పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు..
నరసరావుపేట వెస్ట్: డిగ్రీ విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తే మానసిక వికాసంతో పాటు ఉద్యోగాలు తప్పక పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఉపకులపతి ఏ.రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడి శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ ( ఎస్ఎస్ఎన్) కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన పీజీ అడ్మిషన్ అవేర్నెస్ ప్రొగ్రామ్-2016లో ఆయన పాల్గొని మాట్లాడారు.
పీజీ చదివిన విద్యార్ధులకు మంచి అవకశాలు లభిస్తాయని వెల్లడించారు. విశ్వవిద్యాలయ డైరెక్టర్ కేఆర్ఎస్.సాంబశివరావు, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఏ.రామిరెడ్డి, డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ రామ్‌కుమార్ రత్నం తదితరులు విద్యార్ధుల సందేహాలు తీర్చారు.