Delhi Dabangg
-
PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్‌తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్‌లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
యూ ముంబాదే విజయం
హైదరాబాద్, నవంబర్ 5: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా 32-26తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. మంజీత్(9 పాయింట్లు), జాఫర్దనేశ్(5), సోమ్‌బీర్(3)..యూ ముంబా విజయంలో కీలకమయ్యారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక టై ఎదుర్కొన్న ముంబా ప్రస్తుతం 19 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు పోరాడి ఓడిన ఢిల్లీ 14 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఢిల్లీ తరఫున అషు మాలిక్(11) సూపర్-10 సాధించినా లాభం లేకపోయింది. యోగేశ్(6), రింకూ నార్వల్(2) ఆకట్టుకున్నారు.ఆది నుంచే హోరాహోరీ: యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ రైడర్ నవీన్‌కుమార్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగగా, యూ ముంబా సమిష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఇరు జట్లు తమ తొలి రైడ్లలో పాయింట్లను సొంతం చేసుకోలేకపోయాయి. లీగ్‌లో వరుస ఓటములతో ఢిల్లీ తల్లడిల్లుతుంటే యూ ముంబా ప్రయాణం పడుతూలేస్తూ అన్నట్లు సాగుతున్నది. సందీప్‌ను ఔట్ చేసిన అజిత్ చవాన్..ముంబాకు తొలి పాయింట్ అందించగా, డూ ఆర్ డైకు వెళ్లిన ఢిల్లీ రైడర్ అషు మాలిక్..పర్వేశ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గేర్ మార్చిన యూ ముంబాకు మంజీత్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు అందించి మంచి జోష్ నింపాడు.మరోవైపు అషు మాలిక్ వరుస రైడ్లలో ఢిల్లీకి పాయింట్లు అందిస్తూ పోవడంతో ఇరు జట్లు స్కోరు సమంగా సాగింది. ఢిల్లీ రైడర్ వినయ్ ఉత్త చేతులతో తిరిగిరాగా, అషు మాలిక్ తనదైన జోరు కొనసాగించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో మంజీత్ స్థానంలో లోకేశ్ ముంబా జట్టులోకి వచ్చాడు. 11వ నిమిషంలో ముంబా రైడర్ జాఫర్దనేశ్..రింకూ నార్వల్ను ఔట్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే 8వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన జాఫర్దనేశ్కు యోగేశ్ నుంచి చుక్కెదురైంది. ఇలా ఇరు జట్ల రైడర్లు, డిఫెండర్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ముగిసే సరికి యూ ముంబా 13-13 ఢిల్లీ దబాంగ్ సమవుజ్జీలుగా నిలిచాయి.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన ఢిల్లీ రైడర్ మోహిత్‌ను సోమ్భీర్ గట్టిగా పట్టుకోవడంతో ముంబా ఖాతాలో పాయింట్ చేరింది. అదే ఊపులో 17వ నిమిషంలో యోగేశ్, సందీప్‌ను ఔట్ చేసిన మంజీత్..ముంబాకు రెండు పాయింట్లు అందించాడు. నిమిషం తేడాతో జాఫర్దనేశ్..అశిష్, రింకూ నార్వల్ను ఔట్ చేయడంతో ఢిల్లీ తొలిసారి ఆలౌటైంది. ఈ క్రమంలో రెండు జట్లు సబ్స్టిట్యూషన్స్కు మొగ్గుచూపుతూ మార్పులు చేశాయి.ఓవైపు ఢిల్లీకి అషు మాలిక్ కీలకమైతే..మరోవైపు యూ ముంబాకు సునీల్ పెద్దదిక్కు అయ్యాడు. ఆట సాగుతున్నా కొద్ది యూ ముంబా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అషు మాలిక్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఢిల్లీకి పాయింట్ అందించడంలో సఫలమయ్యాడు. అయితే అతనికి రైడింగ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మ్యాచ్ 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన రోహిత్ రాఘవ్‌ను బిజేంద్ర పట్టేయడంతో ఢిల్లీకి పాయిట్ దక్కింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఢిల్లీ గెలిచేందుకు ప్రయత్నించినా..పట్టు వదలకుండా పోరాడిన యూ ముంబా విజయం సొంతం చేసుకుంది. -
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్‌కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
Pro Kabaddi League 2023: తలైవాస్ శుభారంభం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు శుభారంభం చేసింది. మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 42–31 పాయింట్ల తేడాతో గెలిచింది. తలైవాస్ తరఫున రెయిడర్స్ అజింక్య పవార్ 21 పాయింట్లు, నరేందర్ 8 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్ 14 పాయింట్లు సాధించాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34–31తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ తరఫున సోను 12 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్; బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్‌పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది. -
చివర్లో తారుమారు
- ఢిల్లీ అద్భుత విజయం - ప్రొ కబడ్డీ లీగ్-2 కోల్‌కతా: చివరి సెకను దాకా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పైచేయి సాధించింది. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ 38-37తో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ముగియడానికి మరో 90 సెకన్లు ఉందనగా ఢిల్లీ 35-37తో వెనుకబడి ఉంది. ఈ దశలో రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ అడకె ఒక పాయింట్ సాధించాడు. దాంతో తేడా ఒక పాయింట్‌కు తగ్గింది. ఆ తర్వాత పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్‌సింగ్ రైడింగ్‌కు వచ్చినా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాడు. మరోసారి రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ ఈసారీ ఒక పాయింట్ సంపాదించడంతో స్కోరు 37-37తో సమమైంది. ఈ దశలో చివరి సెకన్లలో రైడింగ్‌కు వచ్చిన పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్ సింగ్‌ను ఢిల్లీ జట్టు ఆటగాళ్లు పట్టుకోవడంతో ఆ జట్టు పాయింట్ తేడాతో విజ యాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఢిల్లీ రైడర్లు కాశిలింగ్ 12 పాయింట్లు, రోహిత్ కుమార్ చౌదరీ 11 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. పుణేరి జట్టులో కెప్టెన్ వజీర్ సింగ్ 13 పాయింట్లతో రాణించినా కీలకమైన చివరి రైడింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు చిక్కి మూల్యం చెల్లించుకున్నాడు. యు ముంబా జోరు: మరోవైపు గతేడాది రన్నరప్ యు ముంబా జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి 25 పాయిం ట్లతో టాపర్‌గా ఉంది. బెంగాల్ వారియర్స్‌తో జరి గిన మ్యాచ్‌లో యు ముంబా 29-25తో గెలిచింది. విరామ సమయానికి 16-23తో వెనుకబడిన యు ముంబా రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. ఏకంగా 13 పాయింట్లు నెగ్గి, ప్రత్యర్థికి కేవలం రెండు పాయింట్లే ఇచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగళూరు బుల్స్ x పుణేరి పల్టన్ రాత్రి గం. 8.00 నుంచి బెంగాల్ వారియర్స్ x ఢిల్లీ దబాంగ్ రాత్రి గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం