death row convicts
-
మరణశిక్ష ఖైదీలకు కుటుంబాన్ని కలుసుకునే హక్కు
న్యూఢిల్లీ: మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వారి కుటుంబాన్ని, న్యాయవాదులను, మానసిక వైద్యుల్ని కలిసే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మరణ శిక్ష పడిన ఖైదీల హక్కుల్ని అన్ని దశల్లోనూ కాపాడాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సాధారణ ఖైదీలకు జైళ్లలో కల్పించే హక్కులనే మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వర్తింపచేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ మదన్ బి లాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. మరణశిక్ష పడ్డ ఖైదీలను ప్రత్యేక సెల్లోనూ, ఏకాంత చెరలోనూ ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జైళ్ల సంస్కరణలు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ద్వారా నియమితమైన రిటైర్డ్ జస్టిస్ అమితవరాయ్ కమిటీ ఈ సమస్యను కూడా పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది. మరణ శిక్ష పడిన ఖైదీపై కనీస మానవత్వాన్ని చూపాలని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, దీపక్ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. మరణ శిక్ష పడిన ఖైదీల హక్కులను ప్రతి దశలోనూ పరిరక్షించాల్సిన అవసరముందని కోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పు ప్రకారం దేశంలోని అన్ని జైళ్లల్లో ఉన్న నియమనిబంధనలకు ఈ మేరకు మార్చుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్లు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది. జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి పోతుండటం, దేశవ్యాప్తంగా జైళ్ల సంస్కరణలపై రిటైర్డ్ జస్టిస్ అమితవ రాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 25న నియమించిన సంగతి తెలిసిందే. -
సిగరెట్లతో కాల్చి, సూదులు గుచ్చి..
న్యూఢిల్లీ : దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో మూడొంతులమంది జీవన నేపథ్యం సామాజికంగా, ఆర్థికంగా, సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందినదేనని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ వెల్లడించింది. 80శాతానికి పైగా ఖైదీలు జైళ్లలో చిత్రహింసలకు గురవుతున్నారని రిపోర్టులో తెలిపింది. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ చేపట్టిన ఈ అధ్యయనంలో జైళ్లలో ఖైదీల జీవన పరిస్థితులను వివరించింది. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురవుతూ దారుణమైన అమానుష పరిస్థితుల్లో ఖైదీలు జీవిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. 270 మంది ఖైదీల్లో 260 ఖైదీలు అమానుషమైన మానసిక, శారీరక చిత్రహింసలకు గురవుతున్నామని తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. సిగరేట్లతో కాల్చడం, చేతివేళ్లలోకి సూదులు గుచ్చడం, బలవంతంగా యూరైన్ ను తాగించడం, తీగలు ద్వారా వేలాడుతీయడం, బలవంతపు నగ్నత్వం, తీవ్రంగా కొట్టడం వంటి దారుణమైన చిత్రహింసలకు ఖైదీలను గురిచేస్తున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ఖైదీల ఆర్థిక జీవన నేపథ్యం పరిశీలిస్తే, వారిలో 3/4 వంతు ఆర్థికంగా చాలా చితికిపోయిన వాళ్లని, కుటుంబాన్ని పోషించే సంపాదనలో వారే ప్రధాన పాత్ర పోషించేవారని తేలింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మత మైనార్టీలకు చెందినవారని పేర్కొంది. అదేవిధంగా మరణశిక్ష పడిన 12 మంది మహిళా ఖైదీలు కూడా ఈ వర్గానికి చెందినవారేనని రిపోర్టు నివేదించింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిరక్షరాస్యతకు సంబంధించినవై ఉంటే, వారి రక్షణ అత్యంత కీలకమని ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ నివేదించిన రిపోర్టుపై పానెల్ డిస్కషన్ సమయంలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి. లోకూర్ అన్నారు. ప్రజలు న్యాయ సహాయ న్యాయవాదులపై నమ్మకం కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాగాలేని 70.6శాతం మంది మరణ శిక్ష ఖైదీలూ ప్రైవేట్ లాయర్లనే ఆశ్రయిస్తున్నారని విచారణ వ్యక్తంచేశారు. మరణశిక్ష ఖైదీల జీవనం గురించి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి ఈ రిపోర్టు కూలంకషంగా విశ్లేషించింది. ఈ రిపోర్టుపై ఎలాంటి వాదన చేయాల్సినవసరం లేకుండా ఖైదీల కులం, మతం, ఆర్థిక పరిస్థితి, అక్షరాస్యత వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని తయారుచేశామని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ డైరెక్టర్ అనూప్ సురేంద్రనాథ్ తెలిపారు. ఈ రిపోర్టులో నివేదించిన ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరణ శిక్ష పడిన ఖైదీలు 385 మంది ఉన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్ లో అధికంగా 79 మంది మరణశిక్ష ఖైదీలున్నారు. -
‘నిర్భయ’ దోషులకు మరో కేసులో పదేళ్ల శిక్షa
న్యూఢిల్లీ: 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్(నిర్భయ కేసు) రేప్ దోషులు నలుగురికి మరో కేసులో ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్, పవన్‌గుప్తా, వినయ్ శర్మ అనే ఆ దోషులకు ఇప్పటికే గ్యాంగ్ రేప్, హత్య నేరాలకుగాను ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వారు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన 2012 డిసెంబర్ 16నే, ఆ దుశ్చర్యకు ముందు, రామ్ అధర్ అనే కార్పెంటర్‌ను బస్సులో ఎక్కించుకుని అతని వద్దనున్న మొబైల్ ఫోన్, రూ. 1500ను లాక్కొన్న కేసులో ఒక్కొక్కరికి పదేళ్ల శిక్ష, రూ. 1.01 లక్షల జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రితేశ్ సింగ్ బుధవారం తీర్పునిచ్చారు. దోషుల నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, వారిపై కనికరం చూపాల్సిన అవసరం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఈ నలుగురితో పాటు రామ్ సింగ్, మరో మైనర్ బాలుడు కలసి ఆధర్ను బస్‌లో తీవ్రంగా కొట్టి, డబ్బులను దోచుకున్నాక బస్సులో నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత ‘నిర్భయ’ను ఆమె స్నేహితుడిని బస్‌లో ఎక్కించుకుని, ఆ స్నేహితుడిని గాయపర్చి, ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు.