అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు శుభారంభం చేసింది. మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 42–31 పాయింట్ల తేడాతో గెలిచింది. తలైవాస్ తరఫున రెయిడర్స్ అజింక్య పవార్ 21 పాయింట్లు, నరేందర్ 8 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్ 14 పాయింట్లు సాధించాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34–31తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ తరఫున సోను 12 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్; బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment