ఎలుగుబంటితో ఫైట్ చేశాడు
దండేపల్లి (ఆదిలాబాద్) : అడవికి వెళ్లి వస్తున్న గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అదే సమయంలో గిరిజనుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడంతో.. ఎలుగు పరారైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో సోమవారం జరిగింది.
గ్రామానికి చెందిన మల్లయ్య(41) వెదురు బద్దల కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన మల్లయ్య తన చేతిలో ఉన్న కత్తితో ఎలుగుపై తిరగబడటంతో.. అది తోకముడిచింది ఈ దాడిలో మల్లయ్యకు చేతికి, వీపుకు గాయాలయ్యాయి.