మే 4 నుంచి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ
మే 6న ముగింపు రూ. 750 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 4 (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. మే 6న (శుక్రవారం) ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది. ఈ ఐపీఓ నిధులను విస్తరణకు, ప్లాంట్ల ఆధునీకరణకు, అనుబంధ సంస్థలో పెట్టుబడులకు వినియోగించాలని కంపెనీ భావి స్తోంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్.. లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1992లో కార్యకలాపాలు ప్రారంభిం చిన ఈ కంపెనీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తోన్న ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.