వారణాసి : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే వారణాసిలో కూడా వాయు కాలుష్యం దీపావళి తర్వాత భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలో వారణాసిలోని సిగ్రాలో ఉన్న శివపార్వతుల ఆలయంలో ఓ పూజరి వినూత్న రీతిలో దేవతామూర్తులను అలకరించాడు. కాలుష్యం నుంచి కాపాడటం కోసం దేవతామూర్తుల విగ్రహాల ముఖాలకు మాస్క్‌లు తొడిగాడు. దేవతమూర్తులను వాయు కాలుష్యం నుంచి కాపడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పూజారి హరీశ్ మిశ్రా తెలిపారు. ఆ ఆలయంలోని శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలకు మాస్క్‌లు తొడిగారు.
ఇంకా, హరీశ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘వారణాసి అంటే నమ్మకానిని పుట్టినిల్లు. మనం దేవతల విగ్రహాల్లో ప్రాణమున్నట్టుగా భావిస్తాం. అందుకే దేవతా మూర్తులను సంతోషంగా, సౌకర్యంగా ఉంచేందుకు మేము ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. ఇందులో భాగంగానే వాయు కాలుష్యం నుంచి దేవతలను కాపాడేందుకు.. వారి విగ్రహాల ముఖాల మీద మాస్క్‌లు పెట్టాం. ఎండకాలంలో చల్లగా ఉండేందుకు దేవత విగ్రహాలకు చందనం రాస్తామని, చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం ఉన్నీతో కప్పేస్తామని.. ఇప్పుడు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు తొడిగామ’ని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడానికి ప్రతి ఒక్కరు ఏదో రకంగా కారకులు అవుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఆ దేవాలయంలో.. శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలను మాస్క్‌లతో అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment