విషమంగా మల్లిఖార్జునరెడ్డి ఆరోగ్యం
కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఆయన బంధువు దుర్గాయపల్లి మల్లికార్జునరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్ దీక్షకు మద్దతుగా ఆయన 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
దీక్ష విరమించాలని వైద్యులు చెప్పినా ఆయన ఖాతరు చేయడంలేదు. జగన్ దీక్ష ముగిసే వరకూ తాను దీక్ష విరమించబోనని మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు.