Delhi public school
-
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం విదితమే. నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈలోపే దేశ రాజధానిలోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపులు అందాయి. ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి ఢిల్లీ స్కూల్లో బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని క్యాంపస్ నుంచి ఖాళీ చేయించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. టూరిస్టులను వెంబడించిన గజరాజు -
Best Teacher Award: గురు దేవోభవ!
బడి... బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి. ఆ ఒడిలో పిల్లలు హాయిగా అక్షరాలు దిద్దాలి. భవిష్యత్తును బంగారంగా దిద్దుకోవాలి. బిడ్డల భవిష్యత్తును దిద్దే చేతులకు వందనం. ఉపాధ్యాయ వృత్తికి వందనం. వృత్తికి వన్నె తెచ్చిన గురువులకు వందనం. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అంటే విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఓ గుర్తింపు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కానూరు ‘జిల్లా పరిషత్ హైస్కూల్’ ఫిజిక్స్ టీచర్ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సునీతారావు, రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మాది మైసూర్. బాల్యం హైదరాబాద్‌లోనే. ఐదవ తరగతి వరకు సెయింట్ ఆన్స్‌లో చదివాను. ఆరవ తరగతి నుంచి చెన్నై. నా బోధన ప్రస్థానం కర్నాటక రాష్ట్రం తుముకూరులోని టీవీఎస్ అకాడమీలో మూడవ తరగతి టీచర్‌గా మొదలైంది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే నేను చదువు చెబుతూ చదువుకున్నాను. ఉద్యోగం చేస్తూ ఎంఏ ఎకనమిక్స్, ఎంఫిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో డిప్లమో, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాను... ఇలా ఏటా స్కూల్ వెకేషన్‌ని నేను ఏదో ఒక కోర్సుకోసం ప్లాన్ చేసుకునేదాన్ని. నాకిష్టమైన గణితం కోసం చెన్నైలోని రామానుజమ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను. ముప్పై రెండేళ్ల సర్వీస్‌లో నేను పిల్లలకు ఎన్నో నేర్పించాను, అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్నాను. టీచర్ ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న విషయాన్ని చెప్పి పాఠాలు ముగిస్తే సరిపోదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ పాఠం చెప్పాలి. అలాగే ఏ తరగతికి అవసరమైతే ఆ తరగతికి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను థర్డ్ క్లాస్ టీచర్‌గా చేరినా, అవసరమైనప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌కి కూడా పాఠాలు చెప్పాను. పన్నెండో తరగతి టీచర్ అయినా సరే ఒకటవ తరగతి టీచర్ లేనప్పుడు ఆ క్లాస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాఠాన్ని సృజనాత్మకంగా చెప్పాలి. పిల్లలకు ఏ పదాలు అర్థం అవుతున్నాయో ఆ పదాల్లో వివరించాలి. వృత్తి పట్ల గౌరవం, విశ్వాసం ఉండాలి. రూల్స్‌కోసం పని చేసే వృత్తి కాదిది. అవసరమైన విధంగా ఒదిగిపోవాలి. కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రుల కంటే ముందు పసిగట్టగలిగింది టీచర్ మాత్రమే. పేరెంట్స్ వచ్చి చెప్పేవరకు టీచర్ గుర్తించని స్థితిలో ఉండకూడదు. అలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను నేను. వాళ్లతో విడిగా మాట్లాడి, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి కోసం మెంటార్‌గా ఒక టీచర్‌కు బాధ్యత అప్పగించడం ద్వారా ఆ స్టూడెంట్ తిరిగి చదువుమీద మునుపటిలా ధ్యాస పెట్టేవరకు కనిపెట్టి ఉండాలి. అలాంటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంటారు. టీచర్‌గా అత్యంత సంతోష పడే క్షణాలవి. గురుశిష్యుల బంధం విద్యార్థులు అమ్మానాన్న తర్వాత ఆదర్శంగా తీసుకునేది టీచర్నే. అందుకే టీచర్ గౌరవప్రదంగా కనిపించాలి. ఆహార్యం, మాటతీరు, నడవడిక... ప్రతి విషయంలోనూ ఆదర్శనీయంగా ఉండాలి. గురుశిష్యుల బంధం ఉన్నతమైంది. స్టాఫ్‌రూమ్‌లో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. విద్యాబోధనకు అవసరమైన చర్చలే ఉండాలి. అలాగే ప్రతి టీచరూ క్లాస్‌కి వెళ్లే ముందు ఏం చెప్పాలనే విషయం మీద తప్పనిసరిగా హోమ్‌వర్క్ చేయాలి, పాఠం చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పానా లేదా అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే ఒక టీచర్‌గా నా తోటి ఉపాధ్యాయులకు నేను చెప్పగలిగిన మంచిమాట’’ అన్నారు సునీతారావు. పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు! ప్రిన్సిపల్‌గా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కరికులమ్ రూపొందిస్తుంటాను. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాల్సిన తరం ఇది. ఒకప్పటిలా సిలబస్‌కే పరిమితమైతే సరిపోదు. క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యం. విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావం, నిజాయితీ వంటివన్నీ వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏదో ఒకటి ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతుంది. మా దగ్గర స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే విద్యార్థులకు అవసరమైన సెలవులు ఇవ్వడం, వారి కోసం సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పించి పరీక్షలు పెట్టడం వంటి మార్పులు చేశాను. టీచర్ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడమే కాదు, వారి భవిష్యత్తు కలలకు ఒక రూపం ఇవ్వాలి, ఆ కలల సాకారానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి. – సునీతారావు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, సికింద్రాబాద్ సైన్స్ ఎక్కడో లేదు... ‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీస్ మీద íపీహెచ్డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నాను. ప్రత్యామ్నాయం వెతకాలి! సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్ అలా ఫెయిల్ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్ మస్కిటో రిపెల్లెంట్ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్ ఎడ్యుకేషన్‌కి వాటర్ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్ ఇన్స్పైర్ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్ సిటిజన్ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది. – రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నడిపూడి కిషోర్ -
నిఖిల్‌కు ఆర్థిక సహాయం.. రూ. లక్ష నగదు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫ్రీస్టయిల్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ కుర్రాడు నిఖిల్ యాదవ్‌కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) యాజమాన్యం ఆర్థిక సహాయం చేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమురయ్య నిఖిల్‌కు రూ. లక్ష నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు. తండ్రి, మాజీ రెజ్లర్ సురేశ్ యాదవ్ అడుగుజాడల్లో నడుస్తున్న నిఖిల్ ప్రస్తుతం బళ్లారిలోని ఇన్‌స్పయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. 2011లో హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దేవీ సింగ్ ఠాకూర్ కాంస్య పతకం గెలిచిన తర్వాత... నిఖిల్ రూపంలో మరో హైదరాబాద్ రెజ్లర్ ప్రపంచ జూనియర్ టోర్నీలో పతకం సాధించాడు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రతినిధి మల్కా యశస్వి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, నిఖిల్ తల్లి మమత, సోదరుడు అఖిల్, అంతర్జాతీయ మాజీ రెజ్లర్ అభిమన్యు, తెలంగాణ కేసరి రెజ్లర్ మెట్టు శివ పహిల్వాన్, కరాటే మాస్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే! -
డీపీఎస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) నాచారం జట్టు సత్తా చాటింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన అండర్–19 బాలుర ఫైనల్లో డీపీఎస్ నాచారం జట్టు 6–5తో కాకతీయ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. మరోవైపు అండర్–17 బాలుర ఫైనల్లో నేవీ చిల్డ్రన్ స్కూల్ 2–0తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ విభాగంలో హెచ్‌పీఎస్ రామంతాపూర్, డీపీఎస్ ఖాజాగూడ జట్లు సంయుక్తంగా మూడోస్థానాన్ని దక్కించుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ అలీ రఫాత్, డీపీఎస్ చైర్మన్ కొమురయ్య, ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
డీపీఎస్ జట్టు ముందంజ
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, నాచారం) జట్టు ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలుర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో డీపీఎస్ 3–0తో నవభారత్ పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ 9–0తో విద్యానికేతన్‌పై, డీఏవీ పబ్లిక్ స్కూల్ 4–3తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, కెన్నడీ హైస్కూల్ 6–0తో వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్‌పై, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 4–0తో గంగాస్ వ్యాలీ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ రామంతాపూర్ 3–0తో డీపీఎస్ డైమండ్ పాయింట్‌పై, నేవీ చిల్డ్రన్ స్కూల్ 5–0తో టైమ్ స్కూల్‌పై గెలుపొందాయి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ, డీపీఎస్ చైర్మన్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. చిరెక్ స్కూల్ జట్లకు మిశ్రమ ఫలితాలు సీబీఎస్ఈ క్లస్టర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ రెండో రోజు చిరెక్ స్కూల్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండస్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన అండర్–17 బాలుర విభాగంలో చిరెక్ స్కూల్ (తెలంగాణ) 19–17తో డీపీఎస్ నాచారంపై గెలుపొందింది. అండర్–19 విభాగంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ (తెలంగాణ) 47–24తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఇండస్ స్కూల్ (తెలంగాణ) 28–15తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ (తెలంగాణ)పై, గ్లెండేల్ అకాడమీ (తెలంగాణ) 47–24తో భారతీయ విద్యా భవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ (ఏపీ)పై, సీఆర్పీఎఫ్ పబ్లిక్‌స్కూల్ (తెలంగాణ)21–11తో వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌పై విజయం సాధించాయి. హైజంప్‌లో శామ్సన్‌కు స్వర్ణం మరోవైపు గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన అండర్–19 బాలుర హైజంప్ ఈవెంట్లో అక్షర విద్యాలయకు చెందిన శామ్సన్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. అతను 1.70మీ ఎత్తుకు జంప్ చేయగా, రజతాన్ని గెలుచుకున్న కృతార్థ్ రెడ్డి (ఎస్వీఐఎస్) 1.65మీ. ఎత్తు జంప్ చేశాడు. ఈ విభాగంలో భవన్స్ స్కూల్‌కు చెందిన హన్సాన్ బేగ్ (1.40మీ.) కాంస్యాన్ని గెలచుకున్నాడు. అండర్– 14 బాలికల లాంగ్‌జంప్‌లో పి. ప్రణీత విజేతగా నిలిచింది. బీవీబీ స్కూల్‌కు చెందిన ప్రణీత 4.15మీ. దూరం జంప్‌చేసి అగ్రస్థానంలో నిలవగా, కేసీపీ సిద్ధార్థ్ స్కూల్ విద్యార్థిని దేవి గాయత్రి, వి. శ్రీ పూజిత (ఆదిత్య బిర్లా స్కూల్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 800 మీ. పరుగు: 1. శ్రేష్ట (కామర్ కాన్వెంట్), 2. కషుషా (నవభారత్), 3. శ్రేయ (డీపీఎస్) అండర్–17 బాలికల జావెలిన్ త్రో: 1. జి. ప్రణతి (డిఫెన్స్ లేబొరేటరి), 2. తేజ శ్రీ (వీపీఎస్), 3. క్రాంతి (సంగమిత్ర). బాలుర 200మీ. పరుగు: 1. వెంకట్ సాయి (వికాస్), 2. కె. కిషోర్ (హెచ్‌పీఎస్ రామంతాపూర్), 3. ఎస్. లోహిత్ (శ్రీ ప్రకాశ్). షాట్‌పుట్: 1. మురళి (అక్షర విద్యాలయ), 2. డి. మణికంఠ (ఎస్వీసీఎస్), 3. మోక్షజ్ఞ (ఏపీఎస్). 3000మీ.: 1. డి. సంతోష్ (హెచ్‌పీఎస్), 2. రహమాన్, 3. మహిపాల్ (ఏసీఈఎస్). హైజంప్: 1. నికేశ్ (అక్షర), 2. రామ్‌చరణ్ (ఎంఎన్ఆర్ స్కూల్), 3. శ్రీకిరణ్ (సీఆర్పీఎఫ్). జావెలిన్: 1. ఆకాశ్ (అకర్డ్ స్కూల్), 2. కె. ప్రవీణ్ (ఆర్మీ స్కూల్). 400మీ.: 1. పృథ్వీ (డీఏవీ పబ్లిక్ స్కూల్), 2. విశాల్ (వీపీఎస్), 3. లక్ష్మణ్ తేజ్ (ఎంఎన్ఆర్). అండర్–19 బాలుర జావెలిన్ త్రో: 1. జి. శివగణేశ్ (హెచ్‌పీఎస్), 2. దేవ కుమార్ (అక్షర విద్యాలయ), 3. రిషి వర్ధన్ (అకర్డ్ స్కూల్). -
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
మాసబ్‌ట్యాంక్: చిన్నారుల ఆట పాటల నడుమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయిశుక్రవారం నాదేర్గుల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందుంటుందన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ సినీ నటుడు లోహిత్ కుమార్ మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఏఎస్ఎల్ అసోసియేషన్ డెరైక్టర్, అగ్ని ఫైవ్స టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ కేఆర్ గుప్తా, ఇబ్రహీంపట్నం ఏసీపీతో పాటు పాఠశాల చైర్మన్ మల్క కొమరయ్య, వైస్ చైర్మన్ భీమసేన్, డెరైక్టర్ పల్లవి, అకాడమిక్ డెరైక్టర్ డాక్టర్ సుధ, పాఠశాల కోశాధికారి శ్రీ ప్రనరుు, సునీతారావు, పద్మ జ్యోతి పాల్గొన్నారు. -
మాస్క్ లేకుండా పిల్లలను స్కూల్ కు పంపొద్దు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించేలా చూడాలని తల్లిదండ్రులకు అక్కడి స్కూళ్లు మెసేజ్ లు పంపుతున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన పిల్లలను చదివిస్తున్న ఓ వ్యక్తి ఫోన్ కు వచ్చిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది. గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మీ పిల్లలను పాఠశాలకు పంపే ముందు మాస్క్ ను ధరించేలా చేయాలని సూచించింది. దీపావళి పర్వదినం తర్వాత కమ్ముకున్న కాలుష్య వాయువులు రాజధానిని ఇప్పటీకీ వదలడం లేదు. గత 17ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ అధ్వాన్నమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం ఒక్క రోజులో 40 సిగరెట్లు స్మోక్ చేసినంతకు సమానమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిని శుభ్రపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కోర్టులో 200 పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. -
డీపీఎస్ ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు
కొరాపుట్ : దమనజొడి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) విద్యార్థినులపై ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ విద్యార్ధిల నుంచి ఫిర్యాదు అందుకొన్న ఆమె కొరాపుట్ బ్లాకు విద్యాధికారిణి అర్పిత ప్రధాన్‌తో పాటు దమనజొడి ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు వెళ్లి విచారణ జరిపారు. ఉపాధ్యాయులు సిద్ధార్ధ శంకర్ చౌదరి, డి.పి.పండ,ఆశిశ్ శత్పతి, నబకిషోర్ పండ, ప్రశాంత నాయక్, బిశ్వనాథ్ బారిక్, ఎస్.కె.ఎమ్ యొహలు ఉద్ధేశ్యపూర్వకంగా తమ శరీరాలను స్పశిస్తూ శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని 8,9 తరగతి విద్యార్థినులు 15 మంది ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల చర్యలు కూడా లైంగిక వేధింపులు కిందకు వస్తాయన్నారు. ఈ విషయాన్ని కలెక్టరుకు తెలియజేశామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జయకుమార్ ఆరోపణలు ఎదుర్కొంతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కలెక్టరు ఆదేశాల మేర దమనజొడి పోలీసు స్టేషన్లో శనివారం పోలీసు కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. పూర్తి విచారణ తరువాత ఉపాధ్యాయులపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ చెప్పారు. -
ఆర్కెపురం డీపీఎస్ ప్రిన్సిపాల్ కుమార్తె ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కెపురం శాఖ ప్రిన్సిపాల్ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. స్కూలు ఆవరణలో ఉన్న తండ్రి అధికారిక నివాసంలో 29 సంవత్సరాల అంజనా సైనీ మృతదేహం బుధవారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కుటుంబసభ్యులు కుమార్తె మృతదేహాన్ని దింపి పోలీసులకు సమాచారం అందించకుండానే వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అయితేఅప్పటికే అంజనా సైనీ మరణించిదని వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి అధికారులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజన గదిలో పోలీసులకు ఆమె రాసిన సూయిసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని అంజన ఆ లేఖలో పేర్కొంది. తన మరణానికి అంజనా పేర్కొన్న కారణాలను పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. అంజన రాసిన లేఖను పోలీసులు చేతిరాత నిపుణుల పరిశీలనకోసం పంపారు. మృతురాలు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేదని, తన తండ్రి డా.డి. ఆర్. సైనీ నివాసంలోనే ఉండేదని పోలీసులు తెలిపారు. పెళ్లి కాకపోవడంతో అంజన మానసిక వేదనకు గురైందని అంటున్నారు. అంజన మృతదేహానికి ఎయిమ్స్‌లో పోస్టుమార్టం జరుగనుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైనీ కుటుంబసభ్యులు, మిత్రులను ప్రశ్నిస్తున్నారు. కాగా నగరంలో ప్రసిద్ధిగాంచిన పాఠశాలల్లో డీపీఎస్ ఒకటి. -
విజేత ఢిల్లీ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: మల్క కొమరయ్య (ఎం.కె.) అంతర పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్లో అండర్-15, 17 విభాగాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) విజేతగా నిలిచింది. అండర్-17 విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో డీపీఎస్ (నాచారం) జట్టు 17 పరుగుల తేడాతో సెయింట్ పీటర్స్ (బోయిన్పల్లి) జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. యశస్వి (47 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), భావిన్ (4 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి డీపీఎస్‌కు భారీ స్కోరునందించారు. అనంతరం సెయింట్ పీటర్స్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్రీజిత్ (22 బంతుల్లో 33) ఒక్కడే రాణించాడు. అండర్-15 ఫైనల్లోనూ డీపీఎస్ (నాచారం) జట్టు సెయింట్ పీటర్స్ (బోయిన్పల్లి) జట్టుపైనే ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... భావిన్ (24 బంతుల్లో 34) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సెయింట్ పీటర్స్ 7 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికాస్ (26 బంతుల్లో 26) ఒక్కడే పోరాడాడు. డీపీఎస్ బౌలర్లు అమృత్ (2/17), అన్విత్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. భవాన్స్ గెలుపు ఇదే టోర్నీ అండర్-13 విభాగంలో భవాన్స్ (సైనిక్‌పురి) జట్టు విజేతగా నిలిచింది. డీపీఎస్ (నాచారం)తో జరిగిన ఫైనల్లో భవాన్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... అమృత్ (36 బంతుల్లో 51), రిషి (18 బంతుల్లో 23) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్.. వికెట్లేమీ కోల్పోకుండానే 101 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ (31 బంతుల్లో 51) అర్ధసెంచరీతో భవాన్స్‌కు విజయాన్నందించాడు. -
మూడు బస్సులు దగ్ధం: నిప్పుపెట్టిన దుండగులు
హైదరాబాద్: నాచారంలో కొందరు దుండగులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఈ మూడు బస్సులు దగ్థమయ్యాయి. ఆపి ఉన్న బస్సులకు నిప్పు పెట్టారు. బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. మూడు బస్సులు కాలిపోవడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బస్సుల దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టూడెంట్స్ జోష్..