Dairy Company
-
సాయం చేస్తా... సరదా తీర్చండి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేశారు. అసైన్డ్ భూమి.. ఐదు శాతం వాటా! ఆర్జిన్ డెయిరీ సంస్థ మంచిర్యాల జిల్లాలో తమ బ్రాంచ్ ఏర్పాటు కోసం కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. అది తెలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ఆ డెయిరీ ఏర్పాటు చేయాలని, అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్ భూమిని అప్పగించారు. అది లావణి పట్టా భూమి అయినా విక్రయించినట్టుగా పేర్కొని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థలంలో డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు. నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారని.. తర్వాత డబ్బులు, ఇతర ‘సాయం’ కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో గొడవ తలెత్తినట్టు తెలిసింది. గత జనవరిలో ఏకకాలంలో పదిచోట్ల ఈ డెయిరీ నిర్వాహకులపై మోసం కేసులు నమోదయ్యాయి. పోలీసులు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కంపెనీలో భాగస్వామి అయిన షెజల్ అనే యువతి పేరిట ఆడియో, వీడియో, పలు వాట్సాప్ స్క్రీన్షాట్లు విడుదల అయ్యాయి. ‘ట్యాబ్లెట్లు’ అంటూ అమ్మాయి కోసం చాటింగ్! డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు. చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్వాల్వ్ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు. మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. – ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం. దళితబంధులో కోట్లు కొట్టేసేలా? దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని మంచిర్యాల జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తన నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఆఫర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చలు జరిగినట్టు తెలిసింది. మరో ప్రజాప్రతినిధి గేదెలకు బదులు ట్రాక్టర్లు ఇవ్వాలని కోరగా.. ఆ మేరకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదని తెలిసింది. సదరు మార్కెట్ చైర్మన్ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్‌కావడంతో వివాదం మరింత ముదిరిందని సమాచారం. ఈ వ్యవహారంలోనే డెయిరీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తోపాటు వరంగల్ ప్రాంతంలో ఈ డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయని.. రైతులకు పశువుల బీమా కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వివాదాలు, ఇతర కేసులు నమోదయ్యాయని సమాచారం. వ్యవహారంపై సీఎంవో నజర్? మంచిర్యాల జిల్లాలో ప్రలోభాల వ్యవహారంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ‘పాల కోసం ప్రలోభాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా వర్గాలు పలు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో సీఎం ఆఫీసు కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. నాపై దుష్పప్రచారం చేస్తున్నారు నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. – దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే -
Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో..
ఏ సంస్థ అయిన తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్కెటింగ్ తప్పనిసరి. మార్కెటింగ్, ప్రయోషన్స్ ద్వారా తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. వీటిలో యాడ్స్ కీలకమైనవి. యాడ్స్ ద్వారా విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. అయితే ఈ యాడ్స్ కొన్నిసార్లు చిక్కుల్లో పడేస్తాయి. యాడ్స్‌లోని కంటెంట్ కొందరి మనోభావాలు దెబ్బతీసుంది. తాజాగా సౌత్ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్ మిల్స్ ఇలాగే వివాదంలో చిక్కుకుంది. సియోల్ మిల్క్ తన డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఇటీవల ఓ వీడియో యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో మహిళలను ఆవులుగా చూపించడంతో కంపెనీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఇందులో ఓవ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోలు తీస్తూ తిరుగుతూ ఉండగా అతనికి పొలంలో ఉన్న మహిళలు కనిపిస్తారు. వీరంతా అడవిలో జలపాతాల వద్ద నీళ్లు తాగి.. పక్కనే గడ్డి మీద మీద యోగా చేస్తుంటారు. వీళ్లను గమనించిన ఆ వ్యక్తి ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంతలోనే అతని చెప్పు కింద ఉన్న ఓ కట్టె పుల్ల విరిగి శబ్దం వస్తుంది. చదవండి: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ ఇలా కిందికి చూసి పైకి చూసే సరికి అక్కడ మహిళలు కనిపించరు. ఆ శబ్దం విన్న ఒక్కసారిగా మహిళలు ఆవులుగా మారిపోతారు. దీంతో అతడు ఆశ్యర్యానికి గురవుతాడు. సియోల్ మిల్క్ డెయిరీ ఉద్దేశం.. ప్రకృతి ఒడిలో తిరిగే తమ కంపెనీ ఆవులు స్వచ్చమైన నీరు తాగి.. లేత పచ్చిక బయళ్లు తిని స్వచ్ఛమైన పాలనిస్తాయని చెప్పడం. ఆ క్రమంలో అందమైన మహిళా మోడల్స్‌ను ఉపయోగించుకోవడం విమర్శలకు దారితీసింది. ఈ యాడ్‌ను సియోల్ మిల్క్ తన సోషల్ మీడియా అకౌంట్లో నవంబర్ 29న షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ యాడ్‌పై కొరియా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! మోడల్స్‌ను ఆవులుగా చూపించడం ఏంటంటూ కొందరు మండిపడుతున్నారు. అలాగే మహిళలను అలా సీక్రెట్‌గా వీడియో, ఫోటోలు తీయడం కూడా చట్ట్ట విరుద్ధమంటూ, మనుషులను పశువులుగా చూపించకూడదని మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీంతో డిసెంబర్ 8న ఈ యాడ్లను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అంతేగాక యాడ్ కారణంగా మనోభావాలు కించపరిస్తే క్షమించాలని కోరింది. యాడ్ రూపకల్పనలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామమని పేర్కొంది. -
కరోనా బెల్స్...ప్రొటీన్ ఫుడ్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆరోగ్య కారణాల రీత్యా ప్రొటీన్ ఫుడ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా బాధితులు, నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నవారు గుడ్లు చేపలు వగైరా ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శాఖాహారులకు ఉపకరించేలా.. హైదరాబాద్‌కి చెందిన పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తొలిసారి నేచురల్ పనీర్‌ని రూపొందించింది. దీనిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పన్నీర్‌ను ‘సాఫ్ట్ అండ్ క్రీమీ పన్నీర్’ గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీరు తెలిపారు. నేచురల్ గా... తెలంగాణా కేంద్రంగా ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న వాటిలో అతి కీలకమైన ఉత్పత్తి ఈ నేచురల్ పన్నీర్. దీని తయారీ కోసం వినియోగించే పాలలో ఎలాంటి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ లేదంటే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం దీనిలో విశేషం. ఈ కారణం చేత పన్నీర్ తాజాదనం, మృదుత్వం అలాగే ఉంటుంది. తమ రోజువారీ ఆహారంలో తగినంతగా ప్రొటీన్‌ను పొందాలని కోరుకునే శాఖాహారులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.. ఈ నేచురల్ పన్నీర్ 200 గ్రాముల ప్యాక్ 150 రూపాయల ధరలో లభిస్తుంది. పనీర్ మార్కెట్ కి ఊపు.. ప్రస్తుత పరిస్థితుల్లో పనీర్ వినియోగం బాగా పెరిగింది. ‘ఇండియన్ డెయిరీ మార్కెట్ రిపోర్ట్ అండ్ ఫోర్కాస్ట్ 20212026 ’పేరిట ఈఎంఆర్ విడుదల చేసిన నూతన అధ్యయనం భారతీయ డెయిరీ మార్కెట్ 2020లో దాదాపు 145.55 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ మార్కెట్ 20212026 మధ్యకాలంలో 6% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో.. భారతదేశంలో 75వేల కోట్ల రూపాయలుగా ఉన్న పన్నీర్ మార్కెట్లో తమ వాటాను సొంతం చేసుకోవడం కోసం కంపెనీలు లక్ష్యంగా చేసుకున్నాయి. అదే క్రమంలో తెలంగాణాలో స్థానిక బ్రాండ్‌గా ఉన్న సిద్స్‌ఫార్మ్ పెరిగిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. నేచురల్ పన్నీర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా సిద్స్ ఫామ్స్ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నది మా బ్రాండ్ సిద్ధాంతం’’ అని చెప్పారు. -
1400కోట్ల మోసం: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాల ఉత్పత్తుల తయారీ సంస్థ క్వాలిటీ లిమిటెడ్ సంస్థ 1,400 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తాజాగా అవినీతి నిరోధక శాఖ(సీబీఐ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఢిల్లీతో సహా ఎనిమిది చోట్ల సోమవారం తనిఖీలు చేసిన అనంతరం క్వాలిటీ లిమిటెడ్ బ్యాంక్ రుణాల చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు రుజువు కావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్వాలిటీ డైరెక్టర్లు సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ ఉన్నారు. 2012లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం వారిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కేసు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.(అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి) క్వాలిటీ లిమిటెడ్ 2010లో బ్యాంకు నుంచి క్రెడిట్ తీసుకుందని, అయితే 2018 ప్రారంభంలో చెల్లింపులను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ చేసిన మొత్తం, 13,147.25 కోట్ల రూపాయల అమ్మకాల్లో 7,107.23 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల కన్సార్టియం ద్వారా మళ్ళీంచబడిందని బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ సీబీఐకి చూపించింది. క్వాలిటి తన వ్యాపార కార్యకలాపాలను ఉధృతం చేయడం ద్వారా తన ఆర్థిక నివేదికలను మించిపోయిందని, రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య) దీనిపై సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ మాట్లాడుతూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంలలో క్వాలిటి సంస్థ మొత్తం 1400.62 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇదంతా బ్యాంక్ ఫండ్ల మళ్లీంపు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రశీదులతో పాటు తప్పుడు ఖాతాలు, ఆస్తులను సృష్టించి బ్యాంకులను మోసం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు భారతదేశపు పురాతన, అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఉన్న క్వాలిటీ లిమిటెడ్ డిసెంబర్ 2018 నుంచి దివాలా పరిస్థితులను ఎదుర్కొంటుందని కూడా ఆయన వెల్లడించారు. -
మే 4 నుంచి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ
మే 6న ముగింపు రూ. 750 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 4 (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. మే 6న (శుక్రవారం) ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది. ఈ ఐపీఓ నిధులను విస్తరణకు, ప్లాంట్ల ఆధునీకరణకు, అనుబంధ సంస్థలో పెట్టుబడులకు వినియోగించాలని కంపెనీ భావి స్తోంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1992లో కార్యకలాపాలు ప్రారంభిం చిన ఈ కంపెనీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తోన్న ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. -
పోటాపోటీగా... తగ్గిస్తున్నారు!
పాల కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ - తగ్గింపు ధరలు, డిస్కౌంట్ ఆఫర్లు... - ‘నందిని’ రాకతో ముదిరిన పోరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశంతో పాల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా పాల వినియోగం పెరుగుతూ వస్తున్నా... పోటీ కారణంగా కంపెనీలు డిస్కౌంట్ల బాట పడుతున్నాయి. సహకార దిగ్గజం అమూల్ ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఆరంభమైన ఈ పోటీ... మరో సహకార బ్రాండ్ ‘నందిని’ రావటం... ఇటీవలే ఆ సంస్థ తన పాల ధరను మరింత తగ్గించటంతో తీవ్రమైంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పాల కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో రంగంలోకి దిగుతున్నాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్దన్ బ్రాండ్ పాలను రూ.40కి విక్రయిస్తోంది. ఒక లీటరు పాలను కొన్న కస్టమర్‌కు రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను ఇటీవలి వరకు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ ... లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయిస్తోంది. జూలై 22 వరకూ ఈ ఆఫర్ ఉంది. కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని స్పెషల్ పేరుతో 3.5 శాతం వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే అందిస్తోంది. నిజానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు రూ.42-44 మధ్య విక్రయిస్తున్నాయని కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడే ధర ఎక్కువ... హైదరాబాద్ మార్కెట్లో ప్రయివేటు పాల కంపెనీల ధరలు మరీ ఎక్కువగా ఉన్నట్లు కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడ దాదాపు 20 బ్రాండ్ల వరకూ ఉన్నా... ధర మాత్రం దేశంలో ఎక్కడా లేనంతగా లీటరుకు రూ.6-10 వరకూ అధికంగా ఉన్నట్లు అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల వల్లే పరిస్థితి ఇలా ఉందని సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి ఇటీవల చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కేఎంఎఫ్ మాత్రమే పాల రైతులకు అత్యధికంగా లీటరుకు రూ.27 చెల్లించి సేకరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు రైతులకు రూ.19 కూడా చెల్లిస్తున్నాయని సంస్థ ఎండీ ఎస్.ఎన్.జయరామ్ ఇటీవల చెప్పారు. ‘దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారు. కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే జరుగుతోంది’ అన్నారాయన. కేఎంఎఫ్ కర్ణాటకలో లీటరు ప్యాకెట్‌ను రూ.29కే విక్రయిస్తోంది. రవాణా తదితర చార్జీలుంటాయి కనక హైదరాబాద్‌లో రూ.34కు విక్రయిస్తున్నట్లు జయరామ్ తెలిపారు. అమూల్‌తో మొదలు... హైదరాబాద్‌లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. అమూల్ రాక ముందు వరకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ మాత్రమే అతి తక్కువగా లీటరు పాలను రూ.38కి విక్రయించేది. ప్రైవేటు కంపెనీలు రూ.44 వరకు అమ్మేవి. విజయ బ్రాండ్‌ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అమూల్ కూడా లీటరు ధరను రూ.38గానే నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో అమూల్ రావటంతో అప్పటికే పాగావేసిన కంపెనీలకు ఏం చేయాలో పాలుపోలేదు. అన్ని ప్రైవేటు కంపెనీలు పాల ధరను తగ్గించాల్సి వచ్చింది. ఇక నందిని బ్రాండ్ రాకతో వీటికి షాక్ కొట్టినట్టయింది. 2015 మేలో రూ.36 ధరతో రంగంలోకి దిగిన నందిని... ఇటీవల రూ.34 ధరతో స్పెషల్ టోన్డ్ పాలను మార్కెట్లోకి తెచ్చింది. మిగతా కంపెనీలు ఏ మేరకు తగ్గిస్తాయో చూడాల్సిందే.