జాతీయ రహదారిపై మూడు ఫ్లైఓవర్లు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై జిల్లాలో మూడు చోట్ల ఫ్లైఓవర్లు (వంతెనలు) నిర్మించేందుకు హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కైకరం, తేతలి, పెరవలి గ్రామాలను ప్రమాదాల జోన్లుగా (బ్లాక్ స్పాట్) గుర్తించారు. దీనిపై అధికారులు ఆయా ప్రాంతాల్లో సర్వే చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటీకే జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణ కోసం సోలార్ వింకర్లును ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏలూరు కాలువ గట్టు వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు కసరుత్తు చేస్తున్నారు. ఇప్పటికే తణుకు నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా బ్లాక్స్పాట్గా గుర్తించిన మూడు గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం.