అమెరికా నుంచి వచ్చిన టెకీకి ఊహించని షాక్
అమెరికా నుంచి వచ్చిన టెకీకి ఊహించని షాక్
Published Mon, Aug 7 2017 11:13 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
ముంబై: తల్లిని చూడాలని ఆతృతగా అమెరికా నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. డోర్ తీసి ఇంట్లోకి వెళ్లగా కుళ్లి పోయిన తల్లి శవం దర్శనమిచ్చింది. ఈ హృదయ విచారక ఘటన ముంబైలోని అంధేరీలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. భర్త మరణించడంతో ఆశాసహానీ(63) అనే వృద్ధురాలు అంధేరీలోని లోఖంద్వాల కాంప్లెక్స్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఎకైక కుమారుడు రితురాజ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం తల్లిని చూసేందుకు రితురాజ్ అమెరికా నుంచి ముంబైకి వచ్చాడు. ఎంత సేపు ఇంటి బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దీంతో రితురాజ్ కీ మేకర్ సాయంతో తలుపు తీయించి ఇంట్లోకి వెళ్లగా కుళ్లి పోయిన తల్లి శవం కనిపించింది. ఒక్కసారి షాక్ గురైన రితురాజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement