Dance directors
-
ఆయన దయ వల్లే ఈ హోదా – జానీ మాస్టర్
‘‘ఈ రోజు మాకు (డ్యాన్స్ మాస్టర్స్) ఇంత పేరు, హోదా వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయే. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కూడా ఆయనే. యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నూతన అధ్యక్షుడు జానీ మాస్టర్ అన్నారు. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘నూతన కార్యవర్గం యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. జానీ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా యూనియన్ సొంత స్థలం, భవనం కోసం కృషి చేస్తా’’ అన్నారు జానీ మాస్టర్. ఈ కార్యక్రమంలో మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ పాల్గొన్నారు. -
ఐశ్వర్య అర్జున్ చిత్రానికి హాలీవుడ్ నృత్యదర్శకురాళ్లు
హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు యువ నటి ఐశ్వర్యఅర్జున్తో స్టెప్స్ వేయించారు. హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు పూనంషా, ప్రియాంకాషా హాలీవుడ్, బాలీవుడ్‌ల్లో బహుళ ప్రాచుర్యం పొందారు. వారినిప్పుడు నటి ఐశ్వర్యఅర్జున్ కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. యాక్షన్‌కింగ్ అర్జున్ వారసురాలు ఐశ్వర్యఅర్జున్ అన్న విషయం తెలిసిందే. ఇక అర్జున్‌లో మంచి దర్శక నిర్మాత కూడా ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన శ్రీరామ్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాదలిన్ పోన్ వీధియిల్ పేరుతో తెరకెక్కిస్తున్న ఇందులో తన కూతురు ఐశ్వర్య అర్జునే నాయకి. నవ నటుడు చందన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఓ పాటకు హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు పూనంషా, ప్రియాంకాషా కొరియోగ్రఫి అందించడం విశేషం. రంతాజోగి, తాళ్డాన్స్ తో పాటు భరతనాట్య ంలోనూ ప్రావీణ్యం పొ ందిన పూనంషా, ప్రియా ంకాషాలను ఈ చిత్రానికి నృ త్యదర్శకత్వం వహించాలన్న ఐశ్వర్య అర్జున్ కోరిక మేరకు వాళ్లను ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కే.విశ్వనాథ్, సుహాసిని, మొట్టై రాజేంద్రన్, మనోబాలా, సతీష్, బ్లాక్‌పాండి, బోండామణి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. జాస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హీరో అయిన మరో నృత్య దర్శకుడు
నృత్య దర్శకులు హీరోలుగా మారడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్, హరికుమార్ లాంటి నృత్య దర్శకులు కథా నాయకులుగా మారినవారే. ఇప్పడీ కోవలో తాజాగా మరో నృత్య దర్శకుడు చేరారు. ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం పోకిరి మన్నన్. శ్రీనిధి ఫిలింస్ పతాకంపై కన్నడ నిర్మాత రమేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్ఫూర్తి హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవమాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎటి ఇంద్రవర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో జరిగింది. నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు మారి ఆధ్వర్యంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, తొలి అప్రతిని నటుడు శాంతను అందుకున్నారు. ఈ సందర్భంగా ధాను మాట్లాడుతూ నృత్య దర్శకుడు ప్రభుదేవాలోని ప్రతిభను గుర్తించి దర్శకత్వం చెయ్యమని సలహా ఇచ్చానన్నారు. కొంతకాలం తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారన్నారు. అలాగే ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ కూడా హీరోగా రాణిస్తారనే నమ్మకం తనకుందన్నారు. విజయ్ నటించిన పోకిరి, రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఆ రెండు చిత్రాల పేరుతో రానున్న పోకిర మన్నన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత కర్ణాటక నుంచి వచ్చి తమిళంలో చిత్రం నిర్మించారని, ఆయనకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ధాను భరోసా ఇచ్చారు.