న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కెపురం శాఖ ప్రిన్సిపాల్ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. స్కూలు ఆవరణలో ఉన్న తండ్రి అధికారిక నివాసంలో 29 సంవత్సరాల అంజనా సైనీ మృతదేహం బుధవారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కుటుంబసభ్యులు కుమార్తె మృతదేహాన్ని దింపి పోలీసులకు సమాచారం అందించకుండానే వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అయితేఅప్పటికే అంజనా సైనీ మరణించిదని వైద్యులు ప్రకటించారు.
ఆసుపత్రి అధికారులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజన గదిలో పోలీసులకు ఆమె రాసిన సూయిసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని అంజన ఆ లేఖలో పేర్కొంది. తన మరణానికి అంజనా పేర్కొన్న కారణాలను పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. అంజన రాసిన లేఖను పోలీసులు చేతిరాత నిపుణుల పరిశీలనకోసం పంపారు. మృతురాలు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేదని, తన తండ్రి డా.డి. ఆర్. సైనీ నివాసంలోనే ఉండేదని పోలీసులు తెలిపారు. పెళ్లి కాకపోవడంతో అంజన మానసిక వేదనకు గురైందని అంటున్నారు. అంజన మృతదేహానికి ఎయిమ్స్‌లో పోస్టుమార్టం జరుగనుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైనీ కుటుంబసభ్యులు, మిత్రులను ప్రశ్నిస్తున్నారు. కాగా నగరంలో ప్రసిద్ధిగాంచిన పాఠశాలల్లో డీపీఎస్ ఒకటి.
ఆర్‌కెపురం డీపీఎస్ ప్రిన్సిపాల్ కుమార్తె ఆత్మహత్య
Published Wed, Oct 22 2014 11:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement