హైదరాబాద్: నాచారంలో కొందరు దుండగులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఈ మూడు బస్సులు దగ్థమయ్యాయి. ఆపి ఉన్న బస్సులకు నిప్పు పెట్టారు. బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు.
మూడు బస్సులు కాలిపోవడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బస్సుల దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు బస్సులు దగ్ధం
Published Sat, Apr 12 2014 8:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
Advertisement
Advertisement