
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ట్విటర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడాదికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ట్విటర్ బాస్‌గా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే సంస్థలో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ట్విటర్‌లో మస్క్ చర్యలతో దిగ్గజ కంపెనీలు వేలకోట్లు నష్టపోయాయి. ఆ నష్టభయాన్ని ముందే గుర్తించిన ఇతర సంస్థలు ట్విటర్‌లో అడ్వటైజ్‌మెంట్లను నిలిపివేశాయి.
అయితే ఈ తరుణంలో టెక్ దిగ్గజం యాపిల్‌తో పాటు అమెజాన్‌లు ప్రకటనల్ని పునఃప్రారంభించాలని భావిస్తున్నాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లను ఊటంకిస్తూ.. ట్విటర్‌లో యాపిల్ ప్రకటనలను తిరిగి ప్రారంభించనున్నట్లు మస్క్ చెప్పారు. ఈ విషయంపై అమెజాన్, యాపిల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించక పోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment