D Paparao
-
ఇది భద్రలోక్ బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి గాను తాత్కాలిక (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లక్ష్యం నాలుగు విభాగాల ప్రజలకు – పేదలు, యువకులు, రైతులు, మహిళలకు మేలు చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ నాలుగు వర్గాలకు బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ఏ విధమైన మేలు చేసిందన్నది ఇక్కడి ప్రశ్న? 2014 వరకూ,అంటే తాము అధికారంలోకి వచ్చే ముందర అంతా చిందరవందరే అన్నట్లు ‘మా ఆర్థిక నిర్వహణ ద్వారా 2014 ముందరి అన్ని ఆర్థిక సవాళ్ళనూ నేడు అధిగ మించాం’ అంటూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉప న్యాసంలో వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. కాంగ్రెస్ హయాంలో నాటి అత్యధిక పతన స్థాయి అయిన డాలర్‌తో పోలిస్తే 65 రూపాయలుగా రూపాయి విలువ ఉంది. నేడు రూపాయి విలువ డాల ర్తో పోలిస్తే మరింత దారు ణంగా దిగజారి 84 రూపా యల పరిధిలో ఉంది. ఇక, నిరుద్యోగం 2014లో 5.4 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ నాటికి 8.7 శాతా నికి పెరిగిపోయింది. 2013లో దేశంలో ధరలు భారీగా పెరిగిపోవడం (ద్రవ్యోల్బణం) కూడా 2014 ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమికి కారణం. కాగా, 2022 నుంచీ మొదలుకొని దేశంలో ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఇక స్థూల జాతీయో త్పత్తి విషయంలో కూడా మన పరిస్థితి కేవలం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, గుడ్డి వాళ్ళ రాజ్యంలో... ఒంటి కన్ను రాజులా (రఘురాం రాజన్ వ్యాఖ్యానించినట్లు) మాత్రమే ఉందన్నది నిజం. యూపీఏ హయాంలో జీడీపీ సాలీనా సగటున 8.1 శాతం మేర పెరగగా... ప్రస్తుత బీజేపీ హయాంలో (2014 నుంచి 2023 వరకు) అది సాలీన సగటున 5.4 శాతం మేరనే పెరిగింది. కోవిడ్ కాలంలోని ఆర్థిక పతన స్థితిని కాసేపు పక్కన పెట్టినా మొత్తంగా బీజేపీ పాలనలో జీడీపీ పెరుగుదల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. అవినీతిని నిర్మూలించామంటూ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ ‘అవినీతి సూచి’లో భారత్ ర్యాంకు మొత్తం 180 దేశాలలో 2022 సంవత్సరంలో 85వ స్థానంలో ఉండగా 2023లో 93వ స్థానానికి దిగజారింది. ఇక అసమానతల విషయంలో నిత్య జీవితంలో దిగజారిపోతోన్న సామాన్య జనం జీవన ప్రమాణాలు ఒక ప్రక్కనా... పెరిగి పోతోన్న కార్పొరేట్లూ, ధనవంతుల సంపద రాసులు మరో పక్కనా కనపడుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ప్రస్తుత బడ్జెట్ ఈ సమస్యలు వేటికీ జవాబు ఇవ్వలేదు. ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ మాత్రమేనంటూ సమస్యల పరిష్కారాల నుంచి తప్పించుకునే ధోరణి... ద్రవ్యలోటు తగ్గింపు పేరిట ప్రజా సంక్షేమం కోసం... వారి సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ఏ వ్యయాలు చేయలేని దుఃస్థితి తాలూకు ఇరకాటం ఈ బడ్జెట్ రూప కల్పనలో దాగి వున్న అసలు నిజాలు. ఒక పక్కన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు మూడు రెట్లు పెరిగాయి. అలాగే పరోక్ష పన్నుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే, మానిటైజే షన్ ద్వారానూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారానూ కూడా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మరో పక్కన కొన్ని లెక్కల ప్రకారం దేశీయ అప్పులు 200 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున సమకూరిన వనరుల ఫలం, ఫలితం మాత్రం ప్రజలకు దక్కడం లేదు. అంటే, బడ్జెట్ల క్రమంలో జరుగుతోంది పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే అనేది నిర్వివాదాంశం. పెరుగుతోన్న బిలి యనీర్లు, ప్రపంచ ధనవంతుల జాబితాలో పైకి పాకు తోన్న వారి ర్యాంకులే దీనికి తార్కాణం! ఇక ప్రస్తుత బడ్జెట్ కూడా ఈ య«థాతథ స్థితికి మినహాయింపేమీ కాదు. ప్రస్తుత బడ్జెట్ అనంతరం జాతినుద్దేశించి తన సందేశంలో ప్రధాని మోదీ ఇది చరిత్రాత్మక బడ్జెట్ అన్నారు. ఇది కేవలం మాటల గారడీ. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందర ఈ బడ్జెట్ నుంచి ఏ సంచలనాలనూ ఆశించొద్దని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఆమె ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని చెబుతోన్న చరిత్రాత్మక కేవలం... ధనవంతుల సేవలో తరిస్తోన్న బడ్జెట్ల పరంపరలో పదవ మైలు రాయిని చేరుకోవడం తాలూకూది మాత్రమే కావచ్చు!! డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు మొబైల్: 9866179615 -
అమెరికాతో అంటకాగితే అంతే సంగతులు!
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచీ, తన విదేశాంగ విధానాన్ని అమెరికాతో భారత్‌కి మరింత సాన్నిహిత్యాన్ని పెంచే దిశగానే నడిపించింది. ముఖ్యంగా, రక్షణ పరంగా ఈ భాగస్వామ్యం పెద్దగంతులలో అభివృద్ది చెందింది. ఈ క్రమంలోనే, అమెరికా నుంచి కూడా భారత ప్రభుత్వం తన చొరవలకు తగిన విధమైన సానుకూల స్పందనలను ఆశించింది. అలాగే, అమెరికా నుంచి ఆయుధాల దిగుమతులను కూడా, మోదీ హయాంలో మరింతగా పెంచారు. గతనుంచే ఇవి పెరుగుతూ వస్తున్నా, మోదీ హయాంలో మరింత వేగం పుంజుకున్నాయి. దీనికి తార్కాణమే 2007 అనంతర కాలం నుంచీ నేటి వరకూ మన ప్రభుత్వాలు అమెరికాతో చేసుకున్న ఆయుధాల కాంట్రాక్టుల మొత్తం 17 బిలియన్ డాలర్లకు పైగా చేరుకోవడం. అలాగే, మన దేశంలోకి పలు రకాల అమెరికా ఉత్పత్తుల దిగుమతులకు మరింత ఆస్కారం కలిగించే విధంగా చర్యలు తీసుకొని అమెరి కాకు మనతో ఉన్న వాణిజ్యలోటును తగించుకోవడంలో కూడా సహకరించింది. కాగా, గతంలో భారత్ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన ఎమ్.కె నారాయణన్ వంటివారు కూడా అమెరికాతో అతి సాన్నిహిత్యం, నేటి పరిస్థితులలో తగదని గతం నుంచీ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు! ఇలాంటి వారి సలహా లను పెడచెవిన పెట్టిన ఫలితం, నేడు మెల్లగా కళ్లముందు ఆవిష్కృతమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తన దేశ వాణిజ్య లోటును తగ్గించుకునే క్రమంలో భారత్‌పైన కూడా ఒత్తిడిని, దాడిని పెంచుతున్నారు. ఒక వైపున భారత్‌ను డిమాండ్ చేసి మరీ హార్లీ డేవిడ్సన్ బైక్లవంటి వాటిపై మన దేశం విధిస్తోన్న సుంకాలను తగ్గింపచేసుకుంటూ, మరో ప్రక్కన భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతోన్న స్టీలు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల మీద సుంకాలను పెంచేశాడు. అలాగే భారత్ నుంచి కూడా 1974 నుంచి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతి అవుతోన్న 2000 రకాల సరకులకు ఆ సదుపాయాన్ని తొలగించాడు. దీని వలన, ఈ పద్ధతి క్రింద 2018లో అమెరికాకు సుమారు వి6 బిలియన్ల మేర ఎగుమతులను చేసిన భారత్‌పై నేడు అదే ఎగుమతులకు గాను అదనంగా సుమారు 190 మిలియన్ డాలర్ల సుంకాల భారం పడనుంది. దీనితో, మన ఎగుమతులలో కొన్ని అమెరికాలో ఖరీదైనవిగా మారి, అవి ఇతర దేశాల సరుకుల పోటీని తట్టుకోలేని స్థితి వస్తుంది. ఇదంతా చాలదన్నట్లు, మన దేశీయ సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తూ ఇరాన్ నుంచి మనం చమురును దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగిస్తే, ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా బెదిరిస్తోంది. వాటికి లొంగి పోతే మనం, మన చమురు అవసరాల కోసం, ఇతరేతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. దీనితో చమురు దిగుమతులకోసం మనం అధిక వ్యయాన్ని చేయాల్సి వస్తుంది. ఫలితంగా మన దేశీయ విదేశీ కరెన్సీ నిల్వలపై ఒత్తిడి పెరిగి, రూపాయి విలువ పతనానికి దారి తీస్తుంది. దాంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగటంతోపాటుగా, ఇతరేతర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. మన ప్రభుత్వం గత సంవత్సరంలో రష్యాతో చేసుకున్న యస్ 400 మిసైల్ రక్షణ వ్యవస్థల దిగుమతుల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోమంటూ అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. అయితే నాటోలో సభ్యత్వం కలిగివున్న టర్కీ ఈ ఒత్తిళ్ళను బేఖాతరు చేసి వచ్చే నెలలోనే ఈ మిసైల్స్‌ని దిగుమతి చేసుకుంటోంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే ఏం ఇస్తావు? తరహాగా ఉన్న అమెరికా ధోరణికి ఇకనైనా అడ్డుకట్ట వేయటం మన దేశానికి తక్షణ ఆగత్యం. ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకుంటోన్న కొన్ని దిద్దుబాటు చర్యలు కొంత ఆశను కలిగిస్తున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ నేపథ్యంలో మనం అమెరికాకి దూరంగా చైనా, రష్యా వంటి అంతర్జాతీయ స్వేచ్ఛావాణిజ్యాన్ని కోరుకుంటోన్న దేశాలతో దగ్గరగా జరగవలసి ఉంది. దీనిలో భాగంగానే మోదీ మళ్లీ దేశ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో మనం చైనాను నొప్పించకుండా జాగ్రత్త తీసుకుంటూ ఆ ప్రమాణస్వీకారోత్సవానికి టిబెట్, తైవాన్‌ల ప్రతినిధులను ఆహ్వానించకపోవడం గమనార్హం. అలాగే, షాంఘై సహకార సంస్థ సమావేశంలో మోదీ చైనా నేత జి, రష్యా నేత పుతిన్‌తో జరిపిన చర్చలు కూడా మూడు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొనే దిశగానే ఉన్నాయని వార్తలు. ఇటువంటి చొరవల ద్వారా మాత్రమే తన ఆర్థిక సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించుకొనేందుకు భారత్‌తో మైత్రి పేరిట భారత్ మార్కెట్లను ఏకపక్షంగా కొల్లగొట్టే అమెరికా ఎత్తుగడలకు మనం చెక్పెట్టగలం. మన పాలకులు గనుక అమెరికాతో తమ పీఠముడిని బద్దలు చేసుకొని, దేశీయ ప్రయోజనాలను కాపాడుకొనే దిశగా చర్యలు తీసుకోకుంటే అది అతిమంగా దేశీయ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా పరిణమించగలదు. ఇలాంటి ముప్పును తెచ్చిపెట్టే, అమెరికాతో సాగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మనకు చెరుపే చేస్తుంది. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
సైద్ధాంతిక విస్మృతి కమ్యూనిస్టులకు ‘శాపం’!
విశ్లేషణ మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత పెరగవలసిన ప్రస్తుత దశలో అవి మరింతగా బలహీన పడుతున్నాయి. కొద్దిమాసాల క్రితం జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికలూ, నిన్నా మొన్నటి బీహార్ ఎన్ని కలూ, నేటి వరంగల్ ఎన్నికల దాకా వామపక్షాల పాత్ర, వాటి వైఫల్యాలు మనం గమనించినవే. పైగా మితవాద బి.జె.పికి ప్రత్యామ్నాయ వేదికగా ఢిల్లీ, బిహార్ ఎన్ని కలలో కొన్ని పార్టీలు ముందుకొచ్చారు. కానీ బి.జె.పిని విమర్శించడంలో ముందుండే వామపక్షాలు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పోషించిన పాత్ర ఏమిటి? ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, ఉనికిని కాపాడుకోవడం పేరిట విడిగా సంఘటనలు కట్టి ఎన్నికల గోదాలోకి దిగాయి. కాగా, సుదీర్ఘకాలంపాటు ఈ పార్టీలు ప్రతి ఎన్నికలలోనూ ఏదో ఒక బూర్జువా పక్షంతో జట్టుకడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా ఇప్పుడు తమ మహాసభలలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక ముందు ఏ బూర్జువా పక్షం తోను ఎన్నికల పొత్తులు పెట్టుకోబోమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే విడిగా సంఘటనలు కట్టి పోటీ చేసిన ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో కూడా అవి డిపాజిట్ లను కూడా కోల్పోయి పరాజయం పాలవడం గమ నార్హం. ఇక తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల అభ్యర్థి సంపాదించిన ఓట్లకంటే దరిదాపు రెట్టింపు ఓట్లను ‘‘శ్రమ శక్తి పార్టీ’’గా పోటీ చేసిన అభ్యర్ధి పొందడాన్ని కూడా గుర్తించాలి. మరి ఇంతటి దారుణ వైఫల్యాల దిశగా వామ పక్షాలు ఎందుకు దిగజారాయి? అనేకమంది విమర్శిస్తున్నట్లుగా ఈ పార్టీల ‘‘పిడివాదమా’’? లేకుంటే ఆ పార్టీలే తరచుగా తమ ఆత్మవిమర్శన డాక్యుమెంటులలో పేర్కొనే ‘పార్లమెంటరిజంకు లోనవ్వడం’ అనే బలహీనతా? ఈ ప్రశ్నకు జవాబును చెప్పుకోకుండా, భవిష్య త్తులో కూడా కమ్యూనిస్టు పార్టీలు పురోగమించడం అసాధ్యం! కాగా కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ బలహీనతలకు లోనయ్యాయనే వాదనలో కొంత నిజం ఉన్నా, ఈ కారణం వామపక్షాల వైఫల్యానికి సంబంధిం చిన మూలాలను సంపూర్ణంగా చూడడానికి సరిపోదు. భారత్‌తో సహా వివిధ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం వెనుక కారణాలను మనం కేవలం పార్ల మెంటరిజంలోనే కాక ఇతరేతరంగా కూడా చూడాలి. కమ్యూనిస్టులు పార్లమెంట్లలో పాల్గొనటానికి సంబంధించి రష్యా విప్లవ క్రాంతదర్శి లెనిన్ పదే పదే ప్రస్తావించిన ఒక అంశం ‘‘పరిస్థితి విప్లవకరంగా లేనపుడు కూడా, విప్లవకర మనోస్థితిని కలిగి ఉండడమే నిజమైన విప్లవకారుడి లక్షణం’’. పార్లమెంటరీ రాజకీ యాలవంటి ఏ మాత్రం రొమాంటిసిజం లేని పోరాట పద్ధతులలో పాల్గొంటూనే, కమ్యూనిస్టులు తమ పోరాట మనోస్థితిని కాపాడుకోగలగాలన్నది దీని సారాంశం. లెనిన్ వివరించిన మరో అంశం: ‘‘విమర్శ.. అత్యంత తీక్షణమైన, నిర్దాక్షిణ్యమైన, రాజీలేని విమర్శ పార్లమెంటరిజం మీదా, పార్లమెంటరీ కార్యకలాపాల మీదా కాక, పార్లమెంటరీ ఎన్నికలనూ, పార్లమెంటరీ వేదికనూ విప్లవ, కమ్యూనిస్టు పద్ధతిలో వినియోగించు కోవడం చేతకాని నాయకులమీద, అంతకంటే ఎక్కు వగా ఇష్టం లేని నాయకులమీద చేయాలి...’’ స్థూలంగా కమ్యూనిస్టు సిద్ధాంతం పార్లమెంటరిజానికి సంబం ధించీ, పోరాట మనోస్థితి గురించి చెబుతున్నదాని సారాంశం ఇది! కాబట్టి మన కమ్యూనిస్టు పార్టీలు తమ లోపాలకు పార్లమెంటరిజాన్ని సాకుగా చూపటం కూడా సైద్ధాంతిక బలహీనతే. దీంతోనే కమ్యూనిస్టు పార్టీల పరి స్థితి ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మేదిగా’ మారిపోయింది. వామపక్షాలు తమ సైద్ధాంతిక మూలాలనుంచి దూరంగా జరిగిపోవటం, అంతకు మించి వాటికి ఏర్ప డిన సైద్ధాంతిక విస్మృతిలోనే వాటి బలహీనతలు, పత నానికి మూల కారణాలున్నాయి. ఈ అంశాన్ని పరిశీ లిద్దాం. 1939- 45 నాటి రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ చారిత్రక విజయంతో తూర్పు యూరోప్‌లో ఒక సోషలిస్టు శిబిరమే ఏర్పడటం వంటివి ప్రపంచ పరిస్థితిలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఆ కాలంలో వివిధ దేశాలకు చెందిన పలువురు నేతలూ, ప్రజలూ సోవియట్ అభిమానులయ్యారు. తమ తమ దేశాలకు సంబంధించి ఎటువంటి లోతైన, సమగ్ర పరిశీలనా, అధ్యయనం లేకుండానే ప్రత్యక్షంగానో, పరో క్షంగానో సోవియట్ యూనియన్ దిశానిర్దేశంలో నడవ డం అనేది అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలకు అలవా టుగా మారింది. ఈ పార్టీలూ, వాటి నాయకత్వంలో అధికభాగం పరిమాణాత్మకంగా ఎదిగాయే కానీ, వాటి సైద్ధాంతిక పటిమ మాత్రం క్షీణించింది. ఈ క్రమంలోనే, 1991లో సోవియట్ పతనంతో ఈ పార్టీలు మరింత తీవ్ర అస్థిత్వ సమస్యలోకి పడిపో యాయి. గతంలోలాగా కనీసం పడికట్టు మాటలూ, నినాదాలూ, యాంత్రికమైన పనితీరు నిర్వహించిన స్థాయిలో కూడా ఈ పార్టీలు నిలబడలేకపోయాయి. చివరికి పరిస్థితి నిన్నటి ‘‘ఇలా మిగిలాం’’ దశ నుంచి నేడు ‘ఇలా మిగిల్చారు’ దశకు చేరింది. అంటే, కమ్యూ నిస్టు పార్టీలు తమ ప్రభను కోల్పోవడానికీ కారణం ఆ పార్టీల అంతర్గత సైద్ధాంతిక డొల్లతనంలోనే అధికంగా ఉంది. దాంతో వాటి స్థితి నేడు సంపూర్ణంగా దిగ జారింది. అందుకే నేడు విప్లవాలూ, పెనుమార్పులూ ప్రపంచంలో ఎంత అవసరం అనేది పక్కన పెడితే, మనుగడ కొనసాగింపు కోసం కమ్యూనిస్టు పార్టీలలో అంతర్మథనం రూపంలో విస్పోటనలు కచ్చితమైన అవసరం. ఇది జరిగి, ఆ పార్టీలు నిలబడలేకపోతే, చరిత్ర తన ముందడుగుకు కావల్సిన శక్తులను తానే సృజించు కుంటుంది. లాటిన్ అమెరికాలోను, పలు చోట్ల జరుగు తోంది ఇదే. కాబట్టి, ఇతర పాలక పక్షాల గెలుపోటము లను నిర్ణయించగల తమ నిన్నటి స్థితినీ, స్థాయినీ కూడా కోల్పోయిన భారత కమ్యూనిస్టు పార్టీలు ఇక కోల్పోయేందుకు ఏముంది? డిపాజిట్లు మినహా... అని ప్రజ లు భావించే దుస్థితి నుంచి బయటపడేందుకు ఉన్న ఒక ప్రధాన మార్గం ఏదంటే.. ఎన్నికలలో పోటీల గురించీ, దీర్ఘ దృష్టిలేని రాజకీయ కార్యాచరణ గురించి కాక ఆత్మ విమర్శతో కూడిన ఒక సుషుప్తావస్తలోకి, అంతఃస్థితిలోకి కొంతకాలం పాటైనా వెళ్ళడమే...! (వ్యాసకర్త: డి.పాపారావు, సామాజిక విశ్లేషకులు సెల్: 9866179615)