న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఈనెల 13 నుంచి జరిగే వన్డే సిరీస్ మ్యాచ్‌ల సమయాన్ని బీసీసీఐ మార్చిం ది. ఈ నిర్ణయంపై ఎలాంటి కారణం చెప్పకపోయినప్పటికీ రాత్రి వేళల్లో కురిసే మంచు నుంచి డే అండ్ నైట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకూడదనే ఓ గంట ముందుకు జరిపినట్టు సమాచారం.
మంచు కారణంగా రాత్రి వేళల్లో బౌలర్లకు బంతిపై పట్టు దొరకడం కష్టమవుతుంది. దీంతో సవరించిన వేళల ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.00 వరకు తొలి ఇన్నింగ్స్ ... రాత్రి 9.15 వరకు రెండో ఇన్నింగ్స్ నిర్వహిస్తారని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.
భారత్, ఆసీస్ వన్డే మ్యాచ్‌ల వేళల్లో మార్పు
Published Mon, Oct 7 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement
Advertisement