
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్‌పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment