day and night
-
తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త పోస్టుమార్టం ప్రోటోకాల్ నిబంధనలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇకపై తెలంగాణలో డే అండ్ నైట్ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..) -
ప్రాక్టీస్ ప్రతిఫలం మనకే
కోహ్లి తప్ప అందరూ బరిలోకి దిగారు. ఒకరిద్దరు మినహా అంతా బాగా ఆడారు. డే–నైట్ టెస్టుకు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ ఈ డే–నైట్ వార్మప్ మ్యాచ్‌తో వచ్చేసింది. అంతకుమించి భారత్‌కు క్లారిటీ ఇచ్చిన మ్యాచ్ కూడా ఇదే! ఓపెనింగ్ నుంచి సీమర్ల దాకా తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయొచ్చో టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టతనిచ్చింది. ఇక ఈ పర్యటనలో మిగిలున్న ‘టెస్టు’లకు భారత్ సై అంటోంది. సిడ్నీ: ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్‌గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. ఈ మ్యాచ్ జట్టు కూర్పునకు దోహదం చేసింది. లయతప్పిన పంత్‌ను ఫామ్‌లోకి తెచ్చింది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్ గిల్ చక్కని ప్రత్యామ్నాయం అనిపించింది. విహారిని అక్కరకొచ్చే పార్ట్‌టైమ్ బౌలర్ (స్పిన్)గా, మిడిలార్డర్లో దీటైన బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. ఇక మ్యాచ్ పింక్‌బాల్ ప్రాక్టీస్ కూడా ‘డ్రా’ ఫలితాన్నే ఇచ్చింది. ఆఖరి రోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) పూర్తిగా బ్యాటింగ్ వికెట్‌గా మారింది. దీంతో భారత బౌలర్ల శ్రమంతా నీరుగారింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో బెన్ మెక్‌డెర్మట్ (107 నాటౌట్; 16 ఫోర్లు), జాక్ విల్డర్‌ముత్ (111 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకాలతో నిలబడ్డారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. ‘కంగారూ’ పెట్టిన ఆరంభం... భారత్ క్రితం రోజు స్కోరు వద్దే డిక్లేర్ చేసింది. దీంతో చివరి రోజు 473 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ను భారత్ పేసర్లు షమీ (2/58), సిరాజ్ (1/54) వణికించారు. ఓపెనర్లు హారిస్ (5), బర్న్స్ (1), వన్‌డౌన్‌లో మ్యాడిన్సన్ (14)లను భారత సీమ్ ద్వయం పడేసింది. అలా టాపార్డర్‌ను 25 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో మెక్‌డెర్మట్, కెప్టెన్ అలెక్స్ క్యారీ (111 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతోపాటే మ్యాచ్ సాగుతున్నకొద్దీ పిచ్ కూడా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైంది. ఎస్సీజీ సహజంగానే బ్యాటింగ్ పిచ్ కావడంతో భారత బౌలర్ల వ్యూహాలు పనిచేయలేదు. మెక్‌డెర్మట్, క్యారీ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించాక క్యారీని హనుమ విహారి బోల్తా కొట్టించాడు. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత మరో వికెట్‌నే చేజార్చుకోలేదు. విల్డర్‌ముత్ వన్డేను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. పిచ్ సానుకూలతల్ని సద్వినియోగం చేసుకున్న అతను భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇది సరే... కానీ! ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్ ఆఖరి రోజు అదరగొట్టారు. అజేయ సెంచరీలు సాధించారు. అయితే ఈ ఉత్సాహమేది ఆతిథ్య జట్టును ఊరడించలేదు. ఎందుకంటే గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఇదేమాత్రం కలిసొచ్చే అంశం కాదు. ప్రధానంగా ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్కషన్ అయ్యాడు. ఇతని స్థానంలో ఆడిన హారిస్ విఫలమయ్యాడు. జో బర్న్స్ అయితే నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఇపుడు ఓపెనర్ల సమస్య కాదు... ఓపెనర్లే కరువైన సమస్య వచ్చిపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194 ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108 భారత్ రెండో ఇన్నింగ్స్: 386/4 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) పృథ్వీ షా (బి) షమీ 5; బర్న్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 1; మ్యాడిన్సన్ (సి)సైనీ (బి) సిరాజ్ 14; మెక్‌డెర్మట్ (నాటౌట్) 107; క్యారీ (సి) సబ్–కార్తీక్ త్యాగి (బి) విహారి 58; విల్డర్‌ముత్ (నాటౌట్) 111 ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (75 ఓవర్లలో 4 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–25, 4–142. బౌలింగ్: షమీ 13–3–58–2, బుమ్రా 13–7–35–0, సిరాజ్ 17–3–54–1, సైనీ 16–0–87–0, హనుమ విహారి 7–1–14–1, మయాంక్ అగర్వాల్ 6–0–30–0, పృథ్వీ షా 3–0–26–0. మెక్‌డెర్మట్, విల్డర్‌ముత్ -
తెల్లవార్లూ మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్లు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయాలు రహస్యంగా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులను బూచీగా చూపిస్తున్నారు. రాత్రిళ్లు షాపులో బయట తాళాలు వేసినా షట్టర్‌కు చేసిన రంధ్రం ద్వారా తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు బాటిల్‌ను నిర్ణీత మొత్తం కంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లాలో 545 మద్యం షాపులు ఉండగా రెండు నెలల క్రితం లాటరీ పద్ధతిలో 521 షాపులకు కేటాయింపులు చేశారు. మరో 24 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై నుంచి కొత్త లైసెన్సులు అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవార్లూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో అప్సరా థియేటర్ వద్ద షాపులో ఉదయం 5 గంటల సమయంలో అమ్మకాలు సాగిస్తున్నందుకు ఏజీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరులో కూడా రెండు షాపులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చక్రం తిప్పుతున్న సిండికేట్లు మద్యం సిండికేట్లే మద్యం రేట్లు నిర్ణయిస్తున్నారు. మద్యం కంపెనీలు రేట్లు పెంచినందున లాభాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని మద్యం వ్యాపారులు గతంలో ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం విధానం ఇంకా ప్రకటించకుండానే వ్యాపారులు రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తుంటే.. ఆ రేట్లకు మించి ఒక్కో బాటిల్‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా రేటు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపులు మూసి వేయాలనే విధానంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండడంతో పాత షాపులనే కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ షాపులు.. ఎక్సైజ్ అధికారులు ఇటీవల జిల్లాలో నిర్వహించిన లాటరీలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువ షాపులను దక్కించుకున్నారు. అధికారులును ప్రలోభాలకు గురి చేసి షాపులకు ఎవరూ అడ్డు రాకుండా చేసుకోగలిగారు. కొన్ని చోట్ల 20 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికే తిరిగి షాపు దక్కేలా పావులు కదిపారు. ఎవరైనా ఆ షాపు కోసం దరఖాస్తు చేస్తే మొదటిలోనే అడ్డుకొని దరఖాస్తు చేసిన వారిపై దౌర్జన్యం చేసి భయపెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లాటరీ పద్ధతిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోలేకపోతున్న అధికారులు ప్రతి షాపులో ఎమ్మార్పీకే విక్రయాంచాలన్న నిబంధన అమలుపై ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు అందినప్పటికీ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడంతో వారి ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చర్యలు చేపడతాం మద్యం షాపుల అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. షాపుల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. జూ¯ŒS 30తో పాత షాపులు గడువు ముగుస్తుంది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్టు దృష్టికి వస్తే షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – బత్తుల అరుణరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ -
రేయింబవళ్లు ఏటీఎంల దగ్గరే..
-
డే అండ్నైట్గా యాషెస్ సిరీస్
సిడ్నీ: వచ్చే ఏడాది ఆసీస్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను డే అండ్ నైట్‌గా మార్చే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంగ్లండ్ బోర్డుతో మాట్లాడలేదని చెప్పారు. అలాగే తమ దేశంలో పర్యటించే పాక్, దక్షిణాఫ్రికా జట్లతో కూడా ఇదే విధంగా ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. -
భారత్, ఆసీస్ వన్డే మ్యాచ్‌ల వేళల్లో మార్పు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఈనెల 13 నుంచి జరిగే వన్డే సిరీస్ మ్యాచ్‌ల సమయాన్ని బీసీసీఐ మార్చిం ది. ఈ నిర్ణయంపై ఎలాంటి కారణం చెప్పకపోయినప్పటికీ రాత్రి వేళల్లో కురిసే మంచు నుంచి డే అండ్ నైట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకూడదనే ఓ గంట ముందుకు జరిపినట్టు సమాచారం. మంచు కారణంగా రాత్రి వేళల్లో బౌలర్లకు బంతిపై పట్టు దొరకడం కష్టమవుతుంది. దీంతో సవరించిన వేళల ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.00 వరకు తొలి ఇన్నింగ్స్ ... రాత్రి 9.15 వరకు రెండో ఇన్నింగ్స్ నిర్వహిస్తారని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. -
‘టెస్టు క్రికెట్ అనేది ఓ మహా వృక్షం’
లండన్: టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చని భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వన్డే, టి20 ఫార్మాట్ నుంచి సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు పలు సూచనలు చేశాడు. దీంట్లో భాగంగా పింక్ కలర్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులు ఆడించాలని చెప్పాడు. టి20, టెస్టులకు మధ్య ఫాస్ట్ ఫుడ్, రుచికరమైన భోజనానికి ఉన్న తేడా ఉందని అన్నాడు. 'టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఫలాలను ఆ కొమ్మలే మోస్తున్నాయి. అందరికీ ఫలాలు కనిపిస్తున్నా వాటిని మోస్తున్న చెట్టు సంగతి మరువరాదు. కొమ్మలకు కానీ ఫలాలకు కానీ ఇదే జీవన వనరు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టును నరికేస్తే ఇంకేమీ ఉండవు. అందుకే టెస్టులను మనం కాపాడుకోవాలి’ అని ద్రవిడ్ వివరించాడు.