డార్లింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి అనుకున్న తరుణంలో డార్లింగ్ సినిమా వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించగా నభా నటేష్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 19న విడుదలైంది.ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 13 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది చూసిన ప్రియదర్శి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డార్లింగ్ కథేంటంటే?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యను హనీమూన్కు పారిస్ తీసుకోవాలని కలలు కంటూనే పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయి(అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇంతలో ఆమె ప్రేమించినవాడితో పారిపోతుంది. తన పెళ్లి పెటాకులైందన్న బాధతో రాఘవ్ చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. తనతోనే ఇతడి పెళ్లి జరుగుతుంది. అసలు ఆనంది ఎవరు? అపరిచితురాలిగా ఒక్కో సమయంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఓటీటీలో డార్లింగ్ చూడాల్సిందే! Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024 చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్