కడప డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా
కడప : అనుకున్నట్లుగానే అయ్యింది. డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవటంతో ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. కాగా రేపు కోరం లేకున్నా చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి శనివారమిక్కడ తెలిపారు. మొత్తం 21మంది డైరెక్టర్లు ఉండగా వారిలో 11మంది డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ శిబిరంలో ఏడుగురు, వైఎస్ఆర్ సీపీ శిబిరంలో ఎనిమిదిమంది ఉన్నట్లు సమాచారం.
కాగా డీసీసీబీ చైర్మన్ ఐ.తిరుపేలురెడ్డి పదవి రద్దు కావడంతో వైస్ చైర్మన్ ఆంజనేయులు యాదవ్ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా అతని డైరెక్టర్ పదవిని రద్దు చేస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించిన విషయం తెలిసిందే.