అంబేద్కర్ వర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల
బంజారాహిల్స్(హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విశ్వ విద్యాలయం గత నెల 30న అర్హత పరీక్షను నిర్వహించింది. మొత్తం 14,403 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా ఇందులో 12,487 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలను అంబేద్కర్ వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, అడ్మిషన్లకు ఈ నెల 25 చివరి తేదీ అని వారు తెలిపారు.