decomposed body
-
తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఒక ఇంట్లో ఉంటూ..
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది. జైదీప్ దేవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్ పైనుంచి పడి యువకుడు మృతి -
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగి ఉంటుంది.. లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. -
కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు..
మిర్జాపూర్ : శవం పక్కన కొద్దిసేపు ఉండడానికే భయపడతారు చాలా మంది. కానీ చనిపోయిన వ్యక్తి శవం పక్కన నెల రోజుల పాటు ఉండాల్సి వస్తే ? అది కూడా సొంత కూతురి శవమైతే? ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ. కానీ ఓ దంపతులు తమ కూతురి శవాన్ని ఇంట్లో పెట్టుకొని నెల రోజుల పాటు ఉన్నారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీకి చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి, అతని భార్య మిర్జాపూర్‌లోని హయత్‌నగర్‌లో ఏరియాలో ‘దిలావర్ సిద్దిఖీ’ హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి ఓ కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా ఆ ఇంటి నుంచి ఏదో దుర్వాసన వస్తోంది. ఆ దుర్వాసన రోజురోజుకి ఎక్కువవుతుండడంతో భరించలేక చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హయత్‌నగర్ చేరుకొని రిటైర్డ్ పోలీసు అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన ఒక శవం లభించింది. ఆ శవాన్ని రిటైర్డ్ పోలీసు అధికారి కూతురిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆ దంపతులను విచారించగా.. తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడం లేదని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారు. వారి సమాధానాలపై అనుమానం వచ్చి ఈ విషయంపై చుట్టుపక్కలవారిని ప్రశ్నించగా..ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉండవచ్చని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. -
అమెరికా నుంచి వచ్చిన టెకీకి ఊహించని షాక్
ముంబై: తల్లిని చూడాలని ఆతృతగా అమెరికా నుంచి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. డోర్ తీసి ఇంట్లోకి వెళ్లగా కుళ్లి పోయిన తల్లి శవం దర్శనమిచ్చింది. ఈ హృదయ విచారక ఘటన ముంబైలోని అంధేరీలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. భర్త మరణించడంతో ఆశాసహానీ(63) అనే వృద్ధురాలు అంధేరీలోని లోఖంద్వాల కాంప్లెక్స్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఎకైక కుమారుడు రితురాజ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం తల్లిని చూసేందుకు రితురాజ్ అమెరికా నుంచి ముంబైకి వచ్చాడు. ఎంత సేపు ఇంటి బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దీంతో రితురాజ్ కీ మేకర్ సాయంతో తలుపు తీయించి ఇంట్లోకి వెళ్లగా కుళ్లి పోయిన తల్లి శవం కనిపించింది. ఒక్కసారి షాక్ గురైన రితురాజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
తండ్రి మృతదేహం పక్కన 5 రోజులు కూర్చుని...
మదురై: చనిపోయిన తండ్రి మృతదేహం పక్కన ఆయన కుమారుడు ఐదు రోజులపాటు అలాగే కూర్చున్న ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మదురైలోని జీవనగర్‌లో అరుల్ రాజ్(73) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు 40 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలో వృద్ధుడైన అరుల్ రాజ్ గత వారం చనిపోయాడు. ప్రతిరోజు నీళ్లు పట్టేందుకు వచ్చే అరుల్ రాజ్ ఐదు రోజులుగా కనిపించకపోవడంతో పాటు ఆ ఇంటి నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో జీవనగర్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా ఎవరూ డోర్ తెరవకపోవడంతో తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లి చూసిన పోలీసులు షాక్ తిన్నారు. కుళ్లిపోతున్న వృద్ధుడి మృతదేహం పక్కన అతడి కుమారుడు ఉండటం చూసి అతడే హత్య చేసి ఉంటాడని భావించారు. అతని ప్రవర్తనను గమనించిన పోలీసులు, స్థానికులను వాకబు చేసి అరుల్ కుమారుడికి మానసికస్థితి బాగాలేదని తెలుసుకున్నారు. తండ్రి అరుల్ రాజ్ చనిపోయాడని గుర్తించలేని ఆయన కుమారుడు గత ఐదు రోజులుగా మృతదేహం వద్ద కూర్చుని ఉన్నాడు. ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కనీసం నీళ్లు కూడా తాగకపోవడంతో డీహైడ్రేషన్‌కి లోనయ్యాడని పోలీసులు చెప్పారు. ఆ వృద్ధుడు కనిపించకుండాపోయిన ఏప్రిల్25వ తేదీనే చనిపోయి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బ్రిట్టోను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.