18న ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 18వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఐదు రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తిరుపతి ఎమ్యెల్యే వెంకటరమణ మృతికి సంతాపం తెలియజేస్తారు. 18న ఏపీ కేపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.