Dandumailaram
-
పరువు హత్య కలకలం
-
సినిమాలో క్రైమ్ నడుస్తుంది..
ప్రపంచ సినిమాలో రియల్ క్రైమ్ ఇన్సిడెంట్స్‌ని తీసుకుని, సీక్వెల్స్‌గా బిల్డ్ చేసి, పెద్ద హిట్స్ అందుకున్న సంస్థలు ఉన్నాయి. యూనివర్శల్, ఫాక్స్‌స్టార్ వంటివి. సినిమాలో క్రైమ్ కాకుండా క్రైమ్‌ని సినిమాగా చూపించడం అనే శ్రీనివాసరాజు ఎక్స్పరిమెంట్ మూడు సీక్వెల్స్‌తో క్లోజ్. ఇది భారత సినిమాలో ‘క్రైమ్ రాయి’. ఆడవాళ్లూ జాగ్రత్త... మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా? ఒక లేడీ తలుపు తట్టి, మంచినీళ్లు అడిగిందా? నీళ్లు ఇవ్వడానికి మీరు లోపలికి వెళితే ఘోరం జరుగుతుంది. మీ వెనకాలే ముందు ఆమె, ఆ తర్వాత ఆమె గ్యాంగ్ ఇంట్లోకి చొరబడతారు. ఇంటిని, మీ మానాన్ని దోచుకుంటారు. చివరికి మిమ్మల్ని కిరాతకంగా చంపేస్తారు. అందులో ఒకడు మరీ ఘోరమైనవాడు. పీక కోసి చంపుతాడు. పీకలోంచి రక్తం వస్తున్నప్పుడు వచ్చే శబ్దం అతనికి ఇష్టం. అక్కడ చెవి ఆన్చి, శబ్దం వింటూ ఆనందంలో మునిగిపోతాడు. ‘దండుపాళ్యం’ సినిమా గుర్తొస్తోంది కదూ! కర్నాటకలోని దండుపాళ్యకి చెందిన గ్యాంగ్ ‘దండుపాళ్య’. దోపిడీలు, హత్యలు, మానభంగాలు... ఇవే ఆ గ్యాంగ్ పని. ఈ గ్యాంగ్ పేరు వింటే అక్కడి వాళ్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2012లో దర్శకుడు శ్రీనివాసరాజు ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా తీసిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘ఇలాంటి మనుషులు ఉంటారా?’ అనుకోకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత ‘దండుపాళ్యం–2’ వచ్చింది. ఈ నెల ‘దండుపాళ్యం–3’ రాబోతోంది. ‘‘ఈ సిరీస్‌లో ఇదే లాస్ట్ పార్ట్. యాక్చువల్‌గా ఐదు పార్ట్స్ తీయాలనుకున్నాను కానీ, మూడింటితోనే ముగిస్తున్నా. రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా క్రైమ్ నేపథ్యంలో మూడు భాగాలుగా ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ ఇది’’ అన్నారు శ్రీనివాసరాజు. మూడో భాగాన్ని రజనీ తాళ్ళూరి నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ‘‘దండుపాళ్యం’ని 26 రోజుల్లో తీశాను. ఆడిందా? ఓకే! లేకపోతే? కష్టాలు తప్పవు. అందుకే రిలీజయ్యాక నా అసిస్టెంట్‌ని థియేటర్‌కి పంపించి, అసలు జనాలు ఉన్నారో లేదో చూడనమన్నాను. థియేటర్ నుంచి ఫోన్... హౌస్‌ఫుల్ అని. ఆ తర్వాత నేను థియేటర్‌కి వెళితే అక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తి ‘50 రూపాయల టికెట్ ఒక్కటే ఉంది. 150 సార్’ అన్నాడు. థియేటర్ మేనేజర్ నన్ను గుర్తుపట్టి, లోపలికి తీసుకెళ్లారు. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ పార్ట్ హిట్టవ్వడంతో సెకండ్ పార్ట్ మీద చాలా క్రేజ్ పెరిగింది. అది ఓకే అనిపించుకుంది. బోలెడన్ని అంచనాల మధ్య ఇప్పుడు థర్ట్ పార్ట్ రెడీ అయింది. ఇందులో ఏం ఉందో ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. డైరెక్టర్‌గా మంచి కథ చెప్పాలి కానీ, క్రైమ్ బేస్ట్ రియల్ స్టోరీని ఎందుకు తీసుకున్నారు? టికెట్స్ తెగడానికా? అసలు న్యూడ్ సీన్స్ చూపించాల్సిన అవసరం ఏంటి? అనడిగితే – ‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్. అల్లిన కథతో తీస్తారు. లేకపోతే రియల్ స్టోరీతో తీస్తారు. నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నా. రియల్ స్టోరీ తీస్తున్నప్పుడు రియల్‌గా జరిగినవి తీయాలి కదా’’ అన్నారు. ఏం చెప్పి పూజా గాంధీ, సంజనాలతో నగ్న దృశ్యాల్లో నటింపజేశారు? అనడిగితే – ‘‘కథ నచ్చినా న్యూడ్ సీన్స్ ఉన్నాయని పూజా గాంధీ ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి మరో నటి రమ్య ఆసక్తిగా ఉందని తెలిసి, పూజా వదలుకోకూడదనుకుంది. ‘మా అమ్మకు కథ చెబుతారా’ అనడిగింది. తల్లీకూతుళ్లిద్దరూ కథ విన్నారు. ‘ఈ సినిమా మిస్సయితే నటిగా నువ్వు చాలా కోల్పోయినట్లే’ అని తల్లి చెప్పడంతో పూజా గాంధీ ఈ సినిమా చేసింది. సెకండ్ పార్ట్‌లో సంజన కూడా సీన్ డిమాండ్ మేరకు చేసింది. ఆ సీన్స్ అలా తీయకపోతే సినిమా పండదు. రియల్‌గా జరిగినవే కాబట్టి, కాంప్రమైజ్ కాకూడదనుకున్నా. ఇలాంటి సీన్స్ తీసేటప్పుడు లొకేషన్లో తక్కువమంది ఉండేలా చూసుకుంటారు. కానీ, నేను మాత్రం యూనిట్ అంతా ఉంటారు. మీకిష్టమైతేనే చేయండి అని క్లారిటీగా చెప్పాను. వాళ్లూ చేసారు. ఈ సీన్స్ చేయాల్సిందేనని నేనెవర్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే ఇష్టపడి చేశారు’’ అని చెప్పారు. త్వరలో విడుదల కానున్న థర్డ్ పార్ట్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు –‘‘ఫస్ట్, సెకండ్ పార్ట్ కన్నా థర్డ్ పార్ట్ బీభత్సంగా ఉంటుంది. టికెట్స్ తెగుతాయనీ, కావాలనీ ఏ సీనూ పెట్టలేదు. జరిగిందే చూపించా. ఈ సిరీస్‌లో చివరి పార్ట్ ఇదే. ఆల్రెడీ రెండు పార్ట్స్ బాగా ఆడటంతో థర్ట్ పార్ట్‌కి చాలా క్రేజ్ వచ్చింది. ఈ పార్ట్‌తో నా ‘దండుపాళ్యం’ జర్నీ కంప్లీట్ అవుతుంది. అయితే, కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని జర్నీ ఇది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. ‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, సంజన, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట ప్రసాద్. -
అక్కడా ‘దండు’కున్నారా?
- దండుమైలారంలో ‘భూ మాయ’ వెనకా గోల్డ్‌స్టోన్ - రూ.15 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్ - 2011లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా దండుమైలారం శివారులోని హాఫీజ్‌పూర్‌లో రూ.15 కోట్ల విలువైన ‘భూ మాయ’వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. మియాపూర్ తరహాలో ఇక్కడ కూడా గోల్డ్‌స్టోన్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. సర్వే నంబరు 36లోని 50 ఎకరాల ప్రభుత్వ/అటవీ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గోల్డ్‌స్టోన్, విర్గో గ్లోబల్ ప్రతినిధులు పి.ఎస్.ప్రసాద్, పార్థసారథి, పీవీఎస్ శర్మ తదితరులు.. బంజారాహిల్స్‌కు చెందిన గద్వాల విజయలక్ష్మి, మరో ఇరువురి పేరిట గతేడాది (4486/2016 డాక్యుమెంట్) రిజిస్ట్రేషన్ చేశారు. నిజాం వారసులు, పైగా కుటుంబీకుల అస్తులకు సంబంధించిన (సీఎస్ 14/1958) భూ వివాదం కేసులో హైకోర్టు 2010 ఫిబ్రవరిలో తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందని గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ దస్తావేజులో పేర్కొన్నారు. కోర్టు డిక్రీ మేరకు తన పేరిట వివిధ ప్రాంతాల్లోని భూములను మ్యుటేషన్ చేయాలని ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, బాలానగర్ తహసీల్దార్లకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ(ఎల్సీ 1/356/2010) రాసినట్లు ఆయన 2011లో చేయించుకున్న రిజిస్ట్రేషన్ దస్తావేజులో పేర్కొన్నారు. ఇలా సంక్రమించిన భూమిలో 50 ఎకరాలను బంజారాహిల్స్‌కు చెందిన గద్వాల విజయలక్ష్మి, మరో ఇరువురికి విక్రయించినట్లుగా 2016 మే నెలలో సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. తహసీల్దార్లకు కలెక్టర్ రాసినట్లుగా చెబుతున్న లేఖ ప్రతులు, రెవెన్యూ పరమైన రికార్డ్ ఆఫ్ రైట్స్ పత్రాలను సమర్పించకపోయినా.. ఇబ్రహీంపట్నం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సలేహా ఖాదిర్ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. పైగా అవి సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములు కావడం గమనార్హం. ప్రభుత్వ భూములు హాంఫట్ హాఫీజ్‌పూర్ సర్వే నంబర్ 36/1లో 1,822 ఎకరాలు, 36/2లో 422 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. 1954–55 నుంచి సర్కారీ, అటవీ భూములుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. విజయవాడ హైవేకు దగ్గరగా ఈ భూములు ఉండటంతో ఎకరం రూ.30 లక్షల దాకా పలుకుతున్నాయి. మియాపూర్ భూము ల తరహాలోనే ఈ భూములను దక్కించుకునేందుకు గోల్డ్‌స్టోన్ టెక్నాలజీ లిమిటెడ్ యజమాని పి.ఎస్.ప్రసాద్ స్కెచ్ వేశాడు. నిజాం వారసులు, పైగా కుటుంబీకుల నుంచి గోల్డ్‌స్టోన్ సంస్థ పేరుతో జీపీఏ చేసుకొని దాని అనుబంధ సంస్థలను చేర్చారు. వాటిలో విర్గో గ్లోబల్ మీడియా, గ్రేటర్ గోల్కొండ ఎస్టేట్స్, సాయి పవన్ ఎస్టేట్స్, సాయి అనుపమ ఏజెన్సీ, సాయికీర్తి కన్స్ట్రక్షన్స్, జయశ్రీ ఏజెన్సీస్, కీర్తి అనురాగ్ ఇన్వెస్ట్మెంట్,, మ్యాట్రిక్స్ ఇన్సూలేటర్స్, జల్ ఇన్ఫ్రాస్టక్చర్, సబేరా కన్స్ట్రక్షన్, న్యూటెక్ స్టీవింగ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్, గ్లోమాస్క్ టెక్నాలజీస్, సత్యసాయి అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, గోల్కొండ ఎక్స్ట్రషన్స్, ఇండియా టెలికాం ఫైనాన్స్, సువిశాల్ పవర్ జనరేషన్, ఆర్జీఎల్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల తరపున స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు పార్థసారథి, ఇంద్రాణి ప్రసాద్, మహిత ప్రసాద్, సునీత ప్రసాద్ తదితరులు 50 ఎకరాల సర్కారు భూమిని, గద్వాల విజయలక్ష్మి, కంచర్ల నవజ్యోత్, జ్యోత్స్నలకు 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ ఈ భూములకు సంబంధించి 2015లో సమర్పించిన సేల్‌డీడ్‌కు పాస్ పుస్తకాలు లేవనే కారణంగా అప్పటి సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ సలేహా ఖాదిర్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016 మే 12న ఈ డాక్యుమెంట్‌ను ఆమె క్లియర్ చేసినట్లు తెలిసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతాలు బట్టబయలు చేస్తున్న క్రమంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. అక్రమ రిజిస్ట్రేషన్‌కు బాధ్యురాలైన సలేహాను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అవి సర్కారు, అటవీ భూములే హాఫీజ్పూర్లోని 36/1, 36/2 సర్వే నంబర్లలోని 1,822 ఎకరాలు, 22 ఎకరాల 29 గుంటల భూములు సర్కారు, అటవీ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. 22/ఏ గెజిట్ ప్రకారం ఈ భూములును రిజిస్ట్రేషన్ చేసేందుకు వీల్లేదు. – వెంకట్‌రెడ్డి తహసీల్దార్, ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ అక్రమమే గద్వాల విజయలక్ష్మి, నవజోత్, జ్యోత్స్న పేర్లపై 50 ఏకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. సంవత్సరం పాటు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెం ట్ను మే 2016లో క్లియర్ చేశారు. పార్థసారథి, ప్రసాద్‌లకు భూమిపై హక్కులున్నట్లుగా ఆధారాల్లేవు. – మధుబాబు, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్