ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్ | Afsha Jabeen, Allegedly IS Recruiter, Arrested in Hyderabad | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్

Published Sat, Sep 12 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్

ఐఎస్‌ఐఎస్ ఏజెంట్ అరెస్ట్

* శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో
* అదుపులోకి తీసుకున్న పోలీసులు
* ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు యువతకు గాలం!
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ లో యువతను చేర్పించేందుకు వారికి గాలం వేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ యువతిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేలా యువతను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన అఫ్షా జబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ (37) ఉసిగొల్పుతున్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లోని యువతను ఫేస్‌బుక్ ద్వారా ఐఎస్‌ఐఎస్‌లో చేర్పించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అబుదాబీలో ఆమె ఉన్నట్లు కనుక్కున్న అధికారులు.. దుబాయ్ నుంచి ఆమెను వ్యూహాత్మకంగా హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇక్కడకు రాగానే శంషాబాద్ విమానాశ్రయ పోలీ సులు నిక్కీని కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన సల్మాన్ మొయినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నిక్కీ జోసెఫ్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ద్వారానే సల్మాన్ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు బయలుదేరాడని పోలీసులు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చిన్నతనంలోనే దుబాయ్‌కు వెళ్లి అక్కడే పాఠశాల చదువు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో కూడా చదువుకున్నట్లు పోలీసులకు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement