dasari naraana rao
-
ఇదీ దాసరి చరిత్రకు శ్రీకారం – నట్టి కుమార్
‘‘సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి నారాయణరావు లాంటి పెద్దలు ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన సినీ ప్రయాణంతో ‘ఇదీ దాసరి చరిత్ర’ పేరుతో సినిమా తీస్తా. మే 4న దాసరిగారి జయంతిన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుకొచ్చి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. దాసరిగారు కూడా నిర్మాతల మండలిలోని సభ్యులకు మెడిక్లెయిమ్ పాలసీని వర్తింపజేశారు. అయితే కొందరు సినీ పెద్దలు వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి వచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సినీ రంగానికి దాసరిగారు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విగ్రహం పెట్టాలి.. అలాగే ఫిలింనగర్లో, ఆయన పుట్టిన పాలకొల్లులో దాసరిగారి పేరుతో పార్కులు నిర్మించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషిచేయాలి. ఏపీలో కూడా షూటింగ్‌లు జరగాల్సిన అవసరం ఉంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఇండస్ట్రీలోని అందర్నీ కలుపుకుని ముందుకువెళ్లాలి. గిల్డ్‌లోని కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల గురించి ఆలోచించరు. అందుకే త్వరలో జరిగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వారిని ఎన్నుకోకుండా జాగ్రత్తపడాలి’’ అన్నారు. -
తెలుగులో ఫస్ట్ మూవీ.. పది పేజీల డైలాగ్: సీనియర్ నటి
రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. -
దాసరి గుర్తుండిపోతారు
రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్ యండమూరి, నాగ రాజు, నవీన్‌తో పాటు వారి స్నేహితులు కలిసి అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో ‘దాసరి అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఇప్పటికీ ఆయనకి అభిమానులు ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన పేరిట అవార్డ్స్‌ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. అక్టోబర్ 25న దాసరి పద్మగారి జయంతి కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్ 26న కాకుండా 25న జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం, ప్రతియేటా మే 4న తన పుట్టినరోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమంటే దాసరిగారికి చాలా ఇష్టం. దీనిని∙ఆయన ఓ బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ తదితరులు ప్రతి యేటా నిర్వర్తిస్తామని మాటిచ్చారు’’ అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు (ఎన్ఆర్ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. -
దాసరి కోడలు, ఆమె తల్లి అదృశ్యం
బంజారాహిల్స్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కోడలు దాసరి సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మ కనిపించడం లేదని సుశీల సోదరి చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చి వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 9న దాసరి ప్రభు ఎవరికీ చెప్పకుండా జూబ్లీహిల్స్ రోడ్‌నెం–46లోని తన నివాసం నుంచి వెళ్లిపోవడంతో అతడి మామ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు రెండు వారాల పాటు గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే హఠాత్తుగా ఐదు రోజుల క్రితం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం అయ్యారు. తనను కొంతమంది కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లారని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు కేసు మూసేసి అతడిని ఇంటికి పంపించారు. ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రోజే పెద్ద భార్య సుశీల, సావిత్రమ్మను మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్లో దించినట్లు సుశీల సోదరి చిన్నమ్మ పూతలపట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాసబ్‌ట్యాంక్ నుంచి ప్రభు వెళ్లిపోయిన తరువాత తన సోదరి, తల్లి ఇంటికి రాలేదని వారి ఆచూకీ దొరకడం లేదని చెప్పడంతో అక్కడి పోలీసులు రెండు రోజులుగా హైదరాబాద్‌లో గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోనూ కేసు వివరాలపై ఆరా తీశారు. -
అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి
‘‘కళాకారులు చిరంజీవులు. ఎప్పటికీ బతికే ఉంటారు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఇంకా మన ముందే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4) సందర్భంగా దాసరి మెమోరియల్ అవార్డ్స్‌ను హైదరాబాద్‌లో కళాకారులకు బహూకరించారు. దాసరి ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంస్థల నేతృత్వంలో నిర్మాత రామసత్యనారాయణ, రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దాసరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆర్. నారాయణమూర్తికి అందజేశారు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. శ్రీదాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుకి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంపిక అయ్యారు. శ్రీ దాసరి నారాయణరావు అండ్ శ్రీ దాసరి పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్–జీవితలకు అందజేశారు. దాసరి టాలెంట్ అవార్డ్స్ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, శశికరణ్ తిక్క, వెంకటేష్ మహా, వేణు ఊడుగుల, బాబ్జీలను వరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ– ‘‘అన్ని రకాలుగా ప్రతిభ కనబరిచిన వ్యక్తి దాసరిగారు. కేంద్రమంత్రిగాను చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. దాసరిగారు ఇంకొంత కాలం బతికి ఉండాల్సింది. అవార్డుగ్రహీతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘దాసరిగారు వంద సినిమాలు తీసినప్పుడు ఆ వేడుకను ఎలా చేయాలి? అని నేను, మోహన్‌బాబు, మురళీమోహన్ చర్చించుకుంటున్నాం. అప్పుడు దర్శకులు కోడి రామకృష్ణగారు వచ్చి ఆ ఫంక్షన్‌ను తాను చేస్తానన్నారు. పాలకొల్లులో అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు దాసరిగారి పేరిట అవార్డులను ఇవ్వాలనే ఆలోచన చేసిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. దాసరిగారు నాలాంటి ఎందర్నో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పేద కళాకారులకు భరోసా దాసరిగారు. ఇప్పుడు వారసత్వ సినిమాలు వస్తున్నాయి. కొత్తవారికి, పేద కళాకారులకు ఎక్కువగా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వడమే దాసరిగారికి మనం ఇచ్చే అసలు నివాళి. ఆంధ్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా అంబికా కృష్ణగారిని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘దాసరిగారు వ్యక్తికాదు.. వ్యవస్థ. ఆయనలా ఎందరో దర్శకులు, హీరోలు, దర్శకులను పరిచయం చేసినట్లు ఏ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. ‘‘దాసరిగారు ఫాదర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన అందర్నీ సమానంగా చూసేవారు’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘ఇవి బెస్ట్ అవార్డ్స్‌గా నేను భావిస్తున్నాను’’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘‘దాసరిగారి యూనివర్సిటీలో నేనో చిన్న విద్యార్థిని. ఆయనతో కలిసి దాదాపు 40 సినిమాలు చేశాను’’ అని మురళీమోహన్ అన్నారు. ‘‘దాసరిగారి కుటుంబం చాలా పెద్దది. ఆయన అందరి గుండెల్లో బతికే ఉంటారు’’ అన్నారు ధవళ సత్యం. ‘‘గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం ’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘దాసరిగారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల వేడుకలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు రమణారావు. ‘‘నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉందో భవిష్యత్‌లో దాసరి మెమోరియల్ అవార్డ్స్‌కు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ‘‘దాసరిగారి రక్తంలోని ప్రతి కణంలో దర్శకత్వంపై ప్రేమ ఉంది’’ అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ‘‘దాసరిగారికి ఎవరూ సరిలేరు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్లతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
దర్శకరత్న విగ్రహావిష్కరణ
దర్శకుడిగా, రచయితగా, నటుడిగా దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే, పాలకొల్లు నుంచి సాదాసీదా వ్యక్తిగా మద్రాస్‌లో అడుగుపెట్టిన దాసరి సినిమా పరిశ్రమలో వేసిన విజయవంతమైన అడుగులు ఎన్నో. ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన దాసరి 2017లో మరణించారు. సినీ చరిత్రలో మరచిపోలేని ప్రముఖుల్లో ఒకరైన ఆయన విగ్రహావిష్కరణ ఈ నెల 26న జరగనుంది. దాసరి పుట్టిన ఊరు పాలకొల్లులో ఈ విగ్రహాన్ని ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్‌బాబు ఆవిష్కరిస్తారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి జరుగుతుంది. -
భవిష్యత్తు వైఎస్ జగన్‌దే
♦ ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు ♦ ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా ♦ ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు వెల్లడి ♦ దాసరితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తు జగన్‌దే’’ అని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దాసరి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం దాసరి మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్న జగన్‌కు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పారు. జగన్ సాయంత్రం 5.20 గంటలకు దాసరి నివాసానికి వెళ్లి 6 గంటల వరకూ ఉన్నారు. దాసరి తన ఇంటి గేటు వద్దనే జగన్‌కు ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పారు. దాసరి కుమారుడు, సోదరుడు.. జగన్‌తో కలసి ఫొటోలు తీయించుకున్నారు. జగన్, దాసరి నారాయణరావు దాదాపు నలైభె నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. భేటీ ముగిసిన తరువాత దాసరి నారాయణరావు బయటి వరకూ వచ్చి జగన్‌ను సాగనంపారు. -
దాసరి నారాయణతో వైఎస్ జగన్ భేటీ