కాశ్మీర్లో మరో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్, సాంబ, కతువా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ముందుగా జాగ్రత్తగా కర్ఫ్యూ విధించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.
కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల ఫలితంగా, శనివారం కాశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించిపోయింది. కిస్ట్వార్ జిల్లాలో శనివారం రెండోరోజూ కర్ఫ్యూ కొనసాగగా, హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోనూ కర్ఫ్యూ విధించారు. బంద్ ఫలితంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
నిరసనల్లో పదిమంది గాయపడ్డారు. కిష్ట్వార్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. జమ్మూ నగరంలో పోలీసులు, నిరసనకారుల పరస్పర దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. జమ్మూతో పాటు పరిసర జిల్లాల్లో బంద్ పాటించడంతో పాటు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. కిష్ట్వార్ జిల్లా