Decency
-
హెడ్మాస్టర్లలా ఉండాలనుకోవడం లేదు: బిర్లా
శ్రీనగర్: పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే సమయంలో సభా గౌరవాన్ని కాపాడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. హద్దు మీరిన సభ్యులను స్కూల్ హెడ్మాస్టర్ల మాదిరిగా శిక్షించాలని తాము (ఉభయ సభల అధ్యక్షులు) అనుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్లో ఆటంకాలు, గందరగోళ పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై పార్టీలు కలిసి కూర్చుని చర్చించాలన్నారు. సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి, ప్లకార్డులు ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి, ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలన్నారు. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సమయంలో నిత్యం సభలో గందరగోళం కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ పార్లమెంట్ ఒక దిక్సూచిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. సభలో అంతరాయాలు, అదుపుతప్పిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచివికావు. మనం(ఎంపీలు) అందరం పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి, ఇంకా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించాలి’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సభ్యులను కట్టడి చేసేందుకు నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన...ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినమైనవే. పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావిస్తే సభాధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు. -
మీరు మర్యాద రామన్నేనా?
సంఘ ప్రవర్తనతోనే సరైన గౌరవం సినిమా హాలుకు వెళతాం. సినిమా మొదలవుతుండగానే కాళ్లు ఎత్తి ముందు సీటు మీద పెడతాం. ఆ సీట్లో ఉన్నవాళ్లు చిరాగ్గా వెనక్కు తిరిగి ఏదో ఒక మాట అంటారు. అదా మనం కోరుకునే మర్యాద? ఇంటర్వ్యూకు వెళతాం. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మర్యాద కోసం షేక్ హ్యాండ్‌కు చేయి చాపుతాడు. మనం ఆత్మవిశ్వాసం లేని బిక్క చచ్చినట్టుండే చేతిని అతని చేతిలో పడేస్తాం. లేదా చెమటతో నిండిన చేతిని అతడి చేతిలో పెట్టి మన చెమటని అతనికి పూస్తాం. అతడు ఇబ్బందిగా మనవైపు చూస్తాడు. అదా మనం కోరుకునే మర్యాద? వ్యక్తిగత ప్రవర్తన వేరు. మనం ఒక్కళ్లమే ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు. కాని నలుగురిలో ఉన్నప్పుడు ‘సంఘ ప్రవర్తన’ అవసరం. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్’ అంటారు. ఈ ప్రవర్తన లేకపోతే నలుగురిలో మనం అమర్యాదకు లోనవుతాం. నలుగురి దృష్టిలో మనం పలుచన అవుతాం. నలుగురు మనల్ని మర్యాద తెలియనివారనుకుంటారు. ఇటీవలి ఉదంతం బ్యాంకింగ్ రంగంలో భారతదేశంలో నంబర్ వన్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలనే తన సిబ్బందికి ‘సరిగ్గా వ్యవహరించండి’ అని తాకీదు పంపింది. ‘మీలో ప్రతి ఒక్కరూ ఎస్బీఐకి అంబాసిడరే. మీ ప్రవర్తన, ప్రదర్శన ఎలా ఉంటుందనే దాని మీదే బ్యాంకు గౌరవం ఆధారపడి ఉంటుంది’ అని అది చెప్పింది. బ్యాంక్ అంటే నిత్యం కస్టమర్లు వచ్చిపోయే చోటు. అది పబ్లిక్ ప్లేస్. అక్కడ నలుగురు మెచ్చే విధంగానే ఉండాలి అని ఈ తాకీదు అర్థం. బ్యాంక్ చేసిన సూచనల ప్రకారం– ► సీనియర్ సిబ్బంది చక్కటి మర్యాదకరమైన బట్టలే అంటే ఫార్మల్సే ధరించాలి. ► జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్ షూస్ వంటివి వర్క్‌ప్లేస్‌లో ధరించరాదు. ► స్త్రీలు కూడా భారతీయ లేదా వెస్ట్రర్న్ ఫార్మల్స్నే ధరించాలి. ► సరిగా దువ్వుకున్న తలకట్టు ఉండాలి. క్లీన్ షేవ్ చేసుకోవాలి. ► చెప్పులు, షూస్ శుభ్రంగా, పాలిష్‌తో ఉండాలి. ► చెక్ షర్ట్స్ మీద ప్లెయిన్ కలర్ టైలు, ప్లెయిన్ షర్ట్స్ మీద చెక్స్ టైలు ధరించాలి ► కస్టమర్స్‌తో సరిగా మాట్లాడాలి. వారితో మీటింగ్‌లో ఉన్నప్పుడు తేన్చడం, చీదడం వంటి పనులు చేయకూడదు. ఇలా ఎస్.బి.ఐ. తన సిబ్బందికి చాలా సూచనలే చేసింది. కాని ఇవి ఆ సిబ్బందికి మాత్రమే కాదు ఏ సిబ్బందికైనా వర్తిస్తాయని వాటిని చదివితే మనకు అర్థమవుతుంది. మనకు అన్నీ తెలియాలని రూల్ లేదు. కాని తెలిశాక అలా ప్రవర్తించడం మంచిది. మనిషి ఎదుగుదలలో సంఘ ప్రవర్తన ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానిని పాటించడమే నేటి మర్యాద. నాగరికత. పర్సనల్ ఎటికేట్ వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. శరీరం నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. నోటి నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడాలి. మురికి పట్టిన, నలిగిన బట్టలు ధరించకపోవడం మేలు. చేతి, కాలి గోళ్లు శుభ్రంగా తీసుకుని ఉండాలి. ముక్కును చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి. దట్టమైన మేకప్‌లు ఎబ్బెట్టుగా ఉంటాయి. జుట్టు దువ్వుకోవాలి. చుండ్రు లేకుండా చూసుకోవాలి. పెర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్లు కాని ఎదుటివారికి ఆహ్లాదం కలిగించే స్థాయిలో ఉండాలి తప్ప ఘాటుతో ఉండి పక్కకు తప్పుకునేలా ఉండరాదు. సోషల్ ఎటికేట్ నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటివారిని పలకరించాలి. కళ్లల్లో చూసి మాట్లాడాలి. మంచి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇంట్లో ఉన్నవాళ్లతో కూడా మర్యాదగా ప్రవర్తించాలి. బయటకు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులతో లేదా భార్యతో వెళ్లొస్తాను అని చెప్పాలి. బయటి నుంచి తిరిగి వచ్చాక సరిగ్గా పలకరించాలి. నలుగురి మధ్య తల దువ్వుకోవడం, బజారున నడుస్తూ వెళుతున్నప్పుడు ఏదైనా తింటూ వెళ్లడం చేయరాదు. అందరి మధ్య ఊయడం, స్మోక్ చేయడం కూడా మర్యాద కాదు. చూయింగ్ గమ్ నములుతూ కూడా మాట్లాడకూడదు. డైనింగ్ ఎటికేట్ నలుగురితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరితో పాటు మొదలెట్టడం ఆనవాయితీ. ప్లేట్లు, పదార్థాలు శబ్దం వచ్చేలా లాగకూడదు. డైనింగ్ టేబుల్ మీద మోచేలు పెట్టి కూర్చోరాదు. మీ పక్కన ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం చేయండి. పెద్దగా చప్పుడు చేస్తూ నమలడం కాని తాగడం కాని చేయరాదు. మూతిని నేప్కిన్తో అద్దుకోవాలి. తుడుచుకోరాదు. టెలిఫోన్ ఎటికేట్ అనవసరమైన వేళలో ఫోన్ చేయకూడదు, ముఖ్యమైన విషయం ఉంటే తప్ప. మీరు కాల్ చేస్తే మొదట మీ పేరు చెప్పండి. ఎదుటి వ్యక్తి కాల్ చేస్తే వారు పెట్టేవరకు సంభాషణ కొనసాగించాలి. మీరు మధ్యలో ఫోన్ పెట్టేయకూడదు. ఎదుటివారు చెప్పేది వినాలి. ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా ఉన్న మరో వ్యక్తితో మాట్లాడకూడదు. అవతలి వ్యక్తికి తెలియకుండా స్పీకర్ ఆన్ చేయడం అమర్యాద. -
మీరు ఇతరులపై ఆధారపడతారా?
సెల్ఫ్‌చెక్ ‘‘అమ్మో ఒంటరిగా వెళ్లాలంటే నాకు భయం! ప్లీజ్... తోడు రాకూడదూ!’’ అని ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్లే సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? మొహమాటంతోనో, బిడియంతోనో ఒంటరిగా ఏ పనీ చేయలేక ఇతరులపై ఆధారపడుతున్నారా? ఆధారపడే మనస్తత్వం మీలో ఎంత? 1. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఎవరో ఒకర్ని తీసుకెళ్తారు. ఎ. అవును బి. కాదు 2. ఎంతమంది మధ్య ఉన్నా వారిలో మీకు పరిచితులు ఒక్కరూ లేకుంటే అసౌకర్యంగా ఫీలవుతారు. ఎ. అవును బి. కాదు 3. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆప్తుల సలహా తీసుకోనిదే నిర్ణయం తీసుకోరు. ఎ. అవును బి. కాదు 4. ఒక అంశం మీద వాగ్వివాదం జరుగుతున్నప్పుడు అందులో మీ తప్పు లేకపోయినప్పటికీ మీకు సపోర్ట్ చేసేవాళ్లు లేకపోతే మౌనంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని పలకరించడానికి జంకుతారు. ఎ. అవును బి. కాదు 6. షాపింగ్‌కి వెళ్లినప్పుడు మీకు రెండు, మూడు డ్రెస్‌లు నచ్చుతాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తేల్చుకోలేక మీఫ్రెండ్ చెప్పిన డ్రెస్‌నే కొంటారు. ఎ. అవును బి. కాదు 7. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, కొత్తపని చేయాలన్నా జంకుతారు. ఎ. అవును బి. కాదు 8. ఫంక్షన్స్‌లో అతిథులతో కలివిడిగా ఉండరు. ఎ. అవును బి. కాదు 9. బయటకి వెళ్లినప్పుడు కంటికి ఇంపుగా ఏదైనా కనిపించి తేవాలనిపించినా, ఇంట్లోవాళ్లని సంప్రదించనిదే తీసుకోలేరు. ఎ. అవును బి. కాదు 10. ఏటిఎమ్‌లో డబ్బు డ్రా చెయ్యవలసినప్పుడు జీవితభాగస్వామిని సంప్రదించనిదే డ్రా చేయరు. ఎ. అవును బి. కాదు ‘ఏ’లు ఏడు దాటితే... మీరు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటారు. మీకంటూ భావాలున్నా వాటిని పక్కన పెట్టి, పక్కవాళ్ల మీదే నిరంతరం ఆధారపడుతుంటారు. ఇలా ప్రతిదానికీ ఇతరుల పై ఆధారపడటం వల్ల జీవితంలో మీరు కనీస ప్రత్యేకతను కూడా కోల్పోతారు. ఈ ధోరణిని మీరు ఎంత త్వరగా మార్చుకుంటే అంత బెటర్. ‘బి’ లు ఏడు దాటితే మీకు నచ్చిన రీతిలో మీరుంటారు. ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పక్కవారి మీద పెద్దగా ఆధారపడరు. మీ సొంత భావాలకు విలువనిచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంటారు. అంతే కాకుండా మీ ప్రెజెన్స్‌ని ఇతరులు కోరుకునేలా ఉంటారు. -
సిగ్గు, బిడియంతో....
యూరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 51 సంవత్సరాలు. నాకు ముగ్గురు పిల్లలు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు మూత్ర విసర్జనపై నియంత్రణ లేకుండా పోతోంది. బంధువుల ఇంటికి, లేదా సినిమాలకి వెళ్లినపుడు నాకు తెలియకుండానే చుక్కలు చుక్కలుగా మూత్రం వచ్చేసి, సీట్లు తడిసిపోయి, పరువు పోతున్నట్టు అనిపిస్తోంది. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం పడడం, బయటికి వెళ్లాలంటేనే భయమేసే స్థాయిలో నన్ను ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఆఫీసులో అన్నిసార్లు బాత్రూంకి వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. - ఒక సోదరి, కరీంనగర్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ అనే సమస్యతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. అంటే... మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమందిలో కాన్పులు కష్టమైన వారికి, స్థూలకాయంతో గానీ, హార్మోన్స్ సమస్యలు లేదా ప్రోస్టేట్‌తో బాధపడుతున్న వారికి, మరికొంతమందిలో మెనోపాజ్ (ఋతుక్రమం) ఆగిపోయిన తర్వాత తలెత్తుతుంది. అలాగే మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా వస్తుంది. ఇలాంటి కారణాలతో దాదాపు చాలామంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ అందులో పదిశాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మీకున్నట్టుగానే చాలామంది సిగ్గుపడుతుండడం వల్ల ఆ బాధను తమలోనే నొక్కిపెట్టుకుంటుంటారు. సమస్య తీవ్రమైనప్పుడు ఇలా బయటికి చెప్పుకుంటారు. ఇది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. మీరు అధిక పని ఒత్తిడికి లోనై ఉండడం వలన ఈ సమస్య ఉత్పన్నమై ఉండవచ్చు. లేదా యూరినరీ బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ చోటుచేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య మిమ్మల్ని బాధపెడుతుండవచ్చు. ఇది అంత పెద్ద సమస్య కాకపోయినప్పటికీ ఇటు మానసికంగానూ అటు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ముందుగా మీరు యూరాలజిస్ట్‌ని కలవండి. ఆయన మీకు కొన్ని పరీక్షలు నిర్వహించి మీ సమస్యకు అసలు కారణాన్ని గుర్తిస్తారు. అలాగే మంచి చికిత్సను అందించే అవకాశం ఉంది. వైద్యుడి సలహాలు కచ్చితంగా పాటించండి. రెండు రోజుల్లో ఉపశమనం లభించిందని మందులు మానేయకండి. కోర్స్ పూర్తి చేయండి. లేదంటే మళ్లీ సమస్య తిరగబడే అవకాశముంది. ఒక్కోసారి పెల్విస్‌కు ముప్పు ఏర్పడి, దాని చుట్టూ ఉండే అనుబంధ కండరాలకు మూత్రం వల్ల ఏర్పడిన తడితో చర్మ సంబంధిత అలెర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీ వరకు దారితీయవచ్చు. కాబట్టి వెంటనే మీరు మీ బిడియాన్ని పక్కనపెట్టి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దీనికి చక్కటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది. -
బిడియపడే సందేహం... తీర్చుకునే మార్గం!
అడగటానికి బిడియపడే ప్రశ్నలెన్నో వుంటాయి. అలాంటి వాటికోసం నిపుణుల దగ్గరకు వెళ్లి సందేహాలు తీర్చుకోవాలన్నా ఒకింత బిడియం ఉంటుంది. మీకు ఆ అవస్థ తప్పించడం కోసమే ఈ వేదిక. నా వయుసు 36. నా భార్య వయుస్సు 27. పెళ్లరుున ఏడాదికి బాబు పుట్టాడు. కొద్దికాలం పిల్లలు వద్దనుకొని ఐదేళ్లపాటు కండోమ్ వాడాము. ఈవుధ్య మరో బిడ్డ కోసం కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అరుుతే నాకు వెంటనే వీర్యం పడిపోతోంది. నా భార్య ఇంకా సెక్స్ కావాలంటోంది. శీఘ్రస్ఖలనం వల్ల ఆమెను సంతృప్తిపరచలేకపోతున్నాను. నాకు సలహా ఇవ్వండి. - ఓ సోదరుడు, నిజామాబాద్ మీరు శీఘ్రస్ఖలనం (ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్) సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత సెక్స్ చేయడం అన్నది ఒక యూంత్రికమైన చర్యగా మారవచ్చు. అప్పుడీ సవుస్య రావడం చాలా సాధారణం. మీరు ఈ వయుస్సులో మీ శారీరక ఆరోగ్యం, దారుఢ్యం (ఫిజికల్ ఫిట్నెస్) కాపాడుకోవడం అవసరం. దాంతోపాటు బీపీ, షుగర్ వంటి సవుస్యలు లేకుండా చూసుకోవడంతో పాటు సామాజికంగా మీపై పడే ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం. ఇవన్నీ చేస్తూ మీ భార్య పట్లప్రేవూనురాగాలను పెంచుకొని సెక్స్‌లో పాల్గొనండి. దాంతో మీ పెర్ఫార్మెన్స్తో పాటు సెక్స్‌లో పాల్గొనే వ్యవధి తప్పక పెరుగుతుంది. ఈ జాగ్రత్తలతోనూ మీ పరిస్థితిలో వూర్పు రాకపోతే ఒకసారి ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే మీకు సరైన వుందులు సూచిస్తారు. నా వయస్సు 65 ఏళ్లు. సెక్స్ తర్వాత నాకు చాలా తక్కువ వీర్యం వస్తోంది. చాలామంది డాక్టర్లను కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు. నా వీర్యం పరిమాణం పెరిగేందుకు మందులు తెలియజేయండి. - ఎన్.ఎస్.పి.ఆర్., ఖమ్మం వయసు అరవై దాటాక వీర్యం తక్కువగా రావడం అనేది పెద్ద సమస్య కానే కాదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీర్యం ప్రధానంగా సంతానోత్పత్తికి మాత్రమే దోహదం చేస్తుంది. సెక్స్‌లో సంతృప్తికి వీర్యం పరిమాణం ఎంత అన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. ఈ వయస్సులో హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల వీర్యం పరిమాణం తగ్గవచ్చు. మీరు సెక్స్‌లో నార్మల్‌గా సంతృప్తి పొందుతూ ఉంటే వీర్యం పరిమాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నాకు నెల రోజుల క్రితమే సిజేరియన్ ద్వారా ప్రసవం అయ్యింది. మావారు కోరికలను అణచుకోలేక సెక్స్ కోసం నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రవసం అయిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. సిజేరియన్ అయినందున ఆర్నెల్లలోపు సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు నిజమేనా? - ఓ సోదరి, విజయవాడ సిజేరియన్ ద్వారా ప్రసవం తర్వాత ఆ కుట్లు మానడానికీ, యోని కండరాలు మళ్లీ మామూలు దశకు రావడానికి కనీసం ఆరు వారాల వ్యవధి (అంటే నెలన్నర) పడుతుంది. ఈ ఆరువారాల తర్వాత యోని వద్ద ఎలాంటి నొప్పిగానీ లేదా రక్తప్రావం గానీ మరే సమస్యా లేకుండా ఉండి, మీరు కూడా శారీరకంగా, మానసికంగా సెక్స్‌కు సిద్ధంగా ఉంటే మీవారి కోరికను నిర్భయంగా మన్నించవచ్చు. అంతేగానీ... సిజేరియన్ అయినందున ఆర్నెల్ల పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలన్నది కేవలం అపోహ మాత్రమే. నా వయుస్సు 20 ఏళ్లు. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు చాలా సార్లు చేసేవాణ్ణి. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల చాలా త్వరగా వీర్యం పడిపోతోంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. నా వృషణాలు కిందికీ పైకీ జారుతూ, కదులుతూ ఉన్నారుు. ఇలా జారకుండా ఉండటానికి వూర్గం చెప్పండి. హస్తప్రయోగం వల్ల హైట్ పెరగదా? నేను పెళ్లయ్యాక నా భార్యను సుఖపెట్టగలనా? - శ్రీనివాస్, కోదాడ మీరు ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల మీరు ఈ ప్రక్రియను చాలా యాంత్రికంగా చేస్తుండవచ్చు. దాంతో మొదట్లో ఉన్న ఎక్సరుుట్మెంట్, థ్రిల్ కాస్త తగ్గి ఇలా త్వరగా వీర్యస్ఖలనం అరుుపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగా మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సరుుట్మెంట్ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. పురుషాంగం సైజ్‌కూ తృప్తికీ ఎలాంటి సంబంధం లేదు. మీకున్న అనుమానమే చాలావుందిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్నది సర్వసాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లెక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. హస్తప్రయోగానికీ ఎత్తుపెరగకపోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. నాకు 55 సంవత్సరాలు. ఏడాది క్రితం ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యిందని టీయూఆర్‌పీ ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? - కె. నాగేశ్వరరావు, గుంటూరు టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో సాధారణంగా చేసే ఆపరేషన్. ఈ సర్జరీకి అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్న స్తంభనలే సర్జరీ తర్వాత కూడా ఉంటాయి. కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఇతరత్రా శారీరక దారుఢ్యం (ఫిజికల్ ఫిట్నెస్) లేకపోవడం వల్లనో మీకు స్తంభనలు తగ్గి ఉండవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోడానికి అవకాశం ఉంది. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్