dates announce
-
Five states Assembly elections 2023: ఫైనల్‌కు ముందు..అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామానికి ముందు సెమీస్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార కాషాయ దళానికి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి అగి్నపరీక్షగా మారాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తన అధికార పీఠాన్ని సుస్థిర పరుచుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రాలను దక్కించుకునేలా బీజేపీ ఇప్పటికే కదనరంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూనే మరో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ నమ్మకంగా ఉంటే.. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌ను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రెండు పార్టీల పట్టు నిలుపుకునేందుకు, మిజోరంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పోరాడుతుండటంతో ఈ ఎన్నికలకు రసవత్తరంగా ఉండనున్నాయి. పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో... త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పెద్దదైన మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 2018 ఎన్నికల్లో 114 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో సొంతపార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలతో కాషాయ కండువా కప్పుకోవడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది దీనిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ అక్కడ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడ్చుతోంది. వరుసగా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్ ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను బలంగా వాడుతున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, లోక్‌సభ ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలిపింది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డిసెంబర్ 2018 నుంచి మార్చి 2020 మినహా దాదాపు రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్తాన్ కీలకం రాజస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి ఎన్నికకాని చరిత్ర ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రత్యర్థి పార్టీకి అవకాశం కలి్పస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లే కీలకంగా ఉండటంతో వాటిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అదే సమయంలో, కాంగ్రెస్‌కు చెందిన సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య విరోధం నివురు గప్పిన నిప్పులా ఉంది. రాజస్తాన్‌లో కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న బీజేపీ అక్కడ ‘ఆప్నో రాజస్తాన్’పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాలుగుసార్లు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరుమార్లు పర్యటించారు. ఛత్తీస్‌గఢ్ ఎవరిదో? పదిహేనేళ్ల పాలన తర్వాత 2018లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకునే కృతనిశ్చయంతో ఉండగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 90 స్థానాలున్న రాష్ట్రంలో 68 సీట్లతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తేవొ చ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తోంది. రాష్ట్రంలోని కీలక రంగాల్లో జరిగిన అవినీతి తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మూడుసార్లు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఇటీవలి ఇండియా టుడే–సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 90 సీట్లలో 46 శాతం ఓట్లతో 51 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న అంచనాలు బీజేపీకి మింగుడుపడటం లేదు. తెలంగాణలో త్రిముఖం.. తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్, తెలంగాణ తెచి్చన బీఆర్ఎస్ల మధ్య ప్రధాని పోటీ ఉందనుకుంటున్న 119 సీట్లున్న తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీ సైతం పోటీలోకి వచి్చంది. త్రిముఖ పోటీ ఉండే అవకాశాలతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతుంటే, అతిపెద్ద పార్టీగా తామే అవతరిస్తామన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు, పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎన్నికల బరిలో నిలపనుంది. గడిచిన 15 రోజుల్లోనే రెండుసార్లు తెలంగాణలో మోదీ పర్యటించారు. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందిన మాదిరే ఇక్కడా 6 గ్యారెంటీ కార్డు హామీలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మిజోరంలో స్థానిక పార్టీలదే హవా క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరంలో స్థానిక పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) పార్టీలదే హవా నడుస్తోంది. 40 స్థానాలున్న మిజోరంలో ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం 28 సీట్లతో అధికారంలో ఉండగా, జెడ్పీఎం 9 సీట్లు, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క సీటు సాధించుకున్నాయి. రెండు పర్యాయాలకు ఒకమారు అధికారం మారే మిజోరంలో ఈ ఏడాది ఎంఎన్ఎఫ్దే విజయమని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ శరణార్థులే ప్రధాన అంశంగా ప్రస్తుత ఎన్నికలు జరుగనున్నాయి. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
NEET-2021: నీట్ పరీక్ష తేదీ ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను జులై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. The NEET (UG) 2021 will be held on 12th September 2021 across the country following COVID-19 protocols. The application process will begin from 5 pm tomorrow through the NTA website(s). — Dharmendra Pradhan (@dpradhanbjp) July 12, 2021 -
టోక్యో 2021 జూలై 23–ఆగస్టు 8
2020 జూలై 24 నుంచి 2021 జూలై 23కు... 364 రోజులు ఆలస్యంగా విశ్వ క్రీడా సంబరం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. కరోనా దెబ్బకు తల్లడిల్లిపోతున్న ప్రపంచం కోలుకొని మళ్లీ ఆటలపై మనసు పెట్టేందుకు ఈ సమయం సరిపోతుందని భావించిన నిర్వాహకులు దాదాపుగా అసలు షెడ్యూల్లో ఉన్న తేదీలనే మరుసటి ఏడాది కోసం కూడా ప్రకటించారు. ఒలింపిక్స్‌కు సంబంధించి అధికారికంగా వాయిదా, ఆపై మళ్లీ నిర్వహించే తేదీలపై కూడా స్పష్టత కూడా వచ్చేసింది. వచ్చే సంవత్సరం కోసం తమ ప్రణాళికలతో ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు సన్నద్ధం కావడమే ఇక మిగిలింది. అయితే ఈ వాయిదా పర్వం నిర్వహణ కమిటీకి భారీ స్థాయిలో ఆర్థికభారంగా మారనుండటమే ప్రతికూలాంశం. టోక్యో: వారం రోజుల క్రితం వరకు కూడా టోక్యో ఒలింపిక్స్ తేదీల్లో మార్పు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇప్పుడు ఆరు రోజుల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు ప్రకటించాల్సి వచ్చింది. గత మంగళవారం ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నామని చెప్పిన ఐఓసీ, ఈ సోమవారం పోటీలు నిర్వహించే తేదీలను కూడా ప్రకటించింది. 2021లో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు క్రీడలు జరుపుతామని టోక్యో 2020 చీఫ్ యోషిరో మొరీ వెల్లడించారు. వా యిదా పడక ముందు అసలు షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ఒకే ఒక రోజు తేడాతో ఉండటం విశేషం. పారాలింపిక్స్‌ను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తారు. సన్నద్ధతకు సమయం... నిర్వాహక కమిటీ సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఐఓసీతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ఒలింపిక్స్ నిర్వహణా సమయం అసలు తేదీల తరహాలోనే జపాన్ వేసవిలో ఉండాలని చాలాసార్లు చర్చ జరిగింది. దీనికి మేమంతా అంగీకరించాం. కరోనా వైరస్ తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు సన్నాహాలకు, క్వాలిఫయింగ్‌కు కొంత సమయం కావాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని యోషిరో వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తేదీల ప్రకారం చూస్తే అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఐఓసీ పేర్కొంది. ‘ప్రస్తుత విపత్కర స్థితి కారణంగా ప్రపంచం పరిస్థితి చీకట్లో మగ్గుతున్నట్లుగా ఉంది. అలాంటి సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్ వెలుగులు విరజిమ్మే కాంతిలాంటిది. వచ్చే ఏడాది ఈ ఒలింపిక్స్‌ను నిర్వహించడం ద్వారా వైరస్‌పై మానవజాతి సాధించిన విజయంగా మనం భావించాలి’ అని యోషిరో వ్యాఖ్యానించాడు. అక్షరాలా 6 బిలియన్ డాలర్లు అదనం! 2011లో జపాన్ మూడు రకాల ప్రకృతి విపత్తులకు గురైంది. భారీ భూకంపం, సునామీలతో పాటు ఫుకుషిమా ప్రాంతంలో పెద్ద ఎత్తున అణు విస్ఫోటనం జరిగింది. వాటిని తట్టుకొని తాము ముందుకు సాగుతున్నామని రుజువు చేసి చూపాలనే సంకల్పంతో ఒలింపిక్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్‌ను సంవత్సరంపాటు వాయిదా వేయడం వల్ల ఆర్థికపరంగా ఆ దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాదిలో జరగాల్సిన ఒలింపిక్స్ నిర్వహణ వ్యయం 12 బిలియన్ డాలర్లు (సుమారు. రూ. 90 వేల కోట్లు)గా ఉంది. ఒప్పందం ప్రకారం ఈ బడ్జెట్‌ను నిర్వాహక కమిటీ, జపాన్ ప్రభుత్వం, టోక్యో మహా నగరం కలిపి భరిస్తాయి. ఇందులో ఐఓసీ ఇస్తున్న 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 వేల కోట్లు), ప్రైవేట్ సంస్థల ద్వారా సేకరించిన 5.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 42 వేల కోట్లు) మినహా మిగిలినదంతా జపాన్ ప్రజాధనమే. అయితే ఏడాది ఆలస్యం ఏకంగా మరో 50 శాతం అదనపు మొత్తం మీద పడే పరిస్థితి వస్తోంది. అదనంగా మరో 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 45 వేల కోట్లు) కేటాయించాల్సి వస్తుందని జపాన్ ఆర్థికరంగ నిపుణుల అంచనా. సంవత్సరం పాటు కొత్తగా కట్టిన స్టేడియాల నిర్వహణ కూడా రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారనుంది. టోక్యో నగరం ముఖ్యంగా ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి భారీ ఆదాయాన్ని ఆశించింది. ఆటలు ముగిశాక వాటిని లగ్జరీ అపార్ట్మెంట్లుగా మార్చి అమ్మ కానికి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అనేక మంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అవన్నీ సందేహంలో పడతాయి. వాయిదా అంటే ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. మెగా ఈవెంట్ కోసం నిర్వాహకులు ఇప్పటికే 45 లక్షల టికెట్లు అమ్మారు. వీరికి డబ్బులు తిరిగి ఇస్తారా అనేది స్పష్టత లేదు. టోక్యోలో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ గడియారం. ఈ విశ్వ క్రీడల ప్రారంభానికి మరో 479 రోజులు ఉన్నాయి -
తెలంగాణ ఎంసెట్, టెట్ తేదీల ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్, టెట్ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఈనెల 15న ఎంసెట్, 22న టెట్లను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సోమవారం చర్చించిన అనంతరం.. మీడియా సమావేశంలో తేదీలను ప్రకటించారు. ఎంసెట్ రాసే అభ్యర్థులు ఈ నెల 12 నుంచి, టెట్ అభ్యర్థులు 13 నుంచి హాల్ టికెట్లను నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని కడియం శ్రీహరి సూచించారు. ఈ నెల 27న ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ నెలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం అవుతాయి. వాస్తవానికి ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 29న నిర్వహించగా, ఆ తర్వాత సోమవారమే.. అంటే మే 2వ తేదీనే తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. మే 1వ తేదీ ఆదివారం నాడు టెట్ నిర్వహిస్తామన్నారు. అయితే, జూనియర్ కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్సు దాడులు చేయిస్తుండటంతో.. దానిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల జేఏసీ భగ్గుమంది. టెట్, ఎంసెట్ నిర్వహణకు సహకరించేది లేదని, కళాశాలలు తెరవబోమని అల్టిమేటం ఇచ్చింది. దాంతో తప్పనిసరిగా ఈ రెండు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వ కళాశాలల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దానికి తగినట్లుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తాజా షెడ్యూలు ప్రకటించారు. ఇంతకుముందు ప్రైవేటు కళాశాలల్లో కూడా పలువురు విద్యార్థులకు సెంటర్లు ఉండటంతో, అవన్నీ మారుతాయి కాబట్టి ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా కొత్తగా మళ్లీ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇచ్చిన సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.