షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు గర్భగుడి ఆలయం తలుపులు తెరిచి రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆలయ పరిసరాలను పరిశీలించారు. జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదే ఆలయంలో 15 ఏళ్ల క్రితం కూడా విగ్రహాలను దొంగలు ఎత్తుకుపోయారు.