
వినియోగదారుడు కొని మోసపోయిన క్యాండీ ప్యాకెట్
అమెజాన్ వినియోగదారులు మరోసారి మోసపోయారు. గతంలో చిప్స్ ప్యాకెట్లలో తక్కువ చిప్స్ ఉంచి, గాలి నిండుగా నింపి వినియోగదారులను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డాబర్ కంపెనీ కూడా ఇలాంటి మోసానికే పాల్పడింది. అమెజాన్ ద్వారా డాబర్ కంపెనీ విక్రయించిన క్యాండీ ప్యాకెట్లలో రెండు ఫ్లేవర్లు సమానంగా లేకపోవటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. డాబర్ కంపెనీపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కస్టమర్లు హజ్‌మోలా చాక్లెట్ ప్యాకెట్‌ను ఆర్డర్ చేశారు. ఇందులో రెండు రకాల క్యాండీలు సమానంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ప్యాకెట్ డిజైన్ చేసి ఉంది. కానీ తీరా చూస్తే గ్రీన్ క్యాండీస్(అల్బెలా ఆమ్) తక్కువగా, రెడ్ క్యాండీస్(చుల్‌బులి ఇమ్లీ ఫ్లేవర్) సంఖ్య ఎక్కువగా ఉన్నాయి.
క్యాండీల లెక్క సమానంగా లేకపోవటంతో కస్టమర్లు వారి నిరుత్సాహాన్ని రివ్యూల ద్వారా వెల్లగక్కారు. అక్షయ్ అనే అమెజాన్ యూజర్ మాట్లాడుతూ.. నేను క్యాండీస్‌ను ఇప్పటికి మూడునాలుగు సార్లు కొనుగోలు చేశాను. ఈ ప్యాకెట్‌లో మొత్తంగా 125 వస్తే గ్రీన్ క్యాండీలు మాత్రం పదే ఉన్నాయి. అందులో గ్రీన్ క్యాండీ (ఆమ్) కాస్తంత తీపిగా ఉందంతే. ఇక మిగతా క్యాండీలు చాలా పుల్లగా ఉన్నాయని పేర్కొన్నాడు. తీపిని ఇష్టపడేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఆర్డర్ చేయడం మంచిదని సూచించాడు. మిగతా కస్టమర్లు సైతం ఇంత తక్కువగా గ్రీన్ క్యాండీలు ఇచ్చారేంటని డాబర్‌పై మండిపడుతున్నారు. ఇక వీరి చాక్లెట్ల గోలపై ట్విటర్‌లో ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment