచేశారో తేటతెల్లం అవుతాయి. యూరప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మస్జిద్లు ప్రపంచం నలుమూలలా అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా, ఠీవిగా దర్శనమిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పవిత్ర మస్జిద్ల గురించి కొంత సమాచారం ఈ వారం... జామా మస్జిద్: న్యూ ఢిల్లీ! మన దేశంలో అతిపెద్దది, అతి సుందరమైనదిగా జామా మస్జిద్కు పేరుంది. 1658లో ఎర్ర ఇసుకరాయి, తెల్లని మార్బుల్‌తో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ మస్జిద్ను నిర్మించాడు. ఈ మస్జిద్ నిర్మాణానికి 5 వేల మంది, 6 సంవత్సరాల పాటు పనిచేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్‌లో గల ఈ మస్జిద్ ప్రాంగణంలో దాదాపు 25 వేల మంది ఒకేసారి ప్రార్ధనలు జరపవచ్చు. ఇలా వెళ్లాలి: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన జామా మస్జిద్కు 17 కి.మీ. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ. ఢిల్లీలోని మూడు ప్రధాన బస్సు స్టేషన్ల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు బస్సు సర్వీసులలో మస్జిద్కు చేరుకోవచ్చు. బ్లూ మాస్క్- అజ్రత్ అలీ పవిత్రక్షేత్రం: ఆప్ఘనిస్థాన్ ఆప్ఘనిస్తాన్‌లోని మజర్-ఇ-షరీఫ్ పట్టణంలో ఉంది ఈ మస్జిద్. నీలాకాశం రంగులో ఆప్ఘనిస్థాన్ హృదయపీఠంగా పిలువబడుతున్న ఈ కట్టడాన్ని ‘మజర్’గా పిలుస్తారు. ఇదే పేరుమీదుగా ఈ పట్టణం వృద్ధి చెందింది. హజ్రత్ అలీ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మస్జిద్ చుట్టూ అత్యంత సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఇలా వెళ్లాలి: ఢిల్లీ నుంచి ఆప్ఘనిస్తాన్‌లోని మజర్ కి విమానంలో చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా స్విస్వింగ్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా మజర్ చేరుకునే ప్రయాణికులకు రాబోయే 10 రోజుల్లో అత్యంత తక్కువ టికెట్ ధర కేవలం రూ.18771 గా నిర్ణయించింది. ఈ అవకాశం జూలై 15, 2014 వరకు మాత్రమే ఉంది. ఆసక్తి గల వారు www.goibibo.com/flights-schedule/delhi/mazar-i-sharif/కు లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చు. సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దిన్ మస్జిద్: బ్రూనై బ్రూనై దేశ రాజధాని అయిన బండార్ సెరి బెగవాన్ ప్రాంతంలో బంగారపు బురుజు గల ఈ మస్జిద్ ఉంది. పసిఫిక్ ఆసియాలోనే అత్యంత సుందరమైన మస్జిద్‌గా పర్యాటకులను ఆకర్షిస్తోంది. 1958లో నిర్మించిన ఈ కట్టడంలో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది. 171 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మస్జిద్ నిర్మాణంలో గాజు తలుపులు, చిమ్నీలు, బురుజులు, పాలరాయి, గ్రానైట్‌ను ఉపయోగించారు. ఇలా వెళ్లాలి: బ్రూనై నది మార్గాన నేరుగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చెన్నై మీనంబాకమ్ విమానాశ్రయం నుంచి - బంగార్ సెరి బెగవాన్‌కు టికెట్ ధర రూ. 30,900 పై చిలుకు. మక్కా మస్జిద్ హైదరాబాద్! హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నైరుతి దిశలో, 100 గజాల దూరంలో ఉంది ఈ మస్జిద్. ఇందులోని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మస్జిద్ నిర్మాణంలో మక్కా నుండి ఇటుకలు తెప్పించారని, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీనికి మక్కా మస్జిద్‌గా పేరు వచ్చిందని అంటారు. మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని ఇందులో భద్రపరచారని, చరిత్ర చెబుతోంది. ఇలా వెళ్లాలి: దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు, రైలు, అంతర్జాతీయ విమాన సదుపాయాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 11 కి.మీ దూరం. -
హృదయం: రెండు రాష్ట్రాల ప్రేమ
టు స్టేట్స్... నవలగానే కాదు, సినిమాగా కూడా పెద్ద హిట్. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడి, వారి ప్రయాణం పెళ్లిదాకా సాగితే ఎలా ఉంటుందో చదివాం. చూశాం. ఆనందించాం! కానీ ఈ కథ చదువుతూ, చూస్తూ తమను తాము అద్దంలో చూసుకున్నవారి అనుభూతే వేరు. అలాంటి మూడు ప్రేమకథలు మీకోసం.డాక్టర్ ఆర్.కె.పూరి, డాక్టర్ విజయపూరిల ప్రేమకథ గురించి తెలుసుకోవాలంటే 30 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. పూరిది పంజాబ్‌లోని గుర్గావ్. విజయది తమిళనాడులోని చిదంబరం. పీహెచ్డీ పనిలో భాగంగా పూణె యూనివర్సిటీలో 1977లో కలిశారు వీళ్లిద్దరూ. ఐదేళ్ల సహచర్యంలో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది పెళ్లికి దారి తీసింది. ఐతే, వారి పెళ్లి అంత సులభంగా ఏమీ అయిపోలేదు. విజయ తల్లిదండ్రులు 1975కి ముందే చనిపోయారు. మిగిలిన బంధువులెవరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పట్లో నార్త్ ఇండియాలో కొత్త పెళ్లికూతుళ్లు వరుసగా అగ్నికి ఆహుతవుతున్న ఘటనలు పత్రికల్లో వస్తుండటంతో తమ అమ్మాయిని అంత దూరం పంపడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులుంటే వాళ్లిద్దరినీ ఒప్పిస్తే సరిపోయేది కానీ, వాళ్లు లేకపోవడంతో బంధువులందరినీ ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో పూరి కూడా తన తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి అంతా ఒప్పుకున్నాక, వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ తాము కలిసిన మహారాష్ట్రలోనే సెటిలయ్యారు. పెళ్లయి 30 ఏళ్లవుతున్నా... విజయ పంజాబీ నేర్చుకోలేదు. పూరి తమిళం వంటబట్టించుకోలేదు. ఇద్దరూ హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు. మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడూ మరాఠిలోనూ కూడా. పూరి ప్రొఫెసర్‌గా రిటైరైపోగా, విజయ ఇంకా ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఓ కూతురు. ఆమెను తమిళునికో, పంజాబీకో కాకుండా మహారాష్ట్రవాసికిచ్చి పెళ్లి చేశారు. వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు మధ్య పెరిగిన వీరిద్దరూ ఇన్నేళ్లు ఎలా కలిసి జీవనం సాగించారు అంటే... మాది ప్రేమ భాష, మేం భారతీయులం అంటారు విజయ, పూరి. కిరణ్ పర్మార్, ప్రతిభ... ఈ పేర్లు చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్లిద్దరికీ ఎక్కడా కలవదని. కిరణ్ది గుజరాత్ అయితే, ప్రతిభది తమిళనాడు. వీళ్లిద్దరూ 2009లో ముంబైలో ఎంబీఏ చేస్తూ కలిశారు. ముందు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరి మధ్య తర్వాత ఏదో తెలియని బంధం మొదలైంది. అది ప్రేమేనని గుర్తించి ముందుగా కిరణ్, పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ప్రతిభకు కూడా కిరణ్‌పై మంచి అభిప్రాయం ఉండటంతో, ‘కాదు’ అని చెప్పలేకపోయింది. కానీ కథ అంతటితో సుఖాంతం అయిపోలేదు. కిరణ్ తల్లిదండ్రులు పెళ్లికి పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు కానీ, ప్రతిభ కుటుంబం నుంచి పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఎంత నచ్చజెప్పినా వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఏడాది పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. 2011 ఆగస్టు 16న కిరణ్ తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. దీంతో ప్రతిభ తల్లిదండ్రుల కోపం నషాళానికి అంటింది. తమ కూతురిని వెలివేశారు. ఆమెతో మాట్లాడలేదు. భర్త ప్రేమ, తల్లిదండ్రులు దూరమైన బాధను మరిపించినా, వాళ్లు ఎప్పటికైనా కలుస్తారన్న ఆశతో జీవనం సాగించింది ప్రతిభ. ఇద్దరికీ పాప పుట్టాక కానీ వారి మనసు కరగలేదు. ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఈ ఘనత తమ పాప యాషినిదే అంటారు కిరణ్, ప్రతిభ. సంహిత చౌదరిది త్రిపుర. సాగర్ మల్సానెది మహారాష్ట్ర. వీళ్లిద్దరినీ కలిపింది ఇంగ్లండ్. మాస్టర్స్ చేసేందుకు యూకేలో అడుగుపెట్టిన సంహితకు కొన్నాళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు సాగర్. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని చూసిన తొలిసారే ప్రేమలో పడతారు. ఇక్కడ సీన్ రివర్స్. క్యాంటీన్లో భోజనం చేస్తుండగా నల్లటి టీ షర్ట్‌లో ఓ అబ్బాయిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది సంహిత. ఆమె ఫ్రెండ్ ఉన్నట్లుండి సాగర్‌ను తీసుకొచ్చి, పరిచయం చేసేసరికి ఆశ్చర్యపోయింది. ఆ పరిచయం కొన్నాళ్లకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని బంధంగా మారింది. ఓసారి క్రిస్మస్ సమయంలో సాగర్ వారం రోజులు కనిపించకుండా పోయేసరికి తట్టుకోలేకపోయింది సంహిత. అతను మళ్లీ కనబడగానే నిన్ను విడిచి ఉండలేనని చెప్పేసింది. నాదీ అదే ఫీలింగ్ అంటూ మనసు విప్పేశాడు సాగర్. ఐతే, తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో కొన్నాళ్లు ఎదురుచూడాలని భావించారు. కానీ ఎక్కువ రోజులు ఆగలేకపోయారు. ఒక్కొక్కరికీ విషయం చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేశారు. అందరూ సరే అన్నారు. కానీ సాగర్ తండ్రి మాత్రం పెళ్లికి ససేమిరా అన్నాడు. ఐతే, ఓ రోజు సంహిత తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి, తన తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు సాగర్. అప్పటికీ కాదనే అన్న తండ్రి కొన్నాళ్ల తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి పచ్చజెండా ఊపాడు. గత ఏడాది డిసెంబర్లో వీరి పెళ్లయింది. అంతా కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.