ట్రెజరీ డీడీగా రాజు
నల్లగొండ నుంచి పదోన్నతిపై జిల్లాకు
హన్మకొండ అర్బన్ : జిల్లా ట్రెజరీ డి ప్యూ టీ డైరెక్టర్‌గా జి.రాజును నియమిస్తూ ప్ర భుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. రాజు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పదోన్నతిపై జిల్లాకు డీడీ గా వస్తున్నారు. జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తు న్న సత్యనారాయణ పదోన్నతిపై నల్లగొండ జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. కాగా రాజు శనివారం విధుల్లో చేరనున్నారు.
ఎస్టీఓ రమేష్‌కు పదోన్నతి..
ప్రస్తుతం డీటీఓలో వైద్య విభాగం ఎస్టీఓగా పనిచేస్తున్న రమేష్ ఏటీఓగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.