dcp ar srinivas
-
ఆ సమయంలో పోసాని ఇంట్లో లేరు: డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
-
రేవ్ పార్టీ : ‘వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం’
సాక్షి, హైదరాబాద్ : తమ జోన్ పరిధిలో హుక్కాపై ఉక్కుపాదం మోపామని వెస్ట్ జోన్ డీసీపీ ఏర్ శ్రీనివాస్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 2019లో హుక్కా పూర్తిగా అరికట్టామని చెప్పారు. ఇటీవల తాము తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఈ నెల 12 తేదీన ది సీక్రెట్ ఎఫైర్ పబ్‌లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు వెళ్లి దాడులు చేశారు. కొందరు పరారయ్యారు. 21 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారించి బాదితులుగా పేర్కొని కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాం. సిగ్నోవా కంపెనీకి చెందిన వారే రేవ్ పార్టీ నిర్వయించడానికి ప్లాన్ చేశారు. వ్యాపారాలు పెంచుకోవడం, సిగ్నోవా కస్టమర్లను ఆనందపరచడం కోసమే ఈ రేవ్ పార్టీ జరిగింది. (చదవండి : జూబ్లీహిల్స్ రేవ్‌పార్టీలో కొత్త ట్విస్ట్) ఈ రేవ్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ మొని, బుర్రి ప్రసాద్ గౌడ్‌ను అరెస్ట్ చేశాం. ఎఫైర్ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. బేగంపేట్‌లోని లిస్బన్ పబ్‌పై కూడా చర్యలు తీసుకుంటాం. ఎఫైర్ పబ్‌పై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు లేక రాశాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. పబ్‌లో ఏం జరిగినా యజమానులే బాధ్యత వహించాలి, పబ్‌లలో బౌనర్లు వ్యవహరించే తీరుపై కూడా నిఘా ఉంది. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు. (చదవండి : పబ్‌లో అశ్లీల నృత్యాలు) -
పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అంటూ..
జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు మోసాల బాటపట్టాడు. మాయమాటలతో యువతీ యువకులకు టోపీ పెట్టాడు. తనకు ఎంతో పరపతి ఉందని, పరిటాల శ్రీరామ్ కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్టులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని యువకులకు...సినిమాల్లో వేషాలిప్పిస్తానని యువతులకు గాలం వేశాడు. వారి నుంచి రూ.కోట్లు దండుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ఖరీదైన అద్దెకార్లలో తిరుగుతూ.. సూటు బూటు వేసుకొని స్టార్ హోటళ్లలో బస చేస్తూ.. తాను పరపతి ఉన్న వాడినని ప్రముఖ సినీ, రాజకీయ, అధికారులతో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని పలువురు యువతులకు టోకరా వేసిన మాటల మాంత్రికుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం, రాచవారిపల్లి గ్రామానికి చెందిన కొండూరి రాజేష్ అలియాస్ కె.రమేష్‌బాబు, అలియాస్ విష్ణువర్ధన్‌రెడ్డి బికాం చదివి ఖాళీగా ఉండేవాడు. తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు సంపాదించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాసన్‌నగర్‌కు చెందిన కోగంటి నౌషిక అనే ఫ్యాషన్ డిజైనర్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న అతను తానో సినీ నిర్మాతనని, కొత్త సినిమా తీస్తున్నానని, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలని పరిచయం పెంచుకున్నాడు. తనకు అనంతపురంలో చాలా స్థలాలు ఉన్నాయని, పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్ట్లు ఉన్నట్లు నమ్మించాడు. బీహెచ్ఈఎల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె తన తమ్ముడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని రూ.4 లక్షలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా మరోసారి రూ.10.36 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించేందుకు మరింత ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె మరోసారి రూ.13.65 లక్షలు ఇచ్చింది. ఇలా ఆమె నుంచి 15 దఫాలుగా రూ.36.44 లక్షలు వసూలు చేశాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఈ నెల 3న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. వందల మందికి బురిడీ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతను గత మూడేళ్లుగా జల్సాల కోసం పలువురు యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు తేలింది. గతంలో ఇదే తరహా కేసులో మాదాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసినట్లు తేలింది. బంజారాహిల్స్‌లో ఆఫీసు నిందితుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–5లో హలో ‘భారత్ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఓ కార్యాలయం తెరిచి తాను సినిమా నిర్మాతనని, ప్రముఖ హీరోలతో దిగిన ఫొటోలు చూపుతూ హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని యువతులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బెంజ్ కార్లు..ప్రముఖులతో పార్టీలు మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజేష్ జల్సా జీవితం అనుభవించేవాడు. ఖరీదైన దుస్తులు వేసుకొని, అద్దెకు తీసుకున్న బెంజ్ కార్లలో తిరుగుతూ రూ. లక్షల విలువైన మొబైల్ ఫోన్లు వాడుతూ, స్టార్ హోటళ్లలో బస చేస్తూ, ప్రముఖులతో పార్టీల్లో మునిగి తేలేవాడని పోలీసులు తెలిపారు. అటు యువకులను ఉద్యోగాల పేరుతో, ఇటు యువతులను సినిమా వేషాలు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అతను ఇన్నాళ్లు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 14 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, చైతన్యపురి, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ కాని కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
93మందికి జైలు శిక్ష
సాక్షి, సిటీబ్యూరో: మద్యం బాబులపై పోలీసులు పంజా విసిరారు. నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జూన్ నెల తొలిరెండు వారాల్లో 515 మంది డ్రంకన్ డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన వీరిని సంబంధిత న్యాయస్థానాల్లో హజరుపరచగా 93 మందికి రెండు నుంచి పదిరోజుల పాటు జైలు శిక్ష పడింది. వీరితో పాటు ఇతరులకు న్యాయస్థానాలు జరిమానా విధించాయ’ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐఎస్ఐఎస్ ఏజెంట్ అరెస్ట్
* శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో * అదుపులోకి తీసుకున్న పోలీసులు * ఐఎస్ఐఎస్లో చేరేందుకు యువతకు గాలం! హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ లో యువతను చేర్పించేందుకు వారికి గాలం వేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ యువతిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్లో చేరేలా యువతను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన అఫ్షా జబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ (37) ఉసిగొల్పుతున్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లోని యువతను ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐఎస్లో చేర్పించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అబుదాబీలో ఆమె ఉన్నట్లు కనుక్కున్న అధికారులు.. దుబాయ్ నుంచి ఆమెను వ్యూహాత్మకంగా హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇక్కడకు రాగానే శంషాబాద్ విమానాశ్రయ పోలీ సులు నిక్కీని కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు ప్రయత్నించిన సల్మాన్ మొయినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిక్కీ జోసెఫ్‌తో ఫేస్బుక్లో పరిచయం ద్వారానే సల్మాన్ ఐఎస్ఐఎస్లో చేరేందుకు బయలుదేరాడని పోలీసులు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చిన్నతనంలోనే దుబాయ్‌కు వెళ్లి అక్కడే పాఠశాల చదువు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో కూడా చదువుకున్నట్లు పోలీసులకు తెలిసింది. -
'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు'
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. వినాయకచవితి, బక్రీద్ పండగల సందర్భంగా శంషాబాద్ డీసీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం డివిజన్ స్థాయి శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి, బక్రీద్ పండగలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గోవులను రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.