క్రమశిక్షణతో చదవాలి
అనంతగిరి (కోదాడరూరల్) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుతూ అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని సాఫ్ట్‌స్కిల్ ట్రై నర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు ద్యాసపు మురళీధర్ సూచించారు. శనివారం మండల పరిధిలోని అనంతగిరి శివారులో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో పర్సనాల్టీ డెవలప్మెంట్పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుండే ఆంగ్లభాషపై పట్టుసాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ.శివప్రసాద్, టెక్విప్ కోఆర్డినేటర్ వైవీఆర్.నాగపవన్, డి.పాండురంగరావు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.