damage roads
-
రోడ్డు మధ్యలో సింక్ హూల్...తప్పిన ప్రమాదం
-
హైదరాబాద్ లో కూంభవృష్టికి కుంగిన రోడ్లు
-
కొట్టుకుపోతున్న రోడ్లు
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రోడ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత రెండు వానాకాలాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు నిధుల్లేక పూర్తిస్థాయి మరమ్మతులు చేయని తరుణంలో.. ఈసారి కూడా విరుచుకుపడు తున్న వానలు మరోసారి రోడ్లను ఛిన్నా భిన్నం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పోటెత్తి రోడ్లను ముంచెత్తాయి. రోడ్ల మీదు గా దూసుకుపోతున్న వరద ఎక్కడికక్కడ రహదారులను కోస్తోంది. గత రెండేళ్లలో జాతీయ రహదారులకు పెద్దగా ఇబ్బంది కలగనప్పటికీ, ఈసారి కొన్ని చోట్ల అవి కూడా భారీగానే దెబ్బతిన్నాయి. ఇక రాష్ట్ర రహదారులు యథావిధిగా తీవ్రంగానే దెబ్బతిన్నాయి. దాదాపు 65 ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులు, 26 చోట్ల జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర రహదారులకు రూ.70 కోట్ల మేర, జాతీయ రహదారులకు రూ.20 కోట్ల వరకు నష్టం కలిగింది. అధికారులు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రా తిపదికన పనులు ప్రారంభించారు. రోడ్లు భవనాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న రూ.5.5 కోట్ల నిధులతో పునరుద్ధరణ పను లు చేపట్టారు. జాతీయ రహదారులను రూ.11 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు. ఇలాగే మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కొనసాగితే రోడ్లు మరింతగా దెబ్బతింటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడంటే... ►హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద గోదావరి బ్యాక్‌వాటర్‌తో 200 మీటర్ల మేర 2 మీటర్ల ఎత్తుతో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఇక్కడ 100 మీటర్ల పొడవుతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. ►నిజామాబాద్–జగ్దల్పూర్ జాతీయ రహదారి మంచిర్యాల సమీపంలోని లక్ష్మీపురం వద్ద 2 మీటర్ల చొప్పున రెండు ప్రాంతాల్లో పూర్తిగా కోసుకుపోయింది. భారీగా వచ్చిన వరద సమీపంలోని లక్ష్మీపురం గ్రామాన్ని ముంచెత్తే సమయంలో ఈ రోడ్డు కోతకు గురైంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ►ఖమ్మం–కురవి మధ్య మోదుగుల గూడెం వద్ద జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. భారీ గోతులు ఏర్పడి వాహనాలు ముందుకు సాగడం కష్టంగా మారింది. ►బోధన్–బాసర మధ్య యాంచ గ్రా మం వద్ద జాతీయ రహదారి ఓ పక్క న భారీగా కోతకు గురైంది. నిజామా బాద్–బోధన్ మధ్య జానకంపేట వద్ద రెండుపక్కల జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ►మహదేవ్పూర్–కనకనూరు–కాటారం రోడ్డును గోదావరిలో కలిసే పెద్దవాగు వరద తీవ్రంగా దెబ్బతీసింది. పలిమెల వద్ద 15 మీటర్ల మేర, యామన్‌పల్లి– మహాముత్తారం వద్ద 90 మీటర్ల మేర రహదారి పూర్తిగా కోసుకుపోయింది. -
తెలంగాణ: అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి..
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు రోడ్లను తీవ్రంగా దెబ్బతీశాయి. మరోవైపు కొత్త రోడ్ల నిర్మాణం మినహా, కొంతకాలంగా పాతరోడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లు క్రమంగా ఛిద్రమవుతున్నాయి. ప్రతి ఏడాది వాటిని మరమ్మతులు చేయాల్సి ఉండగా, నిధుల సమస్యతో పెండింగులో పెడుతూ వస్తున్నారు. దీంతో వానాకాలం ప్రారంభంలో కురిసిన వానలతో రోడ్ల ధ్వంసం మొదలైంది. జూలైలో కురిసిన భారీ వర్షాలతో వందల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, ఇటీవల కురిసిన వర్షాలు మరింతగా దెబ్బతీశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,461 కి.మీ. మేర రోడ్డు ఉపరితలం దెబ్బతినగా, 15,721 మీటర్ల మేర రోడ్లకు గండ్లు పడ్డాయి. ఫలితంగా చాలాప్రాంతాల్లో వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎత్తు తక్కువ కాజ్ వేలున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకంగా మారింది. ఇలాంటి 60 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెలలో కూడా వానలు పడితే రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయేలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు రోడ్ల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సిరిసిల్ల–కరీంనగర్ రోడ్డు. ఇంత ప్రధానమైన రోడ్డు ఇలా తయారైంది. బలహీనపడ్డ తారుపూత వరదకు కొట్టుకుపోయి పెద్దగొయ్యి ఏర్పడింది. ఎందుకీ పరిస్థితి.. సాధారణంగా ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లను పూర్తిస్థాయిలో రెన్యూవల్ చేసేలా పీరియాడికల్ సైకిల్ ప్లాన్ ఉంటుంది. ఇందుకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏడెనిమిదేళ్లకు పెంచారు. దీనివల్ల ఐదేళ్ల తర్వాత రోడ్లు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆ సమయంలో పనుల్లో మరింత జాప్యం జరిగితే, తదుపరి వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో 28 వేల కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లున్నాయి. వీటిల్లో గత ఆరేళ్లలో 7,500 కి.మీ. మేర రోడ్లను విస్తరించారు. ఇవి మినహా మిగతావి అంత మెరుగ్గా లేవు. మిగతా రోడ్లలో, పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీ అయినవి 6 వేల కి.మీ.మేర ఉన్నాయి. వీటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రణాళిక ప్రకారం రెన్యూవల్ చేయాల్సిన రోడ్లు 12 వేల కి.మీ. మేర పెండింగులో ఉన్నాయి. వీటన్నింటికి మరమ్మతులు చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయి. ఇలాంటి రోడ్లే వానల్లో బాగా దెబ్బతింటున్నాయి. విస్తరించిన రోడ్లు, నిర్వహణ పూర్తయిన రోడ్లు పర్వాలేదు. వాగులు వంకలపై తక్కువ ఎత్తుతో ఉండే కాజ్‌వేలను తొలగించి వాటిస్థానంలో వంతెనలు నిర్మించాల్సి ఉంది. తెలంగాణ వచ్చాక ఇలాంటివి 600 వరకు మార్చారు. ఇంకా 700 వరకు మార్చాల్సి ఉంది. తాజా వానల్లో ఇలాంటివి బాగా దెబ్బతిని రాకపోకలను స్తంభింపచేశాయి. రూ.645 కోట్లు కావాలి.. బలహీనంగా ఉండి, భారీ వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని ఇప్పటికిప్పుడు మరమ్మతు చేయాలంటే రూ.645 కోట్లు అవసరమని రోడ్లు, భవనాల శాఖ గుర్తించింది. కానీ, ప్రస్తుతం అన్ని నిధులు అంద బాటులో లేకపోవటంతో వాటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుబాటులో ఉన్న రూ.60 కోట్లతో అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. -
తెలంగాణలో అధ్వాన్నంగా రోడ్ల దుస్ధితి
-
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు
ఎల్లారెడ్డిపేట : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వివిధ రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతును శుక్రవారం చేపట్టారు. ఎల్లారెడ్డిపేట– మర్రిమడ్ల ప్రధాన మార్గంలో ఐదుచోట్ల రోడ్డు తెగిపోగా మరమ్మతు కొనసాగిస్తున్నారు. జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఆర్అండ్బీ అ«ధికారులను అప్రమత్తం చేసి రోడ్డు మరమ్మతు చేపట్టారు. ఏఈ శ్రీనివాస్, నాయకులు బుర్క బాబ్జీ, రాధారపు శంకర్, నాగేల్లి ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.