deities
-
దేవతలు మాస్క్‌లు ధరించారు!
వారణాసి : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే వారణాసిలో కూడా వాయు కాలుష్యం దీపావళి తర్వాత భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలో వారణాసిలోని సిగ్రాలో ఉన్న శివపార్వతుల ఆలయంలో ఓ పూజరి వినూత్న రీతిలో దేవతామూర్తులను అలకరించాడు. కాలుష్యం నుంచి కాపాడటం కోసం దేవతామూర్తుల విగ్రహాల ముఖాలకు మాస్క్‌లు తొడిగాడు. దేవతమూర్తులను వాయు కాలుష్యం నుంచి కాపడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పూజారి హరీశ్ మిశ్రా తెలిపారు. ఆ ఆలయంలోని శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలకు మాస్క్‌లు తొడిగారు. ఇంకా, హరీశ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘వారణాసి అంటే నమ్మకానిని పుట్టినిల్లు. మనం దేవతల విగ్రహాల్లో ప్రాణమున్నట్టుగా భావిస్తాం. అందుకే దేవతా మూర్తులను సంతోషంగా, సౌకర్యంగా ఉంచేందుకు మేము ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. ఇందులో భాగంగానే వాయు కాలుష్యం నుంచి దేవతలను కాపాడేందుకు.. వారి విగ్రహాల ముఖాల మీద మాస్క్‌లు పెట్టాం. ఎండకాలంలో చల్లగా ఉండేందుకు దేవత విగ్రహాలకు చందనం రాస్తామని, చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం ఉన్నీతో కప్పేస్తామని.. ఇప్పుడు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు తొడిగామ’ని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడానికి ప్రతి ఒక్కరు ఏదో రకంగా కారకులు అవుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఆ దేవాలయంలో.. శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలను మాస్క్‌లతో అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
దేవుడికీ మద్యం చుక్క దొరకడం లేదు!
బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం మద్యంపై సంపూర్ణ నిషేధం విధించడంతో చిన్నపాటి కల్లోలమే రేగుతోంది. మద్యం దొరకక మందుబాబులు కిందామీదా పడుతుండగా.. ఆఖరికీ దేవుళ్లకు నైవేద్యంగా నివేదించేందుకు కూడా 'మద్యం' చుక్క దొరకకడం లేదు. బిహార్‌లో చాలాచోట్ల దేవుడి విగ్రహాలకు కల్లు, దేశీ మద్యమైన లిక్కర్‌ను సాకపెడతారు. ఇలా మద్యాన్ని సాక పెట్టడం, నివేదించడం కొన్నిఆలయాల్లో తప్పనిసరి కూడా. అయితే, మద్యంపై నిషేధం వల్ల దళితులు, మహా దళితులు కొలిచే దాక్ బాబా, మసాన్ బాబా, గొరైయ బాబా, దిహ్వాల్ బాబా, నౌఖా బాబా, భైరవ్ తదితర దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేందుకు మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం నిషేధం వల్ల గయాలోని పలు ప్రముఖ ఆలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. భక్తులు లేకపోవడంతో పూజారులు గోళ్లు గిల్లుకునే పరిస్థితి నెలకొంది. 'మా దేవుడు కపాల్ భైరవ మద్యాన్ని మాత్రమే సురపానంగా స్వీకరిస్తారు. కానీ నిషేధం వల్ల దాదాపు 40శాతం భక్తులు ఆలయానికి రావడం మానేశారు' అని గోదావరి మోహల్లా భైరవస్థాన్ ఆలయ పూజారి అనంత్ మరాథే తెలిపారు. డాక్ బాబా, సంషాన్ బాబా ఆలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం నిషేధం వల్ల భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తమ దేవుళ్లకు ఇష్టపానమైన మద్యాన్ని ఎలా సమర్పించాలో తెలియక వారు కూడా అవస్థలు పడుతున్నారు. -
చరిత్ర సమాధి
ఆనవాళ్లు కోల్పోయిన నాటి అపూర్వ ఆలయం శిథిలస్థితిలో చెన్నమల్లికార్జున దేవస్థానం కాలగర్భంలో కలిసిపోయిన కోటగోడ చారిత్రక కట్టడాల రక్షణకు చర్యలు శూన్యం దాచేపల్లి : జీవనది నాగులేటి ఒడ్డున 12వ శతాబ్దంలో నిర్మితమైన చెన్నమల్లికార్జుని ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లింది. సువిశాలమైన కోట గోడ .. ఆలయ గోడలపై సుందరంగా చెక్కిన దేవతా విగ్రహాలు.. నాటి శిల్ప చాతుర్యానికి సాక్షీభూతంగా నిలిచాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాదరణతో చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పల్నాటి తొలి మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ ఆధ్యాత్మికతను దశదిశల వ్యాపింప చేసేందుకు దాచేపల్లి మండలం జిట్ట గామాలపాడులో చెన్నమల్లికార్జున స్వామి ఆలయాన్ని అపూర్వంగా నిర్మించినట్లు పల్నాటి చరిత్ర చెబుతోంది. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయంను నిర్మిస్తే నాగమ్మ గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున.. ప్రశాంతమైన వాతవారణంలో ఈ ఆలయాన్ని కట్టించింది. 12వ శ తాబ్దంలో పూర్వీకుల ప్రభువులైన కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం నాగులేరును అనుకుని 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. ఆకట్టుకునే నిర్మాణ శైలి.. దేవాలయానికి నాలుగువైపుల పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వారబంధాలపై దిండి మొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మీ విగ్రహాలను రాళ్లపై చెక్కించారు. గర్భగుడి ముందు భాగంలోచెన్నమల్లికార్జున స్వామి ఆలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమామహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పు దిక్కులన ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు నిర్మించగా ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ మూడు అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడను నిర్మించారు. చెన్నమల్లికార్జున స్వామి ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై క్షీరసాగర మధనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాలు శిల్పాలను చెక్కారు. ఆనాడు ఈ దేవాలయం వద్దకు వచ్చిన నలగామరాజుకు నాయకురాలు నాగమ్మ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిందని, ఆమె పనితీరుకు మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆక్రమణ చెరలో ఆలయ భూములు.. చెన్నమల్లికార్జుని ఆలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి దేవుడిమాన్యంగా ఉండగా ఇప్పుడు కేవలం 10.40 ఎకరాలు మాత్రమే ఉంది. మిగినదంతా ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులైన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డిలు ఆలయ రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు వీటికి తగిన రక్షణ కల్పించకపోతే భావితరాలకు చరిత్ర అనవాళ్లు కూడా కన్పించకుండా పోయే ప్రమాదం ఉంది. ఆదరణ కోల్పోతున్న ఆలయం... నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ దేవాలయం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరింది. పురావస్తు శాఖ 2011లో దీనిని రక్షణ కట్టడంగా గుర్తించినప్పటికీ అభివృద్ధి కోసం నిధులను కేటాయించలేదు. ఎటువంటి రక్షణ లేకపోవటంతో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆలయం గోడల్లో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో గోడలను పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. గర్భగుడిలో కూడా తవ్వాలు జరిపిన ఆనవాళ్లున్నాయి. కోటగోడ కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయ ప్రాంగణం పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. -
రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల చోరీ
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు గర్భగుడి ఆలయం తలుపులు తెరిచి రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆలయ పరిసరాలను పరిశీలించారు. జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదే ఆలయంలో 15 ఏళ్ల క్రితం కూడా విగ్రహాలను దొంగలు ఎత్తుకుపోయారు.