Customers concern
-
కస్టమర్లకు యస్ బ్యాంక్ ఊరట
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మంగళవారం కస్టమర్లకు ఊరట కల్పించింది. ఖాతాదారులు నెఫ్ట్‌తో పాటు ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు బకాయిలను, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. యస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ ఇటీవల రద్దు చేసి, బ్యాంకు నుంచి విత్‌డ్రాయల్స్‌కు పరిమితులు విధించిన సంగీతి తెలిసిందే. ఆర్బీఐ నియంత్రణతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ఎస్బీఐ యస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం, క్రమంగా బ్యాంకు లావాదేవీలపై నియంత్రణలను సడలిస్తుండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.మరోవైపు బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించాయి. చదవండి :యస్ బ్యాంక్ స్కామ్‌పై సీబీ‘ఐ’ -
ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆర్డర్ చేయండి!
అమెజాన్ వినియోగదారులు మరోసారి మోసపోయారు. గతంలో చిప్స్ ప్యాకెట్లలో తక్కువ చిప్స్ ఉంచి, గాలి నిండుగా నింపి వినియోగదారులను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డాబర్ కంపెనీ కూడా ఇలాంటి మోసానికే పాల్పడింది. అమెజాన్ ద్వారా డాబర్ కంపెనీ విక్రయించిన క్యాండీ ప్యాకెట్లలో రెండు ఫ్లేవర్లు సమానంగా లేకపోవటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. డాబర్ కంపెనీపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కస్టమర్లు హజ్మోలా చాక్లెట్ ప్యాకెట్‌ను ఆర్డర్ చేశారు. ఇందులో రెండు రకాల క్యాండీలు సమానంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ప్యాకెట్ డిజైన్ చేసి ఉంది. కానీ తీరా చూస్తే గ్రీన్ క్యాండీస్(అల్బెలా ఆమ్) తక్కువగా, రెడ్ క్యాండీస్(చుల్బులి ఇమ్లీ ఫ్లేవర్) సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. క్యాండీల లెక్క సమానంగా లేకపోవటంతో కస్టమర్లు వారి నిరుత్సాహాన్ని రివ్యూల ద్వారా వెల్లగక్కారు. అక్షయ్ అనే అమెజాన్ యూజర్ మాట్లాడుతూ.. నేను క్యాండీస్‌ను ఇప్పటికి మూడునాలుగు సార్లు కొనుగోలు చేశాను. ఈ ప్యాకెట్లో మొత్తంగా 125 వస్తే గ్రీన్ క్యాండీలు మాత్రం పదే ఉన్నాయి. అందులో గ్రీన్ క్యాండీ (ఆమ్) కాస్తంత తీపిగా ఉందంతే. ఇక మిగతా క్యాండీలు చాలా పుల్లగా ఉన్నాయని పేర్కొన్నాడు. తీపిని ఇష్టపడేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఆర్డర్ చేయడం మంచిదని సూచించాడు. మిగతా కస్టమర్లు సైతం ఇంత తక్కువగా గ్రీన్ క్యాండీలు ఇచ్చారేంటని డాబర్‌పై మండిపడుతున్నారు. ఇక వీరి చాక్లెట్ల గోలపై ట్విటర్లో ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. -
తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణంలో ఒక్కోఖాతాదారుడిదీ ఒక్కోదీన గాధ. పండుగ సందర్భంలో కుటుంబాలతో సంతోషంగా ఎలా గడపాలంటూ బాధిత ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల కుంభకోణం వెలుగు చూడటంతో ఆర్బీఐ పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెయ్యి రూపాయలకు మించి ఏ ఖాతాదారుడు నగదు తీసుకోవడానికి వీల్లేదని పరిమితులు విధించింది. ఆ తరువాత బాధితుల ఆందోళనతో ఈ లిమిట్‌ను 25వేలకు పెంచింది. అయినప్పటికీ ఉన్నట్టుండీ తమ ఖాతాల్లోని నగదు స్తంభించిపోవడంతో... కూతురి పెళ్లి ఎలా అని, అమ్మాయి ఫీజు ఎలా కట్టాలి, అమ్మా నాన్న, వైద్య ఖర్చులు..ఇలా ఒక్కొక్కరూ వర్ణించనలవి కాని ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళనకు దిగారు. తాజాగా ముంబైలోని బీజేపీ కార్యాలయం ముందు వందలాదిమంది నిరసనకు దిగారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు మీడియా సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆందోళనకారులు ఆమెను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని ను కోరారు. ప్రధానంగా టీవీ నటి నూపుర్ అలంకార్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిజంగా సినిమా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. అమ్మ ఆక్సిజన్‌పై చావుబతుకులమధ్య ఉన్నారు. మామగారు ఈ మధ్యనే ఆపరేషన్ అయింది.. దానికి సంబంధించిన బకాయిలు కట్టాల్సి వుందని నూపుర్ మీడియాతో వాపోయారు. తన ఖాతా స్థంభించిపోవడంతో నగలు అమ్మాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే.. ఇక ఇంట్లో వస్తువుల్ని కూడా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పీఎంపీ కుంభకోణం వ్యవహారంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థికమంత్రిగా తానేమీ చేయలేననీ, రెగ్యలేటరీ అయిన ఆర్బీఐ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. అయితే ఖాతాదారులు, ఆందోళనను అర్థం చేసుకోగలమని, వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్‌ను కోరనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ (గురువారం) సాయంత్రం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. అలాగే పరిస్థితిపై వివరంగా అధ్యయనం చేయమని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కోరాననీ, ఇందులో ఆర్బిఐ ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. అంతేకాదు అవసరమైతే, సంబంధిత చట్టాలను సవరించాల్సిన మార్గాలను అన్వేషించమని ఆదేశించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. TV Actor Nupur Alankar on PMC Bank collapse:My mother is on oxygen&father-in-law underwent a surgery recently. I had to plead&borrow from people.Our accounts are frozen&payment cards aren't working.I had to sell my jewellery.If it is not sorted, I'll have to sell household items. pic.twitter.com/LDDAxq8jhJ — ANI (@ANI) October 10, 2019 -
ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) టాప్ కార్పొరేషన్ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) పై ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్ 35 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం జారీ చేసిన ఒక నోటీసులో పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం డిపాజిటర్లు, ఖాతాదారులు వెయ్యి రూపాయలుమాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉందని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధానంగా ముంబై బ్రాంచ్ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఒకవైపు రానున్నపండుగ సీజన్.. మరోవైపు వెయ్యి రూపాయలకు మించి నగదు ఉపసహంరణ కూడదనే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య జనులపై తీరని భారమని పేర్కొన్నారు. తాను 3లక్షల ఆర్డీ డిపాజిట్ చేశానని, ఇపుడు వెయ్యి రూపాయలకు మించి డ్రా చేయకూడదంటే.. తన కుమార్తె ఫీజు ఎలా కట్టాలని ఒక ఖాతాదారుడు వాపోయాడు. ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పొదుపు బ్యాంకు ఖాతా లేదా కరెంట్ అకౌంట్ లేదా మరేదైనా పీఎంసీ ఖాతాదారుడు తన మొత్తం బ్యాలెన్స్‌లో వెయ్యి రూపాయలు మించి విత్ డ్రా చేసుకునే అవకాశం. అలాగే బ్యాంకు ఎలాంటి రుణాలను మంజూరు చేయలేదు. దీంతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై బ్యాంకు స్పందించింది. గడుపులోపే పరిస్థితిని చక్కదిద్దుతామని పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ వినియోగదారులకు రాసిన ఒక లేఖలో వివరణ ఇచ్చారు. ఇది డిపాజిటర్లకు, కస్టమర్లందరికీ కష్టమైన సమయం అంటూ క్షమాపణలు చెప్పారు. దయచేసి తమతో సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమించి బలంగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. కాగా 1984లో ముంబైలో ప్రారంభమైన ఈ బ్యాంకు పలు రాష్ట్రాల్లో, 137 బ్రాంచ్‌లతో తన సేవలను అందిస్తోంది. కోపరేటివ్ బ్యాంకుల్లో టాప్ 10లో చోటు సంపాదిస్తున్న పీఎంసీ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి), మధ్యప్రదేశ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఖాతాలలో నగదు మాయం:స్పందించని బ్యాంకు
-
ఖాతాలలో నగదు మాయం:స్పందించని సిండికేట్ బ్యాంకు
హైదరాబాద్: సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంకు బ్రాంచ్‌లో ఖాతాదారులు దాచుకున్న డబ్బు మాయం అయింది. మొత్తం 22 మంది ఖాతాదారులకు చెందిన 10 లక్షల 73వేల రూపాయలు మాయం అయ్యాయి. తాము దాచుకున్న డబ్బు తమకు ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు యాజమాన్యం నుంచి స్పందనలేదు. ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. జరిగిన మోసానికి తమకేలాంటి సంబంధంలేదని బ్యాంకు యాజమాన్యం చెబుతోంది.