Cupboard
-
అల్మరాలో నక్కిన టెర్రరిస్ట్‌లు.. బయటకు లాగి మరి ఎన్కౌంటర్..
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో భద్రతపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పట్టాయి.ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని చింగామ్,సౌత్ కాశ్మీర్ కుల్గామ్ అనే ప్రాంతాలలో నివసించేందుకు టెర్రరిస్ట్‌లకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్‌ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశాయి. మదర్గాంలో తొలి ఎన్కౌంటర్ జరగ్గా.. రెండో ఎన్కౌంటర్ కుల్గాం జిల్లా చింగాం అనే ప్రాంతంలో జరిగింది. సైనికులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు టెర్రరిస్ట్‌లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం చెందారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బర్డి తెలిపారు. ఇక ఎన్కౌంటర్లో హతమైన టెర్రరిస్ట్‌లు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందినవారని,వారిలో ఒకరు లోకల్ కమాండర్‌గా పోలీసులు నిర్ధారించారు.చింగాంలో హతమైన నలుగురు టెర్రరిస్ట్‌లు యావర్ బషీర్ దార్,జాహిద్ అహ్మద్ దార్, త్వాహిద్ అహ్మద్ రాతీర్, షకీల్ అహ్ వ్వానిలు కాగా, మదర్గాంలో మృతి చెందిన టెర్రరిస్ట్‌లు ఫైసల్, అదిల్లుగా గుర్తించారు.మదర్గాంలో జరిగిన టెర్రరిస్ట్‌ల ఎదురు దాడిలో పారా కమాండో, లాన్స్ నాయక్ ప్రదీప్ నాయిన్, చింగాం గ్రామంలోని ఫ్రిసాల్ ఏరియాలో వన్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన హవల్దార్ రాజ్‌కుమార్ వీరమరణం చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
టచ్‌స్క్రీన్ గ్లౌజులూ వచ్చేశాయ్..!
టెక్ వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. సాయంత్రం ఆరు గంటలు కాక ముందే చీకటి అలుముకొని చలి దుప్పటి కప్పేస్తోంది కదూ. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా ఉలెన్ వెంట పడాల్సిందే. కప్‌బోర్డుల్లోని స్వెటర్లు, మఫ్లర్లు బయటికి తీయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చలి తీవ్రతకు చేతులకు తిమ్మిర్లు పట్టడం లేదా? మరి ముందు వాటికి గ్లౌజులు తీసుకోండి. కానీ కొనే ముందు ఈ విషయాలను తెలుసుకోండి మరి. గ్లౌజుల జతను తీసుకునే ముందు మీరు వాటిని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తారో ఆలోచించండి. ఆఫీసుల్లో ధరించడానికైతే లెదర్‌ని కొనండి. అవి చలి నుంచి కాపాడటంతో పాటు ఫ్యాషనబుల్‌గానూ ఉంటాయి. అదే మంచు ప్రదేశానికి వెళ్లేట్టు అయితే హార్డ్ గ్లౌజులు తీసుకోవాలి. రాత్రుళ్లు నిద్రపోయే సమయానికి మాత్రం ఉన్ని గ్లౌజులు మేలు చేస్తాయి. ఇటీవల టచ్‌స్క్రీన్ గ్లౌజులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ గ్లౌజులు టచ్‌స్క్రీన్ ఫోన్లను ఉపయోగించడానికి బాగా సహకరిస్తాయి. వీటి వాడకం వల్ల ఫోన్లపై ఎలాంటి గీతలు, మరకలు పడవు.గ్లౌజులు కొనుగోలు చేసేటప్పుడు సరైన సైజువి తీసుకోవడం ముఖ్యం. మహిళలకు, పురుషులకు వేరువేరు సైజుల్లో ఉన్నాయి. అవి చేతులకు తొడుక్కున్నప్పుడు వేళ్లు ఫ్రీగా కదిలేలా చూసుకోవాలి. గ్లౌజులు మరీ టైట్‌గా మరీ లూజ్‌గా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మార్కెట్లో వివిధ రంగుల గ్లౌజులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్, బ్రౌన్, గ్రే కలర్స్ అయితే అన్ని రంగుల డ్రెస్సులకు నప్పుతాయి. అలా కాకుండా తమ స్వెటర్, హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు, బూట్స్లకు మ్యాచింగ్ గానూ కలర్‌ఫుల్ గ్లౌజులు తీసుకోవచ్చు. లేదంటే వెరైటీగా ఉండాలంటే రెడ్, బ్లూ, ఎల్లో, పింక్‌లాంటి గ్లౌజులనూ తీసుకోవచ్చు.