currnet shock
-
కాటేసిన కరెంటు కంచె..
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన బడుగు జీవులను విద్యుత్ కంచె కాటేసింది.. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగనూరుపల్లె గ్రామానికి చెందిన బైరగాని దస్తగిరి (42), బత్తల రామలక్షుమ్మ (33) విద్యుదా ఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. రూరల్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన దస్తగిరి, రామలక్షుమ్మతో పాటు మరి కొందరికి గొర్రెల పోషణే జీవనాధారం. వీరు రోజు తమ జీవాలను గ్రామ శివారులో ఉన్న పొలాల గట్టుకు తీసుకెళ్లి మేపుకొని వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రేగుళ్లపల్లె శివారు ప్రాంతాలకు జీవాలను తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలు మేస్తుండగా బైరగాని దస్తగిరి, రామలక్షుమ్మలు సమీపంలోని వేరు శనగ సాగు చేసిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ పొలం చుట్టూ పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగులుకొని అక్కడికక్కడే కుప్ప కూలి పోయారు. మేత మేస్తున్న ఏడు గొర్రెలతో పాటు కాపలాగా ఉన్న కుక్క కూడా మృత్యువాత పడింది. ఇంటి ఉంచి ఉదయం 10.30 గంటలకు వీరు వెళ్లారని, అయితే ప్రమాదం జరిగినట్లు సుమారు 2.30 గంటలకు తమకు తెలిసిందని గ్రామస్తులు చెబుతున్నారు. మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు కంచె ఏర్పాటు నేరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడం నేరం. కంచె ఏర్పాటు చేసుకున్న రైతులు వేకువ జామునే వెళ్లి విద్యుత్ సరఫరాను తొలగిస్తారని, అయితే తెల్లారినా విద్యుత్ సరఫరా తీసేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రూరల్ ఎస్ఐ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో విషాదం.. ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో నంగనూరుపల్లెలో విషాదం నెలకొంది. దస్తగిరి చాలా ఏళ్ల నుంచి గొర్రెలను కాసేవాడు. అతనికి పొలాలు లేవు, గొర్రెలను కాసుకోవడమే జీవనాధారం. భార్య మల్లేశ్వరి, సునీల్, అనిల్ అనే కుమారులతో పాటు కావ్య అనే కుమార్తె ఉంది.కుమారులిద్దరు డిగ్రీ, ఇంటర్ చదువుతుండగా, కుమార్తె ఐటీఐ చదువుతోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దస్తగిరి మృత్యువాత పడటంతో భార్యా, పిల్లలు రోదిస్తున్నారు. రామలక్షుమ్మకు భర్త నాగయ్యతో పాటు నాగేంద్ర, ప్రసన్న అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ పోట్లదుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చదవండి: Afghanistan: పైసల్లేవ్! బన్ను కూడా దొరకని పరిస్థితి తప్పదా? తాలిబన్ల ముందు మార్గాలేంటంటే.. -
తీగలే.. మృత్యుపాశాలై..
సాక్షి,శ్రీకాకుళం: మండల కేంద్రం ఎల్.ఎన్.పేటలో గురువారం విద్యుత్ స్తంభంపై వైర్లు సరిచేస్తున్న సమయంలో షాక్‌కు గురై గ్రామ సచివాలయ గ్రేడ్–2 జేఎల్ఎం (జూనియర్ లైన్‌మేన్) సాహుకారి వెంకటరమణ(36) మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు, సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎల్.ఎన్.పేట మండలం బొత్తాడసింగి గ్రామానికి చెందిన వెంకటరమణ తన ఊరిలోనే గ్రామ సచివాలయంలో గ్రేడ్–2 జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. ఎల్.ఎన్.పేటలోని ఓ వీధిలో కొన్ని ఇళ్లకు విద్యుత్ సరఫ రా హెచ్చుతగ్గులు జరుగుతుండటంతో వైర్లు సరిచేసేందుకు స్థానిక లైన్‌మేన్ రమేశ్, మరికొందరు జేఎల్‌ఎంలతో కలిసి వెంకటరమణ కూడా వెళ్లాడు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా వీరంతా కలిసి పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభం ఎక్కిన వెంకటరమణ వైర్లు సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వాస్తవానికి, ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశామని, సమీప ప్రాంతంలోని బ్యాంకు ఇన్వర్టర్ల నుంచి రిటన్ విద్యుత్ సరఫరా కావటంతో ఈ ఘట న జరిగినట్లు భావిస్తున్నామని లైన్‌మేన్ రమేష్ తెలిపారు. వెంకటరమణకు భార్య రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే రెండో కుమారుడికి బారసాల చేశారు. ఇంతలోనే విషాదం జరగడంతో కుటు కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ట్రాన్స్‌కో ఏడీఈ ఆర్.శ్రీనివాసరా వు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరుబుజ్జిలి ఎస్సై పి.నర్సింహామూర్తి చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని తెలిపారు. -
పందిట్లో విద్యుత్ షాక్ ...నలుగురు మృతి
-
పెళ్లింట తీవ్ర విషాదం
భూదాన్‌పోచంపల్లి: రెండు రోజులపాటు బాజాభజంత్రీలు, కుటుంబసభ్యులు, బంధువులతో సందడిగా మారిన పెళ్లి ఇంటిపై విధి కరెంటు రూపంలో కన్నెర్రజేసింది. పారాణి కూడా ఆరక ముందు కరెంట్‌షాక్‌తో పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి, మేనత్త మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిందం సాయిలు(60) రెండో కుమారుడైన ప్రవీణ్ (23) వివాహం ఈ నెల 19న ఇదే మండలం రేవనపల్లి గ్రామానికి చెందిన యువతితో జరిగింది. శుక్రవారం పెళ్లి కుమార్తె ఇంట్లో చిన్నవిందు ఉండడంతో సాయిలు కుటుంబసభ్యులు, బంధువులంతా కలిసి వెళ్లారు. సాయంత్రం పోచంపల్లి మండలంలో వర్షం కురిసింది. వీరంతా రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. పెళ్లి సందర్భంగా ఇంటికి జే వైరు ద్వారా సీరియల్ బల్బులను అమర్చారు. పెళ్లి కుమారుడి మేనత్త శ్యామల గంగమ్మ ఆ జే వైరుపై తెలియక తడిబట్టలు ఆరేసింది. దీంతో ఆమెకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు పెళ్లికుమారుడి తల్లి చిందం గంగమ్మ పట్టుకోగానే ఆమెకూ షాక్ తగిలింది. గంగమ్మకు రక్షించబోయి సాయిలు, తర్వాత పెళ్లి కుమారుడు ప్రవీణ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు పట్టుకోవడంతో వారందరికీ షాక్ తగిలింది. ఏమైందో తెలియక సాయిలు పెద్ద కుమారుడైన చిందం భాస్కర్ ఫీజు తీసేయడంతో కింద పడిపోయారు. అప్పటికే తీవ్ర గాయాలైన వీరిని పోచంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వారు మృతిచెందారని చెప్పారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
మిర్యాలగూడ రూరల్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బీరవోలు గిరిధర్‌రెడ్డి(35) శుక్రవారం బోరుబావి విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లాడు. మోటారు పనిచేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.