మోహన్ బాబు, దాసరి నారాయణరావు
దర్శకుడిగా, రచయితగా, నటుడిగా దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే, పాలకొల్లు నుంచి సాదాసీదా వ్యక్తిగా మద్రాస్‌లో అడుగుపెట్టిన దాసరి సినిమా పరిశ్రమలో వేసిన విజయవంతమైన అడుగులు ఎన్నో. ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన దాసరి 2017లో మరణించారు. సినీ చరిత్రలో మరచిపోలేని ప్రముఖుల్లో ఒకరైన ఆయన విగ్రహావిష్కరణ ఈ నెల 26న జరగనుంది. దాసరి పుట్టిన ఊరు పాలకొల్లులో ఈ విగ్రహాన్ని ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్‌బాబు ఆవిష్కరిస్తారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment