decai operation
-
‘ఆన్లైన్ ఆకతాయిల’ ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: ఆఫ్‌లైన్, ఆన్లైన్..ఎక్కడపడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాలలో మఫ్టీలో పోలీసులు గస్తీ కాస్తూ పోకిరీలను పట్టుకుంటున్న పోలీసులు ఆన్లైన్ ఆకతాయిలను కూడా అదే రీతిలో ఆటకట్టిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలలో మారు పేర్లతో ఖాతాలను తెరిచి..24/7 గస్తీ కాస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మహిళలు, పిల్లలను వేధిస్తున్న పోకిరీలకు అరదండాలు వేస్తున్నారు. ఇప్పటివరకు సైబరాబాద్ వర్చువల్ షీ టీమ్స్ 65 మంది పోకిరీలపై కేసులు నమోదు చేశాయి. నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాయి. ఎక్కువగా ఇన్‌స్ట్రాగామ్‌లో మహిళలను వేధిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 80 శాతం ఆన్లైన్ వేధింపులే.. గతంలో మహిళలపై వేధింపులలో 80 శాతం ఆఫ్‌లైన్‌లో, 20 శాతం ఆన్లైన్లో ఉండేవి. కానీ, ఇప్పుడవి రివర్స్ అయ్యాయి. ఆన్లైన్లో వేధింపులు 80 శాతానికి చేరాయి. సోషల్ మీడియాలో ఎవరూ పట్టుకుంటారులే అనే ధీమాతో పోకిరీలు కూడా డిజిటల్లోకి మారి.. ఆన్లైన్ వేదికగా మహిళలు, పిల్లలను వేధిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆఫ్‌లైన్‌లో 11, ఆన్లైన్లో 12 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ఇద్దరేసి పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయా అధికారులు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూప్స్, డేటింగ్ యాప్‌లపై 24/7 గంటలు నిఘా పెడుతుంటారు. నింతరం సామాజిక మాధ్యమాలలో ఖాతాలను నిర్వహిస్తూ.. మహిళలు, అమ్మాయిలు, పిల్లలను టార్గెట్ చేసుకొని పోస్ట్‌లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే ఆకతాయిల భరతం పడుతుంటారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..) -
వ్యాపారుల గుండెల్లో గు'బిల్లు'
వీకెండ్స్‌లో కుటుంబంతో... అప్పుడప్పుడూ మిత్రులతో సరదాగా... ఇంకా అతిథులు వచ్చినపుడు అందరితోనూ... హోటల్‌కెళ్లి విలాసంగా నచ్చిన ఆహారం తినేసి వారడిగినంత మొత్తాన్ని చెల్లించేసి... అదనంగా సర్వర్‌కు టిప్పు ఇచ్చేసి దర్జాగా వచ్చేస్తుంటాం. అక్కడితో మన పని అయిపోయింది. కానీ అలా ఎడా పెడా బిల్లులు వసూలు చేసే హోటల్ నిర్వాహకులు మనకు ఇచ్చే బిల్లుల మేరకు పన్ను చెల్లిస్తున్నారో లేదో చూడం. అందుకే వాటిపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పడింది. డెకాయ్ ఆపరేషన్ పేరుతో తనిఖీలు చేపడుతోంది. పన్ను ఎగ్గొట్టేవారి భరతం పడుతోంది. విజయనగరం ఫోర్ట్: పన్ను ఎగ్గొట్టే వాణిజ్య సంస్థలపై సంబంధిత పన్నుల శాఖ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. డెకాయ్ ఆపరేషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇవి ఎక్కువగా హోటళ్లపైనే చేపడుతున్నారు. వినియోగదారులకు బిల్లులు ఇవ్వకుండా పన్ను ఎగవేస్తున్నారన్న ఫిర్యాదులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటితో పాటు మిగిలిన మరికొన్ని వ్యాపారాలపైనా సంబంధిత అధికారులు డెకాయ్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. బిల్లులు ఇవ్వని హోటళ్లు విజయనగరం డివిజన్లో జీఎస్టీ రిజిస్ట్రర్డ్ హోటళ్లు 121 ఉన్నా యి. వీటి నిర్వాహకులు హోటళ్లకు వచ్చే వినియోగదారులకు బి ల్లులు ఇవ్వరు. చిన్న కాగితంపై వారు చెల్లించాల్సిన మొత్తాలను బేరర్‌తో పంపిస్తారు. వాటిని చూసే వినియోగదారులు టిప్పుతో సహా మారు మాట్లాడకుండా చెల్లించేసి... నోట్లో కాసిన్ని పంచదార పూతతో ఉన్న సోపు గింజల్ని వేసుకుని వచ్చేస్తున్నారు. ఇలా హోటల్ వ్యాపారులు అనధికార బిల్లుల ద్వారా పన్ను నుంచి బయటపడుతున్నారు. అందుకే హోటళ్లపైనే ఎక్కువగా దృష్టి సారించిన అధికారులు డెకాయ్ ఆపరేషన్లు చేపట్టి ఇప్పటివరకూ 91 కేసులు నమోదు చేశారు. ఇందులో 56 కేసులకు సంబంధించి రూ. 6,90,000 అపరాధ రుసుం వసూలు చేశారు. మిగతా వ్యాపారులపైనా నిఘా... విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డివిజన్ పరిధిలో కాశీబుగ్గ, నరసన్నపేట, రాజాం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు, విజ యనగరం దక్షిణ, విజయనగరం పశ్చిమ సర్కిల్స్ ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో 14,503 డీలర్లు, కేంద్ర పరిధిలో 5,195 డీలర్లు ఉన్నారు. కాశీబుగ్గ సర్కిల్లో రాష్ట్ర పరిధిలో 1756, కేంద్ర పరిధి లో 501 మంది డీలర్లు, నరసన్నపేట సర్కిల్లో రాష్ట్ర పరిధిలో 1399 మంది, కేంద్ర పరిధిలో 466 మంది ఉన్నారు. రాజాంలో రాష్ట్ర పరిధిలో 2,173, కేంద్ర పరిధిలో 696 మంది, శ్రీకాకుళం సర్కిల్లో రాష్ట్రపరిధిలో 2,567మంది, కేంద్ర పరిధిలో 922 మం ది ఉన్నారు. విజయనగరం తూర్పు సర్కిల్లో రాష్ట్ర పరిధిలో 1619 మది, కేంద్ర పరిధిలో 624 మంది, విజయనగరం దక్షణ సర్కిల్లో రాష్ట్ర పరిధిలో 1548 మంది, కేంద్ర పరిధిలో 654 మంది ఉన్నా రు. విజయనగరం పశ్చి మ సర్కిల్లో రాష్ట్ర పరిధిలో 1621 మంది, కేంద్ర పరిధిలో 671 మంది డీలర్లు ఉన్నారు. వీరందరిపైనా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 329 ఆపరేషన్ల ద్వారా రూ.43.91 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. హోటళ్లపైనే ఎక్కువ ఫిర్యాదులు హోటల్ నిర్వాహకులు బిల్లులు ఇవ్వడం లేదంటూ ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అందుకే డెకాయ్ ఆపరేషన్లు హోటల్స్‌పై ఎక్కువగా చేస్తున్నాం. ప్రతీ హోటల్ నిర్వాహకుడు, వ్యాపారి బిల్లులు ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు ఈ ఆపరేషన్లు చేస్తూనే ఉంటాం.-ఎన్.శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ ఏపీ ట్యాక్స్(జీఎస్టీ) -
వీరింతే!
విజయనగరం జిల్లాలో 2011లో వెయ్యి మంది పురుషులకు.. 981 మంది స్త్రీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 957కి తగ్గింది. మరికొంత కాలం ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఆ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. జిల్లాలో లింగనిర్ధారణ చట్టం ఎంత శ్రద్ధగా అమలు చేస్తున్నారో ఈ గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసినా చాలా ప్రైవేటు క్లినిక్‌లు పట్టించుకోవడం లేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ‘డెకాయ్ ఆపరేషన్లు’ పూర్తి స్థాయిలో జరగడం లేదు. లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోతున్నారు. 2013-14కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 49 డెకాయ్ ఆపరేషన్లు చేయాలని నిర్దేశించింది. అయితే అధికారులు 24 ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఇంకా 25 ఆపరేషన్లు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నెల రోజుల్లో 25 డెకాయ్ ఆపరేషన్లు చేయడం కష్టమే. డెకాయ్ ఆపరేషన్‌లో అధికారులు తమకు తెలిసిన గర్భిణిని స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. ఆమెతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు అక్కడే చాటుగా ఉంటారు. స్కానింగ్ సెంటర్లోకి వెళ్లిన గర్భిణి తనకు లింగ నిర్ధారణ వెల్లడించాలని, అందుకు ఫీజు చెల్లిస్తానని చెబుతుంది. అప్పుడు అధికారులు నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. దీన్నే డెకాయ్ ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్‌లో ఏ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడైనా పట్టుబడితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తారు. లింగ నిర్ధారణ వెల్లడిని అడ్డుకోవడం ద్వారా తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను అరికట్టాలన్నది డెకాయ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. కాని అది పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఆడపిల్లలను చెత్తకుండీల్లోనూ, ఆస్పత్రుల్లోనూ వదిలేయడం, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.