మీరు ఇతరులపై ఆధారపడతారా?
సెల్ఫ్‌చెక్
‘‘అమ్మో ఒంటరిగా వెళ్లాలంటే నాకు భయం! ప్లీజ్... తోడు రాకూడదూ!’’ అని ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్లే సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? మొహమాటంతోనో, బిడియంతోనో ఒంటరిగా ఏ పనీ చేయలేక ఇతరులపై ఆధారపడుతున్నారా? ఆధారపడే మనస్తత్వం మీలో ఎంత?
1. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఎవరో ఒకర్ని తీసుకెళ్తారు.
ఎ. అవును బి. కాదు
2. ఎంతమంది మధ్య ఉన్నా వారిలో మీకు పరిచితులు ఒక్కరూ లేకుంటే అసౌకర్యంగా ఫీలవుతారు.
ఎ. అవును బి. కాదు
3. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆప్తుల సలహా తీసుకోనిదే నిర్ణయం తీసుకోరు.
ఎ. అవును బి. కాదు
4. ఒక అంశం మీద వాగ్వివాదం జరుగుతున్నప్పుడు అందులో మీ తప్పు లేకపోయినప్పటికీ మీకు సపోర్ట్ చేసేవాళ్లు లేకపోతే మౌనంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
5. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని పలకరించడానికి జంకుతారు.
ఎ. అవును బి. కాదు
6. షాపింగ్‌కి వెళ్లినప్పుడు మీకు రెండు, మూడు డ్రెస్‌లు నచ్చుతాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తేల్చుకోలేక మీఫ్రెండ్ చెప్పిన డ్రెస్‌నే కొంటారు.
ఎ. అవును బి. కాదు
7. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, కొత్తపని చేయాలన్నా జంకుతారు.
ఎ. అవును బి. కాదు
8. ఫంక్షన్స్‌లో అతిథులతో కలివిడిగా ఉండరు.
ఎ. అవును బి. కాదు
9. బయటకి వెళ్లినప్పుడు కంటికి ఇంపుగా ఏదైనా కనిపించి తేవాలనిపించినా, ఇంట్లోవాళ్లని సంప్రదించనిదే తీసుకోలేరు.
ఎ. అవును బి. కాదు
10. ఏటిఎమ్‌లో డబ్బు డ్రా చెయ్యవలసినప్పుడు జీవితభాగస్వామిని సంప్రదించనిదే డ్రా చేయరు.
ఎ. అవును బి. కాదు
‘ఏ’లు ఏడు దాటితే... మీరు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటారు. మీకంటూ భావాలున్నా వాటిని పక్కన పెట్టి, పక్కవాళ్ల మీదే నిరంతరం ఆధారపడుతుంటారు. ఇలా ప్రతిదానికీ ఇతరుల పై ఆధారపడటం వల్ల జీవితంలో మీరు కనీస ప్రత్యేకతను కూడా కోల్పోతారు. ఈ ధోరణిని మీరు ఎంత త్వరగా మార్చుకుంటే అంత బెటర్. ‘బి’ లు ఏడు దాటితే మీకు నచ్చిన రీతిలో మీరుంటారు. ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పక్కవారి మీద పెద్దగా ఆధారపడరు. మీ సొంత భావాలకు విలువనిచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంటారు. అంతే కాకుండా మీ ప్రెజెన్స్‌ని ఇతరులు కోరుకునేలా ఉంటారు.