DEEN
-
నాందేడ్ ఘటన: ఆసుపత్రి టాయిలెట్స్ క్లీన్ చేసిన డీన్‌పై కేసు నమోదు
ముంబై: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాల ఘటన దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నాందేడ్ శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉండటంతో మరింత వివాదం రాజుకుంది. తాజాగా ఈ వ్యవహారంలో ఆసుపత్రి డీన్‌పై పోలీసు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆసుపత్రి డీన్ డాక్టర్ ఎస్ వాకోడ్‌తోపాటు మరో వైద్యుడిపై నేరపూరితమైన హత్య కేసు నమోదైంది. మృతిచెందిన నవజాత శిశువు బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాందేడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. శిశువు మృతికి డీన్, చైల్డ్ స్పెషలిస్ట్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోవడంతో, బయట నుంచి కొనుక్కొచ్చినా.. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించలేదని ఆరోపించారు. సాయం కోసం డీన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు. వారిని దూరంగా వెళ్లగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వార్త: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 31 మంది మృతి Shiv Sena MP Hemant Patil on Tuesday made the acting dean of the government hospital in Nanded, where 31 patients have died in 48 hours, clean a dirty toilet and urinals, a video of which has gone viral. अगर ये सब करने से बच्चो की जान वापिस आ जायेगी तो हम सब ये करने को तैयार है… pic.twitter.com/ykQOJGYasb — Dr Manoj Chaudhary (@MK_Chaudhary04) October 3, 2023 కాగా తనతో ఆసుపత్రి టాయిలెట్స్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీపై డీన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం వెలుగుచూడటం గమనార్హం. నాందేడ్ శివసేన(షిండే వర్గం) ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం శంకర్రావు చావన్‌ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితని సమీక్షించారు. అక్కడి టాయ్‌లెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఆసుపత్రిలో మరుగుదొడ్ల దుస్థితిని చూసి బాధగా ఉందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇక్కడ పరిస్థితిని చూసి బాధేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లోని టాయిలెట్స్‌కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఎంపీ హేమంత్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి డీన్ ఆర్ఎస్ వాకోడ్తో టాయిలెట్ క్లీన్ చేయించారు. ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ హేమంత్ పాటిల్‌పై ఆసుపత్రి డీన్ వాకోడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీయడం వంటి సెక్షన్ల కింద ఎంపీ హేమంత్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు. #WATCH : MP Makes Dean Clean Toilet of a Hospital Where 31 children Died In 48 Hours.#Nanded #NandedHospital #NandedHospitalDeaths #India #latestnews #latest #LatestUpdate #BREAKING #Maharashtra #MaharashtraNews #MaharashtraHospitalHorror pic.twitter.com/NGE2VMj2TZ — upuknews (@upuknews1) October 3, 2023 -
ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్ రణదీప్ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్ సర్జన్ (కార్డియో వ్యాస్కులర్ స్పెషలిస్ట్) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు. -
ఏకోపాధ్యాయ పాఠశాలగా సాహిత్య పీఠం
రెండేళ్ల నుంచీ నిధుల కొరత డీన్‌గా ఎండ్లూరి సుధాకర్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు సాహిత్యపీఠం ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయింది. నేను ఒక్కడినే పూర్తిస్థాయి అధ్యాపకుడిని, మరో నలుగురు సందర్శకాచార్యులు (విజిటింగ్ప్రొఫెసర్లు’) ఉన్నారు’ అని ఇటీవలే డీన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పీఠానికి ఉన్న ఘనమైన చరిత్ర, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్టీఆర్ మానస పుత్రిక దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రికైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్లో ఆవిర్భవించింది. ఎన్టీఆర్ ఆశీస్సులతో నాటి విద్యామంత్రి ఎర్నేని సీతాదేవి పూనుకోవడంతో 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. బోధన, పరిశోధనలే ప్రధాన అంశాలుగా 48 ఎకరాల్లో సాహిత్యపీఠం నెలకొంది. ఆచార్య బాలాంత్రపు రజనీకాంత రావు, కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆర్వీఎస్ సుందరం తదితర మహనీయుల సారథ్యంలో నడిచింది. విద్యార్థుల ప్రగతికి బాటలు ఇప్పటివరకు సుమారు 513 మంది విద్యార్థులు తెలుగులో ఎంఏ పట్టా అందుకున్నారు. 390 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. సుమారు 341 మంది పరిశోధకులకు డాక్టరేట్ లభించింది. దేశవిదేశాల నుంచి ఎందరో వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారు. ద్వానా శాస్త్రి, అద్దేపల్లి రామ్మెహనరావు, గరికిపాటి నరసింహారావు, ఆర్ఎస్ వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, కేసాప్రగడ సత్యనారాయణ తదితరులు ఇక్కడ పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నవారే. జీతాలు సక్రమంగా రాక.. ఒకప్పుడు ఎంఏ చదివే విద్యార్థులు ఏటా 40కి పైగా ఉండేవారు. నిరంతరం సాహితీ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ప్రస్తుతం 9 మంది తెలుగు ఎంఏ చదువుతున్న విద్యార్థులు, ముగ్గురు పరిశోధకులు ఉన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రవేశ ప్రకటన ఆలస్యంగా వెలువడింది. పనిచేస్తున్నవారికి జీతాలు సక్రమంగా అందడం లేదు. సీఎం ప్రకటన సాకరమైతే.. రాజమహేంద్రవరం ప్రధానకేంద్రంగా పూర్తిస్థాయి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది సాకారమయ్యే రోజు కోస ంఎదురు చూస్తున్నాం. పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పడితే లలితకళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఇక్కడికి వస్తాయి. జాషువా కళాపీఠం, కుసుమ ధర్మన్న కళాపీఠం, బోయి భీమన్న కళాపీఠం ఏర్పడటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించాలి. రెండేళ్ల నుంచీ పీఠం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. -
వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్‌గా సాయి శివరావు
కంబాలచెరువు : (రాజమహేంద్రవరం) : గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ ఆఫీసర్‌గా పి.సాయిశివరావు నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న ఆయన డీన్‌గా పదోన్నతి పొందారు. ఈ వివరాలను కళాశాల అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి శనివారం విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా సాయి శివరావు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ పరి«ధిలోని విద్యార్థుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరంలో నూతన వ్యవసాయ కళాశాల నిర్మాణానికి తనవంతు సహకారం అందజేస్తానన్నారు. ఆయనను కళాశాల పాలక మండలి సభ్యులు జీవీ నాగేశ్వరరావు, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కందుకూరి సీతారామయ్య, అధ్యాపకులు అభినందించారు.